ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

భారతదేశంలో రోజురోజుకి వాహన దొంగతనం కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ, పూర్తిగా ఈ దొంగతనాలు నిలువరించలేకపోతున్నారు. అయితే వాహనాలు దొంగలించబడకుండా ఉండాలంటే వాహనదారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దొంగతనాలు జరగకుండా చూసుకోవచ్చు.

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

సాధారణంగా విహికల్ పార్క్ చేసి షాపింగ్ కి గాని ఆఫీసులకు గాని వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేసరికి వాహనాలు దొంగలించబడిన కేసులు దేశవ్యాప్తంగా కోకొల్లలు. బయట మాత్రమే కాకుండా ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలు కూడా దొంగలించబడతాయి. ఇప్పుడు ఈ దొంగతనాలకు చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. వీటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

చైన్ మరియు లాక్ ఉపయోగించడం:

బైక్‌ను దొంగతనాలను నివారించడానికి, వాహనదారులు చైన్ మరియు లాక్ ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు, బైక్ తో పాటు స్టీల్ చైన్ మరియు లాక్ తీసుకెళ్లండి. మీరు పార్క్ చేసేదగ్గర దానికి చైన్ మరియు లాక్ ఉపయోగించి లాక్ చేయండి.

MOST READ:మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్‌యూవీ పొందిన మహ్మద్ సిరాజ్

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

ఇలా చేసినట్లయితే బైక్ దొంగిలించడానికి కొంతవరకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే దొంగలు చైన్ మరియు లాక్ తీయడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది కావున మీ బైక్ సురక్షితతంగా ఉంటుంది. బైక్‌ను దొంగల నుండి సురక్షితంగా ఉంచడానికి ఇది సులభమైన మార్గం.

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

డిస్క్ బ్రేక్ లాక్ వాడకం:

మీ బైక్ లో డిస్క్ బ్రేక్ ఉంటే, దానికి చైన్ మరియు లాక్ ఉపయోగించి లాక్ చేయవచ్చు. డిస్క్ బ్రేక్‌కు వర్తించే లాక్ చాలా చిన్నది మరియు బైక్ యొక్క నిల్వ స్థలంలో సులభంగా ఉంచవచ్చు. డిస్క్ లాక్ కాకుండా, ప్యాడ్ లాక్ కూడా ఉపయోగించవచ్చు. డిస్క్ లాక్ కొంచెం ఖరీదైనది అయితే బైక్ యొక్క రెండు డిస్కులలో ఉంచినట్లయితే దొంగలు మీ బైక్ దొంగిలించడం చాలా కష్టం అవుతుంది. మీ బైక్‌ను రక్షించడానికి డిస్క్ లాక్ చాలా మంచి ఎంపిక.

MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్‌కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

బైక్ అలారం:

ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా కొత్త టెక్నాలజీ ఉపయోగించవచ్చు. మీరు మీ బైక్‌లో యాంటీ తెఫ్ట్ అలారం ఉపయోగించవచ్చు. ఈ అలారం వైర్‌లెస్ సెన్సార్ల సహాయంతో పనిచేస్తుంది. మీ బైక్ యొక్క హ్యాండిల్‌ను ఎవరైనా ఓపెన్ చేయడానికి లేదా తిప్పడానికి ప్రయత్నించిన వెంటనే, బైక్ అలారం సిస్టమ్ వెంటనే దాని గురించి మీకు తెలియజేస్తుంది.

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

సరైన స్థలంలో బైక్ పార్క్ చేయడం:

మీరు మీ బైక్‌ను పార్క్ చేసే స్థలం కూడా చాలా సురక్షితంగా మరియు బహిరంగంగా ఉండే ప్రదేశంలో పార్క్ చేయండి. మీరు ఎక్కువ సమయం బైక్ వదిలి ఉండవలసి వస్తే ప్రజలు ఎక్కువగా తిరిగే చోట లేకుంటే సెక్యూరిటీ ఉన్న చోట పార్క్ చేయడం మంచిది. అలాంటి స్థలం అందుబాటులో లేకపోతే, మీ బైక్‌ను అద్దె పార్కింగ్ లేదా పార్కింగ్ స్థలంలో ఉంచండి.

MOST READ:మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

కొత్త టిప్స్ వాడటం:

మీ బైక్ యొక్క భాగాల గురించి మీకు బాగా తెలిసినప్పుడు అంతే కాకుండా వాటిని ఎలా ఆపరేట్ చేయాలో కూడా మీకు తెలిస్తే, ఈ ట్రిక్ బైక్‌ను సురక్షితంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బైక్ యొక్క విద్యుత్ కనెక్షన్‌ను మీరు డిస్‌కనెక్ట్ చేయవచ్చు, తద్వారా మీ నుండి ఎవరూ బైక్‌ను ఎవరూ దొంగలించలేరు.

ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

బైక్‌ను ఎలక్ట్రిక్ సర్క్యూట్‌కు కనెక్ట్-డిస్‌కనెక్ట్ చేసే స్విచ్‌తో కూడా అమర్చవచ్చు, ఇది బైక్ లోపల ఎక్కడైనా మీకు అనుకూలంగా ఉండే చోట అమర్చుకోవచ్చు. ఈ పైన తెలిపిన టిప్స్ మీరు పాటిస్తే వాహన దొంగతనాలు దాదాపుగా నిలువరించవచ్చు.

MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్‌లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

Most Read Articles

English summary
How To Protect Bike From Theft Know Tips And Tricks Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X