బేసిక్ రోడ్ సెన్స్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు

By Ravi

ఓయ్ అన్నా బండి కొంచెం ముందుకు పోనీ.. ఈ రోడ్డేమన్నా మీ బాబు జాగిరా, అడ్డంగా బండి పెట్టావ్.. ఏయ్ ముందు చూసి బండి నడపవయ్యా.. టర్నింగ్ తీసుకునేటప్పుడు ఇండికేటర్ సిగ్నల్ ఆన్ చేయాలని తెలియదా.. స్లోగా వెళ్తే నీ సొమ్మేం పోతుంది..

ఏంటివన్నీ అనుకుంటున్నారా..? ఇవి మనం రోడ్డుపై ప్రతినిత్యం గమనించే అంశాలే. ఏవరో ఒకరు, ఏదో ఒక సమయంలో ఇలాంటి సందర్భాలను ఎదుర్కునే ఉంటారు. ఇందుకు ప్రధాన కారణంగా వాహనం నడిపే కొందరికి సరైన ప్రాధమిక రోడ్ సెన్స్ లేకపోవటమే. ఒకవేళ రోడ్ సెన్స్, కొన్ని సందర్భాల్లో కామన్ సెన్స్ పనిచేయకపోతే, సదరు వ్యక్తుల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలే బయటికొస్తుంటాయి.

సరే ఏదేమైనప్పటికీ.. ఇళ్లు అలకగానే పండుగ కాదన్న చందంగా.. వాహనం కొనగానే సంబరం తీరినట్లు కాదు. వాహనం రోడ్డుపై నడిపేటప్పుడు కొన్ని ప్రాధమిక రోడ్డు సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

బేసిక్ రోడ్ సెన్స్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు

వాహనం నడపటానికి ముందు పాటించాల్సిన కొన్ని బేసిక్ రోడ్ సెన్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి. తర్వాతి స్లైడ్లను పరిశీలించండి.

సరైన మార్గంలో వాహనం నడపండి

సరైన మార్గంలో వాహనం నడపండి

రోడ్డుపై ఇష్టం వచ్చినట్లుగా, అడ్డదిడ్డంగా వాహనం నడపకూడదు. ఒకవేళ రోడ్డు ఖాలీగా ఉన్న సరే ఇలా చేయకూడదు. రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు వీలైనంత వరకు రోడ్డుకు ఎడమవైపున వాహనం డ్రైవ్ చేయాలి, కుడివైపున ఓవర్‌టేక్ చేయాలనుకునే వారికి దారి ఇవ్వాలి. అలాగే, మీరు ఓవర్‌టేక్ చేసేటప్పుడు కూడా కుడివైపునే చేయాలి. రోడ్డు మలుపుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోను ఓవర్‌టేక్ చేయకండి.

లెఫ్ట్/రైట్ టర్న్

లెఫ్ట్/రైట్ టర్న్

సిగ్నల్ వద్ద మీరు మీ వాహనంలో ఎడమ వైపుకు లేదా కుడివైపు టర్న్ తీసుకోవాలనుకుంటే, దానికి ముందుగానే సిద్ధంగా ఉండాలి. సిగ్నల్‌కు వీలైనంత దూరంలోనే మీరు ఎటువైపు మలుపు తిరగాలనుకుంటున్నారో ఆ వైపుకు టర్న్ ఇండికేటర్ ఆన్ చేసి రోడ్డు వైపుకు చేరుకోవాలి. అలాకాకుండా, రోడ్డుకు మధ్యలో వెళ్తూ, సిగ్నల్ సమీపంచగానే హఠాత్తుగా టర్న్ తీసుకోవటం చాలా ప్రమాదకరం.

సైన్ బోర్డులపై కూడా దృష్టి పెట్టండి

సైన్ బోర్డులపై కూడా దృష్టి పెట్టండి

వాహనం నడిపేటప్పుడు కేవలం రోడ్డుపై మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు/అవసరైనప్పుడు రోడ్డు పక్కన కనిపించే సైన్ బోర్డులపై కూడా దృష్టి పెట్టండి. స్కూల్ జోన్, జీబ్రా క్రాసింగ్ వంటి ప్రదేశాలను గమనించి, నెమ్మదిగా వాహనం నడపండి.

అనవసరంగా హారన్ కొట్టకండి

అనవసరంగా హారన్ కొట్టకండి

వాహనంలో హారన్ అనేది రోడ్డుపై వెళ్తున్న వారిని అప్రమత్తం చేసేందుకు, అడ్డుగా వచ్చే వారిని దారి ఇవ్వమనటం వంటి అవసరమైన సందర్భాల కోసం మాత్రమే. దీనిని ఈ పని కోసమే ఉపయోగించాలే తప్ప, హారన్ ఉంది కదా అని అవసరం లేనిచోట కూడా ఇష్టం వచ్చినట్లు నొక్కకూడదు. ఇప్పటికే విపరీతంగా పెరిగిన ధ్వని కాలుష్యాన్ని మీ అనవసర హారన్‌తో మరింత పెంచకండి.

హెల్మెట్ ధరించండి

హెల్మెట్ ధరించండి

మీ ప్రాంతంలో హెల్మెట్ నిబంధన తప్పనిసరి అయినా, కాకపోయినా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరం ఊహించలేము, కాబట్టి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం మర్చిపోకండి. పిలియన్ రైడర్ (ద్విచక్ర వాహనం వెనుక సీటుపై కూర్చునే వారు) కూడా హెల్మెట్ ధరిస్తే మరింత మంచిది.

భారీ వాహనాలకు దూరంగా డ్రైవ్ చేయండి

భారీ వాహనాలకు దూరంగా డ్రైవ్ చేయండి

రోడ్డువై వెళ్తున్నప్పుడు మీ వాహనానికి సమీపంలో భారీ వాహనాలు వెళ్తుంటే, వాటి నుంచి వీలైనంత దూరంలో మీ వాహనం నడపటానికి ప్రయత్నించండి. ప్రత్యేకించి లోడుతో ఉన్న లారీలు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు దూరంగా డ్రైవ్ చేయండి.

జీబ్రా క్రాసింగ్‌పై వాహనం నిలపకండి

జీబ్రా క్రాసింగ్‌పై వాహనం నిలపకండి

జీబ్రా క్రాసింగ్ అనేది పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడం కోసం ఏర్పాటు చేయబడినది. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోను మీ వీహనాన్ని జీబ్రా క్రాసింగ్‌పై నిలపకండి. మీరు మీ వాహనంలో జీబ్రా క్రాసింగ్‌ను సమీపిస్తున్నప్పుడు రోడ్డుకు ఇరువైపులా గమనించి, నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్‌ను క్రాస్ చేయండి. దానిపై పాదచారులు వెళ్తుంటే వారికి, దారి ఇవ్వండి.

వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేయకండి

వాహనాన్ని రోడ్డు పక్కన పార్క్ చేయకండి

నో పార్కింగ్ ప్రదేశాల్లో, అలాగే రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేయకండి. రద్దీ రోడ్లయినా సరే లేదా ఖాలీ రోడ్లయినా సరే రోడ్డు పక్కన మాత్రం వాహనాన్ని పార్క్ చేయకండి. ఇది అవతలి వారికి అవాంతరంగా మారే ఆస్కారం ఉంటుంది. సమీపంలో ఏదైనా పార్కింగ్ ప్రదేశం ఉందేమో కనుక్కొని, మీ కారును సరక్షితంగా పార్క్ చేసుకోవటం చాలా మంచిది.

గ్రీన్ లైట్ వెలిగే వరకూ వేచి ఉండండి

గ్రీన్ లైట్ వెలిగే వరకూ వేచి ఉండండి

ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్ లైట్ వెలిగి ఉంటే ఆగమని, ఆరెంజ్ లైట్ వెలిగి ఉంటే మీ వాహనాన్ని సిద్ధంగా ఉంచుకోమని, గ్రీన్ లైట్ వెలిగితే ముందుకు వెళ్లమని అర్థం. కాబట్టి, ఎప్పుడూ కూడా ట్రాఫిక్ సిగ్నల్‌లో గ్రీన్ లైట్ వెలిగే వరకూ వేచి ఉండండి. సిగ్నల్ వలన ఓ రెండు మూడు నిమిషాలు ఆలస్యం జరిగే మునిగిపోయేదేమీ ఉండదని గుర్తుంచుకోండి.

స్టంట్‌లు చేయటానికి ప్రయత్నించకండి

స్టంట్‌లు చేయటానికి ప్రయత్నించకండి

ఒకవేళ మీరు నైపుణ్యం కలిగి వాహన చాలకులే కావచ్చు, కానీ రోడ్డుపై మాత్రం స్టంట్‌లు చేయటానికి ప్రయత్నించకండి. పొరపాటున మీ స్టంట్ వికటిస్తే, మీరు ప్రమాదంలో పడటమే కాకుండా, ఇతరులను కూడా ప్రమాదంలో పడవేసిన వారు అవుతారు.

ఎవరైనా ప్రమాదానికి గురైతే

ఎవరైనా ప్రమాదానికి గురైతే

రోడ్డుపై ఎవరైనా ప్రమాదానికి గురైతే, మానవత్వం లేకుండా మనకు ఎందుకులే అని మీ దారిన మీరు పోకుండా, వారికి సాయం చేయటానికి ప్రయత్నించి వారి ప్రాణాలను కాపాడండి. మీరు చేసే ఈ మంచి పనిని మీ మిత్రులు, బంధువులే కాకుండా ఆ భగవంతుడు కూడా ప్రశంసిస్తాడని గుర్తుంచుకోండి.

అంబులెన్స్‌కు దారి ఇవ్వండి

అంబులెన్స్‌కు దారి ఇవ్వండి

చివరిగా.. అంబులెన్స్ అంటేనే ప్రాణదాత అని అర్థం. కొన ఊపిరితో ఉన్న వారికి ప్రాణాలను రక్షించగల సామర్థ్యం అంబులెన్స్‌కి ఉంటుంది. కాబట్టి, రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీకు అంబులెన్స్ (ఫైర్ ఇంజన్ కూడా) శబ్ధం వినిపిస్తే, వెంటనే పక్కకు తప్పుకొని దారి ఇవ్వండి.

బేసిక్ రోడ్ సెన్స్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు

ఇది కూడా చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా..? - చిట్కాలు

బేసిక్ రోడ్ సెన్స్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా..? - చిట్కాలు

బేసిక్ రోడ్ సెన్స్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు

ఇది కూడా చదవండి: స్టీరింగ్ వీల్‌ను కరెక్టుగా పట్టుకోవటం ఎలా..? - చిట్కాలు

More from DriveSpark

Article Published On: Tuesday, October 15, 2013, 12:21 [IST]
English summary
Basic on-road ethics everyone must follow to avoid accidents. Following on-road rules keeps you & others safe, away from harm's way.Show good road sense by following traffic rules and on-road ethics.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+