ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

By N Kumar

ఏబిఎస్ అంటే ఏమిటి? ఏబిఎస్ అనగా ఆంగ్లంలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రతి కారు మరియు బైకులో అతి ప్రధానమైన సేఫ్టీ ఫీచర్‌గా నిలిచింది. బ్రేకులు వేసినపుడు చక్రాలు రోడ్డు మీద జారిపోవడాన్ని నివారించడానికి చేసిన ప్రయోగ ఫలితమే ఏబిఎస్.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

అధిక వేగంలో ఉన్నపుడు సడెన్ బ్రేకులు వేసినపుడు ఆ వాహనంలో ఏబిఎస్ ఉంటే, అనివార్యపు స్కిడింగ్ మరియు వీల్ లాకింగ్‌ను ఏబిఎస్ సిస్టమ్ అరికడుతుంది. దీంతో వాహనం క్రింద పడిపోకుండా సురక్షితంగా డ్రైవ్ చేయవచ్చు.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

మళ్లీ, ఏబిఎస్ అంటే ఏమిటి ? ఎలా పనిచేస్తుంది? వివరంగా....

ఏబిఎస్ పనితీరును వివరించడానికి మీకో చిన్న స్టోరీ చెబుతాం... చిన్నపుడు సైకిల్ మీద వెళుతున్నపుడు మట్టి రోడ్ల మీద టైర్లు స్కిడ్ అవ్వడం మరియు వేగంగా వెళుతూ బ్రేకులు వేయడంతో టైర్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో రోడ్డు మీద టైర్లు జారి క్రిందపడిన సందర్భాలు దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటాయి.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఏబిఎస్ ఉంటే సైకిల్ స్కిడ్ అవ్వడం మరియు వీల్ లాక్ అవ్వడం జరిగేది కాదు. అబ్బో దీనికి ఏబిఎస్ ఫీచర్ కావాలా... అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే... సైకిల్ మీద ఫీట్లు చేసినపుడు దాని వేగం మహా అయితే, గంటకు 10 కిమీలు ఉంటుంది. కానీ గంటకు 60 నుండి 100కిమీల వేగంతో ఉన్నపుడు ఇలా వీల్ లాక్ మరియు టైర్ స్కిడ్ అయితే ఎలా ఉంటుంది ఊహించండి. తలచుకోవడానికే భయంగా ఉంది కదూ... అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఏబిఎస్ ఫీచర్‌ను తప్పనిసరి చేశాయి.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి....

ఏబిఎస్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే, ముందు బ్రేకులు ఎలా పనిచేస్తాయో తెలియాలి.

ప్రస్తుతం దాదాపు అన్ని బైకులు కార్లు హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. బ్రేక్ పెడల్ లేదా బ్రేక్ లీవర్ ప్రెస్ చేసినపుడు హైడ్రాలిక్ ఒత్తిడి రిజర్వాయర్‌లో ఉన్న బ్రేక్ అయిల్‌ మీద ప్రెజర్ పెంచుతుంది. రిజర్వాయర్‌లోని ఆయిల్ ప్రెజర్ కాలిపర్ మీదుగా బ్రేక్ ప్యాడ్స్ మీద పడుతుంది.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

బ్రేక్ ప్యాడ్స్ గుండ్రంగా తిరుగుతున్న డిస్క్ మీద రాపిడి చేస్తూ వేగాన్ని అదుపులోకి తీసుకొస్తుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేనపుడు,బ్రేక్ లీవర్ లేదా పెడల్ ఒక్కసారిగా ప్రెస్ చేస్తే డిస్క్ మీద ప్రెజర్ ఒక్కసారిగా అధిక మొత్తంలో పడటంతో వీల్ లాక్ అయిపోయి టైర్లు స్కిడ్ అవుతాయి.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటే సీన్ రివర్స్. బ్రేకింగ్ సిస్టమ్ వద్ద చిన్న సెన్సార్ ఉంటుంది. ఇది డిస్క్ తిరిగే వేగాన్ని గమనిస్తూ ఉంటుంది. మీరు బ్రేకులు గట్టిగా వేసినపుడు కొన్ని మిల్లీ సెకండ్లలోపే వీల్ లాక్ అవ్వడాన్ని గుర్తిస్తుంది. వెంటనే బ్రేక్ ప్యాడ్స్‌ను డిస్క్ నుండి దూరం చేస్తుంది.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఇలా చేయడంతో వీల్ లాక్ అవ్వదు. అప్పటికే వెహికల్ అధిక వేగం మీద ఉండటంతో వాహనం మళ్లీ వేగాన్ని పుంజుకుంటుంది. కాబట్టి వేగం పెరిగితే బ్రేక్ ప్యాడ్స్ డిస్క్‌ను మళ్లీ పట్టి ఉంచుతాయి. ఈ క్రమంలో వీల్ లాక్ అయినట్లు సెన్సార్ గుర్తించితే బ్రేకులు అప్లే కాకుండా ఏబిఎస్ చూసుకుంటుంది.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఈ మొత్తం కేవలం కొన్ని మిల్లీ సెకండ్లలోనే పూర్తవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏబిఎస్ సిస్టమ్స్ ఒక్క సెకండ్లలో 15 సార్లు బ్రేకులను అప్లే చేయడం, వదలడం చేస్తాయి. మనం బ్రేకులు అప్లే చేసినపుడు మనకు ఇవేం తెలియకపోయినా... ఏబిస్ ఉన్న వాహనాల్లో అధిక వేగం వద్ద బ్రేకులు అప్లే చేస్తే క్షణాల్లో వాహన వేగం పూర్తిగా తగ్గిపోతుంది.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

బైకుల్లో ఇదొక విప్లవాత్మకమైన ఫీచర్

ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా... ఏబిఎస్ చేసే మేలు అంతా ఇంత కాదు. బైకుల్లో ఏబిఎస్ అత్యంత ముఖ్యమైనది. చాలా వరకు బైకులు అధిక వేగం వద్ద సడెన్ బ్రేకులు వేసి, చక్రాలు జారి క్రిందపడటంతో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. ఏదయితేనేం ఇప్పుడు ఏబిఎస్ అందుబాటులోకి వచ్చింది.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఏబిఎస్ ఉన్నా కూడా టైర్లు స్కిడ్ అవుతున్నాయంటే కారణమేంటి..?

ఏబిఎస్ పనితీరు మరియు ప్రయోజనాలతో పాటు ఏబిఎస్ ఉన్నా కూడా టైర్లు స్కిడ్ అవుతున్నాయంటే దీని గురించి కూడా తెలుసుకోవాల్సిందే. ఇందుకు రెండు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఒకటి టైర్ల మీద ఉన్న గ్రిప్ అరిగిపోవడం మరియు ఏబిఎస్ సెన్సార్ పనిచేయకపోవడం. మీరు లాంగ్ ట్రావెల్ వెళ్లబోయే ముందు ఈ రెండింటిని గమనిస్తే సురక్షితమైన జర్నీ మీ సొంతం.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఏబిఎస్ ఎలా ప్రపంచానికి పరిచయం అయ్యింది..?

ఆధునిక ఎలక్ట్రానిక్ ఏబిఎస్ యొక్క మెకానికల్ వెర్షన్ మొట్టమొదటిసారిగా 1920లో అభివృద్ది చేశారు. ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమోటివ్ మరియు ఏవియేషన్ పయనీర్ గ్యాబ్రియల్ వాయిజన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ కోసం దీనిని అభివృద్ది చేశాడు.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

తరువాత కొన్ని దశాబ్దాలకే యాంటి-స్కిడ్ సిస్టమ్ ఏవియేషన్ పరిశ్రమలో పాపులర్ అయిపోయింది. చాలా వరకు విమాన తయారీ సంస్థలు డనలప్ మ్యాక్సారెట్ యాంటి-స్కిడ్ సిస్టమ్ లను వినియోగించాయి.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

విమానయాన రంగం నుండి ఆటోమొబైల్ పరిశ్రమలోకి తొలిసారిగా 1958లో ఏబిఎస్ పరిచయమయ్యింది. మ్యాక్సారెట్ సిస్టమ్ తొలుత రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోయర్ మోటార్ సైకిల్‌లో పరీక్షించింది. తొలి మోడ్రన్ ఎలక్ట్రానిక్ ఏబిఎస్‌ను లెజండరీ సూపర్‌‌సోనిక్ ఎయిర్‌లైనర్ కాంకోర్డ్‌లో వినియోగించారు.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

1971లో ఎలక్ట్రానిక్ ఏబిఎస్ ఫీచర్‌ను మొదటిసారిగా కార్లలో వినియోగించారు. ఫియట్ క్రిస్లర్, ఫోర్డ్, జనరల్ మోటార్స్ మరియు నిస్సాన్ వంటి కార్ల సంస్థలు తమ కార్లలో ఏబిఎస్ అందించాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజు రోజుకీ ప్రాముఖ్యతను సంపాదించుకున్న ఏబిఎస్ ప్రస్తుత మార్కెట్లో ఉన్న ప్రతి కారులో తప్పనిసరిగా వస్తోంది.

ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

ఏబిఎస్ గల కార్లను మాత్రమే విక్రయించడాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు తప్పనిసరి చేశాయి. ఇప్పుడు భారత్ కూడా 2018 నుండి అన్ని వాహనాల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది.

Most Read Articles

English summary
Garage talk what the hell is abs.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X