గేర్లను ఎప్పుడు, ఎలా మార్చాలి? - చిట్కాలు

By Staff

కారును ముందుకు వెనుకకు నడిపించడంలో కీలక పాత్ర పోషించేవి గేర్లు. సాధారణంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్ల విషయంలో గేర్లను తరచూ మార్చాల్సిన అవసరం ఉండదు, నడిపే వేగాన్ని బట్టి వాటంతటే అవే మారుతూ ఉంటాయి. కానీ ఆటోమేటిక్ కార్లు తక్కువ మైలేజీనిస్తాయి. అదే మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లను నిర్దిష్ట వేగాల వద్ద గేర్లు మార్చుకుంటూ ఉండాలి.

ఇది కూడా చదవండి: కార్ మైలేజ్ పెంచుకునేందుకు చిట్కాలు

సరైన స్పీడ్ వద్ద గేరు మార్చకపోయినా, తక్కువ వేగంలో ఉన్నప్పుడు ఎక్కువ గేరులో వెళ్తున్నా లేదా ఎక్కువ వేగంతో ఉన్నప్పుడు తక్కువ గేర్‌లో వెళ్తున్నా ట్యాంకులోని ఇంధనాన్ని ఇంజన్ మంచినీళ్ల ప్రాయంగా తాగేస్తుంది. అందుకే గేర్లను ఎప్పుడు, ఎలా మార్చాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తగా కారు నడిపే వారిలో చాలా మందికి గేర్ మార్పిడి గురించి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే ఈ కథనంలో. ఇందులో కారు గేర్లు ఎప్పుడు, ఎలా మార్చాలో తెలుసుకుందాం రండి.

గేర్లు ఎప్పుడు, ఎలా మార్చాలి?

తర్వాతి స్లైడ్‌లలో మరింత సమాచారాన్ని పరిశీలించండి.

Picture credit: Flickr

Patrmach

1. యాక్సిలరేషన్ కోసం లో గేర్స్, స్పీడ్ అండ్ మైలేజ్ కోసం హైయ్యర్ గేర్స్

1. యాక్సిలరేషన్ కోసం లో గేర్స్, స్పీడ్ అండ్ మైలేజ్ కోసం హైయ్యర్ గేర్స్

కారులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వంటి లో గేర్లను కారును త్వరితగతిన యాక్సిలరేట్ చేసేందుకు ఉపయోగించాలి, కారు కొంత వేగాన్ని పుంజుకున్న తర్వాత టాప్ స్పీడ్ కోసం ఫోర్త్, ఫిఫ్త్ వంటి గేర్లను వాడాలి. గేర్లను స్మార్ట్‌గా ఉపయోగించడం వలన మైలేజ్ కూడా పెరుగుతుంది. చకచకా టాప్ గేర్‌ను వేయటం వలన అధిక ఇంధనం ఖర్చు అవుతుంది.

Picture credit: Wiki Commons

BerndB

2. గేర్లను ఎలా వాడాలో తెలుసుకోండి

2. గేర్లను ఎలా వాడాలో తెలుసుకోండి

ఫస్ట్ గేర్ - కారును స్టార్ట్ చేసిన తర్వాత, నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు ఈ గేర్‌ను ఉపయోగించాలి.

సెకండ్ గేర్ - బెటర్ మైలేజ్ కోసం, కొద్దిగా వేగంగా కదులుతున్న ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు, కుడి లేదా ఎడమ వైపుకు షార్ప్ టర్న్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ గేర్‌ను ఉపయోగించాలి. కారు వేగం గంటకు 10-20 కి.మీ. మధ్యలో ఉన్నప్పుడు సెకండ్ గేర్ వాడటం మంచిది.

థర్డ్ గేర్ - సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ఫోర్త్ గేర్‌లో వెళ్తున్నప్పుడు వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ గేర్‌ను ఉపయోగించారు. కారు వేగం గంటకు 30-35 కి.మీ. మధ్యలో ఉన్నప్పుడు థర్డ్ గేర్ వాడటం మంచిది.

ఫోర్త్ గేర్ - సిటీ రోడ్లపై మెరుగైన మైలేజీ కోసం, వేగంగా కదులుతున్న రద్దీలో వెళ్తున్నప్పుడు ఈ గేరును ఉపయోగించాలి. ఒకవేళ హైవేలో ఫిఫ్త్ గేర్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఫోర్త్ గేర్‌కు మార్చుకొని ఓవర్‌టేక్ చేయటం వలన క్విక్ యాక్సిలేషన్ లభించి, అనుకున్న సమయంలో ఓవర్‌టేక్ చేయవచ్చు. కారు వేగం గంటకు 40-50 కి.మీ. మధ్యలో ఉన్నప్పుడు ఫోర్త్ గేర్ వాడటం మంచిది.

ఫిఫ్త్ గేర్ - స్పీడ్ అండ్ మైలేజ్ కోసం ఈ గేరును ఉపయోగించారు. సాధారణంగా కారు వేగం గంటకు 65 కి.మీ. దాటినప్పుడు ఫిఫ్త్ గేరును ఉపయోగించడం మంచిది.

Picture credit: Flickr

M J M

3. ఏటవాలు ప్రాంతం లేదా టర్నింగ్‌కి ముందే గేరు మార్చాలి.

3. ఏటవాలు ప్రాంతం లేదా టర్నింగ్‌కి ముందే గేరు మార్చాలి.

కారులో ఏటవాలు ప్రాంతాన్ని ఎక్కాల్సి వచ్చినప్పుడు లేదా మలుపు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది సమీపించే వరకు వేచి ఉండకుండా, వీలైనంత ముందుగానే గేర్లను మార్చుకోవాలి. ఏటవాలు ప్రాంతాలను కారు ఎక్కాలంటే ఎక్కువ శక్తి అవసరం కాబట్టి, ఏటవాలు ప్రాంతం సమీపంచడానికి ముందుగానే గేర్లను డౌన్ చేసుకొని, లోవర్ గేర్లలోకి మారినట్లయితే, ఏటవాలు రోడ్డును సులువుగా ఎక్కటం సాధ్యమవుతుంది. అలాగే టర్నింగ్ చేసేటప్పుడు కూడా మలుపు దగ్గరకు రావటానికి ముందే గేర్లను డౌన్ చేసుకొని, లోవర్ గేర్లో టర్న్ తీసుకోవాలి.

4. గేర్లను సుతారంగా మార్చండి (వీడియో)

కారు గేర్లను ఎంత స్మూత్‌గా మార్చితే అంత ఎక్కువ కాలం మన్నుతుంది. ర్యాష్‌గా (గట్టిగా) గేర్లను మార్చితే క్లచ్ సిస్టమ్ దెబ్బతినటంతో పాటు ఇంజన్‌లో కూడా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గేర్లను స్మూత్‌గా మార్చడం వలన మంచి మైలేజ్ లభించడమే కాకుండా కారులోని ప్యాసింజర్లకు కూడా సౌకర్యంగా ఉంటుంది. గేర్లను త్వరత్వరగా మార్చడం లేదా క్లచ్‌ను పూర్తిగా నొక్కకుండానే గేరును మార్చడం వంటి పనులు మానుకోండి. సుతారంగా గేర్లను ఎలా మార్చాలో ఈ వీడియోలో చూడండి.

5. ఇంజన్ శబ్ధాన్ని వినండి

5. ఇంజన్ శబ్ధాన్ని వినండి

కారులో మనం మార్చే గేర్లు ఇంజన్‌పై ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు తక్కువ గేర్‌లో ఎక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు ఇంజన్ శబ్ధం తేడాగా వినిపిస్తుంది. అలాగే ఎక్కువ గేర్‌లో స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఇంజన్ శబ్ధంలో తేడా వినిపించడం లేదా కారు వైబ్రేట్ కావటం కనిపిస్తుంది. కాబట్టి, గేర్లను మార్చేటప్పుడు ఇంజన్ శబ్ధంపై కూడా దృష్టి సారించడం మర్చిపోకండి. దీనికి గురించి మీకు అవగాహన లేకపోయినట్లయితే, టాకోమీటర్‌ను చూస్తూ గేరును మార్చండి. అందులో ముల్లు రెడ్ కలర్‌ను దాటితే ఇంజన్‌కు ప్రమాదమని గుర్తుంచుకోండి.

చివరిమాట

చివరిమాట

కార్లలో గేరు మార్పిడి విషయంలో ఇప్పటి వరకు చెప్పుకు చిట్కాలు మీకు నచ్చాయని భావిస్తున్నాము. అందరికీ ఉపయోగపడే ఈ కథనాన్ని మీ మిత్రులతో పంచుకోగలరని ఆశిస్తున్నాము.

Picture credit: Flickr

Ralf Bijker

Most Read Articles

English summary
This article will focus on the right methods of changing gears in a manual transmission car, so you can improve your driving style. Do keep in mind that the points covered are in relation to an average car with a manual gearbox, like say a Maruti Suzuki Swift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X