వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి ఉన్న ఐదు కారణాలు

వెహికల్ నడిపే ప్రతిఒక్కరి లైఫ్‌లో ఒక్కసారి ఆ వెహికల్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించిన సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి.

By N Kumar

వెహికల్ నడిపే ప్రతిఒక్కరి లైఫ్‌లో ఒక్కసారైనా ఆ వెహికల్ స్టార్ట్ అవ్వకుండా మొరాయించిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. ఇందుకు పలు రకాల సమస్యలు కారణం కావచ్చు. అసలు సమస్య ఎమిటో తెలుసుకుంటే కారు ఎందుకు స్టార్ట్ అవ్వడంలేదో తెలుసుకోవచ్చు.

తెలుగు పాఠకుల కోసం ఇవాల్టి స్టోరీలో కారు స్టార్ట్ అవ్వకపోవడానికి గల కారణాలు....

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

బ్యాటరీ సంభందిత సమస్యలు

కారు స్టార్ట్ కాకుండా మొరాయించడానికి డెడ్ బ్యాటరీ లేదంటే కండీషన్‌లో లేని బ్యాటరీ ఒక కారణం కావచ్చు. బ్యాటరీ ఇలా డెడ్ అయిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ అయిపోవడం. వెహికల్ రన్నింగ్‌లో లేనపుడు బ్యాటరీ ద్వారా లైట్లు వగైరా వంటివి ఆన్ చేయడంతో బ్యాటరీలో ఛార్జ్ ఖాళీ అయిపోయి ఉండవచ్చు.

Recommended Video

Horrifying Footage Of A Cargo Truck Going In Reverse, Without A Driver - DriveSpark
వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

ఇలాంటి పరిస్థితుల్లో వెహికల్ స్టార్ట్ చేయాలంటే. పాత బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీని అమర్చడం, మరొక మార్గం పుష్ స్టార్ట్ చేయడం. పుష్ స్టార్ట్ చేయడంతో వెహికల్ స్టార్ట్ అయిన వెంటనే బ్యాటరీ యథావిధిగా చార్జ్ అవుతుంది. అదే విధంగా బ్యాటరీ టెర్మినల్స్ శుభ్రం చేయడం మరియు డిస్టిల్ వాటర్ నింపుతూ ఉండండి.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

ఫ్యూజులు

ప్యూజ్‌లు కారణంగా వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడం చాలా అరుదు. మార్కెట్లో లభించే కారు ఇంటీరియర్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఉపయోగించడంతో ఫ్యూజులు మీద లోడ్ ఎక్కువయ్యి, కాలిపోవడం జరుగుతుంది. వీటిలో కీ ద్వారా స్టార్ట్ చేయడానికి కూడా ఒక ప్యూజ్ ఉంటుంది, కాబట్టి ఫ్యూజులు బర్న్ అయిపోతే వెంటనే మార్పించడం, ఐదు లేదా పది ఫ్యూజులు వెహికల్లో ఉంచుకోవడం మంచిది.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

ఇంధనానికి సంభందించిన కారణాలు

మరో కామన్ సమస్య లో ఫ్యూయల్. ఉదయాన్నే బండి బయటకు తీసేటప్పుడు కీస్ ఆన్ చేస్తే, ఫ్యూయల్ గేజ్ ఫ్యూయల్ ఉన్నట్లే చూపిస్తుంది. ఉంటుందిలే అనుకుని జర్నీ స్టార్ట్ మధ్యలో ఆగిపోతుంది. ఇందుకు కారణం ఫ్యూయల్ గేజ్ పనిచేయకపోవడం. ఇలాంటప్పుడే ఫ్యూయల్ ఉన్నట్లు గేజ్ తప్పుగా చూపిస్తుంది.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

పెట్రోల్ వెహికల్ మధ్యలో ఆగిపోతే పెట్రోల్ పట్టించుకుని స్టార్ట్ చేయవచ్చు. అయితే, డీజల్ వెహికల్ ఆగిపోతే, ఫ్యూయల్ ట్యాంకులోకి చేరిన ఎయిర్‌ను తొలగిస్తేనే స్టార్ట్ అవుతుంది. ఇలా ఎయిర్ తొలగించడానికి గల ఏకైక మార్గం ఫ్యూయల్ ఫిల్టర్ దగ్గర క్యాప్ ఓపెన్ చేసి గాలి మొత్తం బయటకొచ్చిన తరువాత డీజల్ వచ్చే వరకూ కిక్కర్ కొట్టాలి.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

ఇంధనానికి సంభందించిన సమస్యల్లో ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ ఇంజన్‌కు చేరేంత వరకు మధ్యలో ఎక్కడైనా సమస్య ఉండవచ్చు. ప్రధానంగా ప్యూయల్ పంప్ మరియు ఫ్యూయల్ ఫిల్టర్లలో సమస్యలు వస్తుంటాయి. పంప్ పనిచేయకపోయినా, ఫిల్టర్ అవ్వకపోయినా ఇంజన్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఇది కూడా ఓ సమస్య కావచ్చు.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

స్పార్క్ ప్లగ్(పెట్రోల్ కార్లు మరియు బైకుల్లో)

పెట్రోల్ ఇంజన్‌లలో పెట్రోల్ మండటానికి స్పార్క్ ప్లక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్పార్క్ ప్లగ్ పనిచేయలేదంటే ఎంత ప్రయణించినా ఇంజన్ స్టార్ట్ అవ్వదు. ఉదాహరణకు: మనం వినియోగించేవాళ్లు చాలా వరకు ఇంజన్ స్టార్ట్ అవ్వకపోతే ఇంజన్ తల భాగంలో ఉన్న స్పార్క్ ప్లగ్ బయటకు తీసి, ఇంజన్‌ను ఆనించి కిక్కర్ కొడతారు. అప్పుడు స్పార్క్ ప్లగ్ పనిచేస్తున్నట్లయితే నిప్పు రవ్వ ఎగురుతుంది, అలా జరగలేదంటే స్పార్క్ ప్లగ్ పనిచేయలేదని నిర్ధారించుకుంటాం.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

స్పార్క్ ప్లగ్ పని చేయకపోడానికి కారణం

కార్లలలో ఒక వరుస క్రమంలో స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇచ్చేందుకు ఇగ్నిషన్ కాయిల్ అనే పరికరం ఉంటుంది. అంటే మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌లో మూడు స్పార్క్‌ ప్లగ్‌లు ఉంటాయి. అంటే ఒక్కో సిలిండర్‌కు ఒక్కోసారి వరుసగా స్పార్క్ ఇచ్చేందుకు ఇగ్నిషన్ కాయిల్ దోహదపడుతుంది. ఇందులో లోపం ఉన్నా ప్లగ్ పనిచేయదు. అదే విధంగా స్పార్క్ ప్లగ్గులు ఎక్కువ కాలం నుండి వాడటంత అరిగిపోయి ఉంటాయి.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

స్టార్టర్ మోటర్‌లో సమస్య

ఇది కూడా చాలా అరుదుగా ఎదురయ్యే సమస్య. మీ కారులో కొత్త బ్యాటరీ ఉంది, ట్యాంక్ నిండా ఫ్యూయల్ ఉందనుకోండి... అయినప్పటికీ ఇంజన్ స్టార్ట్ అవ్వకపోతే ఇందుకు స్టార్టర్‌లో సమస్య ఉందని గుర్తించండి.

వెహికల్ స్టార్ట్ అవ్వకపోవడానికి కారణాలు

ఆల్టర్నేటర్‌లో సమస్య

బ్యాటరీ ఖాళీ అయిపోనపుడు, లేదా బ్యాటరీ డెడ్ అయినపుడు ఇతరుల సహాయంతో కారును నెట్టించి స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలో ఇంజన్ రన్ అవడంతో ఆల్టర్నేటర్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. కారును పుష్ స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవ్వకపోతే ఆల్టర్నేటర్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించండి.

ఈ కథనం గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: 5 top reasons why your car won’t start
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X