మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైంది, బయట ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో కార్ల యజమానులు చాలా సందర్భాల్లో తమ కార్లను ఆరుబయట పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎండలో కారును పార్క్ చేయటం వలన చాలా తక్కువ సమయంలోనే కారులోని వాతావరణం అత్యంత వేడిగా మారిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కారును చల్లగా ఉంచుకోవటం ఎలానో ఈ కథనంలో తెలుసుకుందాం రండి!

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

1. రియర్ ఏసి వెంట్స్

ప్రీమియం కార్లలో వెనుక సీట్లలో కూర్చుని ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా రియర్ ఏసి వెంట్స్ ఉంటాయి. కానీ, ప్రస్తుతం బేస్ వేరియంట్ కార్లలో కేవలం ముందు వైపు మాత్రమే ఏసి వెంట్స్ ఉంటాయి. అలాంటి కార్లలో వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకులకు ఏసి చాలా తక్కువగా ఉంటుంది.

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే రియర్ ఏసి వెంట్ ఎక్స్‌టెండర్ పైప్. ఇదొక ఫ్లెక్సిబల్ పైప్, దీనిని ఎలా కావాలంటే అలా వంచుకోవచ్చు. ఈ పైప్‌ను కారులో ముందున్న ఏసి వెంట్‌లలో ఒకదానికి కనెక్ట్ చేసి, వెనుక వైపు కూడా ఏసి వచ్చేలా చేసుకోవచ్చు. ఇది వెనుక ప్రయాణీకులకు నేరుగా చల్లని గాలిని ఇస్తుంది. ఈ పైప్‌ను ఇన్‌స్టాల్ చేయటం చేయటం తొలగించడం చాలా సులభం.

MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

2. సౌరశక్తితో పనిచేసే ఎగ్జాస్ట్

కారును నేరుగా ఎండలో పార్క్ చేయటం వలన, వేడి సూర్యకిరణాల కారణంగా కారులో ఉన్న గాలి మరింత వేడిగా మారి, త్వరగా క్యాబిన్ వేడెక్కుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కారులోని వేడిగాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లటం ఎంతో అవసరం. ఈ సమస్యను పరిష్కరించడానికి కొందరు తమ కారు కిటికీ అద్దాలను కొంచెం క్రిందకు దించుతారు. ఇది మంచిదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో సురక్షితమైనది కాదు. దీని వలన కారు చోరీకి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

ఇందుకు చక్కని పరిష్కారం సౌరశక్తితో పనిచేసే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఉపయోగించడం. ఈ పరికరానికి ఓ వైపు సోలార్ ప్యానెల్ మరోవైపు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి. దీనిని కారు అద్దంలో ఉంచి, పైక్ రోల్ చేయవచ్చు. ఇందులోని సోలార్ ప్యానెళ్లు బయటివైపుకు ఉండి, సౌరశక్తిని గ్రహించి కారు లోపలి వైపు ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను పనిచేసేలా చేస్తాయి. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కారులోని వేడిగాలిని బయటకు పంపుతాయి.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

3. విండో బ్లైండర్ (సన్ షేడ్)

భారతదేశంలో కార్లకు నల్లటి సన్ ఫిల్మ్స్ (టింట్స్) ఉపయోగించడాన్ని నిషేధించడం జరిగింది. వాస్తవానికి విండో టింటింగ్ కారణంగా బయటి వేడిని లోపలికి ప్రవహించకుండా, కారు లోపల ఏసి త్వరగా వ్యాపిస్తుంది. కారు అద్దాలకు సన్ ఫిల్మ్ వాడకం నిషేధం కాబట్టి, బయటి మార్కెట్లో లభించే ఇలాంటి సన్ షేడ్స్, సన్ షేడ్ కర్టెన్స్ మొదలైన వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి కూడా కారు లోపల వేడిని తగ్గించేందుకు సహకరిస్తాయి.

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

4. కూలింగ్ సీట్

హై-ఎండ్ కార్లలో కూల్డ్ మరియు హీటెడ్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. వీటి సాయంతో కారులోని సీట్లను యాంత్రికంగా వేడిగా లేదా చల్లగా చేసుకోవచ్చు. హ్యుందాయ్ వెన్యూ ప్రీమియం వేరియంట్లలో కూడా ఈ తరహా ఫీచర్ లభిస్తుంది. మీ కార్లలో ఇలాంటి ఫీచర్ లేకపోయినట్లయితే, మీరు ఆఫ్టర్ మార్కెట్లో దొరికే కూల్డ్ సీట్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు.

MOST READ:మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

ఇది కారులో ఉండే 12 వోల్ట్ సాకెట్ సాయంతో పనిచేస్తుంది. ప్లగ్ అండ్ ప్లే మాదిరిగా పనిచేసే ఈ కూల్డ్ సీట్ త్వరగానే చల్లగా అవుతుంది. మండు వేసవిలో చల్లగా ప్రయాణించేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది.

మండు వేసవిలో మీ కారును చల్లగా ఉంచడానికి ఐదు చిట్కాలు!

5. రోలర్ విండ్‌షీల్డ్

సన్ షేడ్స్‌ను ఉపయోగించి కారు పక్కల నుండి వచ్చే వేడిని నియంత్రించినప్పటికీ, ఫ్రంట్ అండ్ రియర్ విండ్‌షీల్డ్స్ ద్వారా వచ్చే వేడిని కూడా కంట్రోల్ చేయటం ఎంతో అవసరం. ఇందులో కోసం రోలర్ విండ్‌షీల్డ్ ప్రొటెక్టర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎండ వేడిని తిప్పికొట్టడమే కాకుండా, కారు డ్యాష్‌బోర్డును కూడా వేడి నుండి రక్షిస్తుంది.

MOST READ:సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

Most Read Articles

English summary
Five Ways To Keep Your Car Cool In Hot Summer. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X