కొత్త 2015 టొయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్ 4x4 విడుదల

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి 'ఇన్నోవా'లో కంపెనీ ఓ అప్‌డేటెడ్ వెర్షన్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త 2015 టొయోటా ఇన్నావా ఎమ్‌పివి ధరలు రూ.10.51 లక్షల నుంచి రూ.15.80 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

అలాగే.. కంపెనీ విక్రయిస్తున్న మరో పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'ఫార్చ్యూనర్'లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త టొయోటా ఫార్చ్యూనర్ 4x4 ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.24.17 లక్షల నుంచి రూ.26.49 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Fortuner

భారత మార్కెట్లో ఇన్నోవా బ్రాండ్‌ను ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ రెండూ కూడా ఓ కొత్త ఒరవడిని సృష్టించాయని కంపెనీ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఎన్ రాజా అన్నారు.

ఇదిలా ఉండగా.. భారత మార్కెట్లో మాస్ సెగ్మెంట్లో తాము విక్రయిస్తున్న అన్ని మోడళ్లు మరియు అన్ని వేరియంట్లలో ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్న ఏకైక తయారీదారు తామేనని టికెఎమ్ పేర్కొంది.

Innova

కొత్త ఇన్నోవాలో ఉడ్ ఫినిష్ స్టీరింగ్ వీల్, ఓక్ ఇంటీరియర్స్, రీడిజైన్డ్ లెథర్ సీట్స్, డార్క్ గ్రే డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి. కాగా.. ఇంజన్ పరంగా మాత్రం కొత్త ఇన్నోవాలో ఎలాంటి మార్పులు లేవు.

టొయోటా ఫార్చ్యూనర్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ వేరియంట్‌లో ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్, నావిగేషన్ సిస్టమ్, వాయిస్ కమాండ్స్, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, 17-ఇంచ్ 12-స్పోక్ డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ విత్ సిల్వర్ కేసింగ్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు ఉన్నాయి.

Most Read Articles

English summary
Toyota is celebrating their tenth anniversary in Indian market. To mark this occasion they have launched a refreshed Innova and Fortuner models. Both these vehicles get significant updates to their interior and minor changes externally.
Story first published: Tuesday, January 6, 2015, 11:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X