మారుతి సుజుకి వ్యాగన్ఆర్ క్రెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు

By Ravi

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 5 కార్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ క్రెస్ట్ పేరుతో విడుదలైన ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో స్టాండర్డ్ వ్యాగన్ఆర్‌లో లభించే ఫీచర్ల కన్నా అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

ఈ లిమిటెడ్ ఎడిషన్ వ్యాగన్ఆర్ క్రెస్ట్‌లో సుమారు రూ.32,500ల విలువైన అదనపు ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే, స్టాండర్డ్ వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ వ్యాగన్ఆర్ క్రెస్ట్ ధర రూ.22,500లు అధికంగా ఉంటుంది. ఈ వేరియంట్ కొనుగోలుపై కస్టమర్లు సుమారు రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

మరి వ్యాగన్ఆర్ క్రెస్ట్‌లో మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న ఆ అదనపు ఫీచర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

తర్వాతి స్లైడ్‌లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ క్రెస్ట్ లిమిటెడ్ ఎడిషన్‌లోని ఫీచర్ల వివరాలను తెలుసుకోండి.

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్.

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

కీలెస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన అసిస్టివ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్.

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్ (బాడీ కలర్‌లో)

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

విశిష్టమైన సీట్ కవర్స్ (డ్యూయెల్ టోన్‌లో)

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

స్టయిలిష్ వీల్ కవర్స్ (అల్లాయ్ వీల్ లుక్‌నిచ్చేలా)

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

లిమిటెడ్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్ ఫీచర్లు

మారుతి వ్యాగన్ఆర్ క్రెస్ట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.0 లీటర్, 3-సిలిండర్, కె10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన ప్రకారం, పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్ లీటరుకు 20.5 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.6 కి.మీ. మైలేజీ మరియు ఎల్‌పిజి వెర్షన్ కేజీకి 14.6 కి.మీ. మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki has launched a new limited edition model in its popular hatchback WagonR. Called the WagonR Krest, it gets a host of additional features like a new front grille, slightly redone front bumper and a set of body graphics.
Story first published: Thursday, September 25, 2014, 18:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X