మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్స్, వీటికి డ్రైవర్‌తో పనిలేదు..

Written By:

టెక్నాలజీకి అవధులు లేవు, దీని పరిమాణం అనంతమైనది, రోజుకో కొత్త ఆవిష్కరణంలతో టెక్నాలజీ విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకూ అనేక కార్ కంపెనీలు డ్రైవ్‌లెస్ అటానమస్ (డ్రైవర్ సాయం లేకుండా యాంత్రికంగా నడిచే) కార్లను తయారు చేస్తుంటే, జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసి డ్రైవర్‌లెస్ ట్రక్కులను అభివృద్ధి చేసింది.

మెర్సిడెస్ బెంజ్ నుంచి భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న ఈ భారీ వాణిజ్య వాహనాలను అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో ఈ ట్రక్కుల సరుకుల రవాణా సురక్షితంగాను మరియు సులభతరంగాను చేసేందుకు మెర్సిడెస్ బెంజ్ 'ఆటో పైలట్' లాంటి టెక్నాలజీని ఈ వాణిజ్య వాహనాల్లో ఉపయోగించింది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్స్

తర్వాతి స్లైడ్‌లలో మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్స్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోండి.

హైవే పైలట్

హైవే పైలట్

విమానాలలో ఉండే ఆటో పైలట్ ఫీచర్ మాదిరిగా ఈ మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్కులలో హైవే పైలట్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత డ్రైవర్ వెళ్లాల్సిన గమ్యాన్ని అందులో నిర్దేశిస్తే చాలు, జిపిఎస్ సాయంతో ట్రక్ ఆటోమేటిక్‌గా ఆ ప్రదేశానికి చేరిపోతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్స్

డ్రైవర్ హైవే పైలట్ మోడ్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇక ట్రక్కులోని ఏ కంట్రోల్స్ (యాక్సిలేటర్, బ్రేక్, స్టీరింగ్ మొదలైన వాటిని)ను అతను యాక్సిస్ చేయాల్సిన పని ఉండదు. వీటన్నింటినీ సదరు ట్రక్కే ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకుంటుంది. ఒకవేళ డ్రైవర్ రిలాక్స్ కావాలనుకుంటే, అతను తన సీటును వెనక్కు జరుపుకొని 45 డిగ్రీల కోణంలో తిప్పుకొని, కాళ్లు చాపుకోవచ్చు. ఒక్క బటన్ నొక్కనే ఇదంతా జరిగిపోతుంది.

వి2వి, వి2ఐ కమ్యూనికేషన్

వి2వి, వి2ఐ కమ్యూనికేషన్

ఈ ఫ్యూచర్ ట్రక్కులు సెన్సార్లను ఆధారంగా చేసుకొని పనిచేస్తాయి, ఈ సెన్సార్లే ట్రక్కులోని సాంకేతిక వ్యవస్థకు సమాచారన్ని చేరవేస్తాయి. కెమెరాలు, రియల్ టైమ్ మ్యాప్స్ సాయంతో ఈ ట్రక్కులు ఇతర వాహనాలు, భవంతులతో కమ్యూనికేట్ అవుతాయి.

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్స్

ఇందులో వి2వి అంటే వెహికల్ టూ వెహికల్ కమ్యూనికేషన్ అని, వి2ఐ అంటే వెహికల్ టూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనికేషన్ అని అర్థం. ట్రక్కులోని సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్న టాబ్లెట్ సాయంతో దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో వి2వి చాలా చక్కగా పనిచేస్తుంది. రోడ్డుపై ఏదైనా అంబులెన్స్ లేదా పోలీస్ కార్‌కు దారి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ట్రక్కు గివ్ వే లైన్‌కు మారిపోతుంది.

రివర్స్ పార్కింగ్ ఆన్ ది గో

రివర్స్ పార్కింగ్ ఆన్ ది గో

పేరుకు తగినట్లుగానే డ్రైవర్ తన ప్రయాణ మార్గంలో ఎక్కడైనా వాహనాన్ని పార్క్ చేయాలనుకుంటే, ముందుగానే పార్కింగ్ స్పాట్‌ను తన టాబ్లెట్ సాయంతో ఎంచుకోవచ్చు. అదే టాబ్లెట్ సాయంతో అతను తన ట్రక్కును రివర్స్ పార్క్ కూడా చేయవచ్చు. అంతేకాదు, తన ప్రయాణ మార్గంలో డ్రైవర్‌కు కావల్సిన భోజనాన్ని కూడా ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు.

ప్లానింగ్ ఆన్ ది గో

ప్లానింగ్ ఆన్ ది గో

డ్రైవర్ తన ఖాలీ సమయాన్ని ఉపయోగించుకొని, తన తర్వాతి ట్రిప్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, అతను ఓ రిఫ్రిజిరేటర్ ట్రైలర్‌ను పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు, అతను ఓ అప్లికేషన్ సాయంతో ట్రక్ ట్రైలర్ టెంపరేచర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇలా చేయటం వలన అతను రిఫ్రిజిరేటెడ్ ట్రైలర్‌‌ను పిక్ చేసుకునే సమయానికి ట్రక్ ట్రైలర్ టెంపరేచర్ సరిగ్గా సరిపోతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఫ్యూచర్ ట్రక్స్

ఈ సదుపాయాలు, సౌకర్యాలన్నింటి వలన భవిష్యత్తులో ట్రక్కుల ప్రయాణం మరింత సురక్షితంగాను, సౌకర్యంగాను మారిపోనుంది. వీటిని అభివృద్ధి చేస్తోంది మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్ ఏజి. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థలలో ఇది కూడా ఒకటి. జర్మనీలోని స్టట్‌గార్ట్‌కు చెందిన ఈ సంస్థను 1998లో స్థాపించారు.

English summary
Technology has evolved in the commercial vehicle industry, and how. Some of the best technology has been introduced in the modern world which eases the driving experience and also makes the road a safer place. Keeping this in mind, Mercedes have launched their latest Future Trucks.
Story first published: Monday, July 7, 2014, 12:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark