టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

భారతదేశంలో చాలా కాలంగా న్యాచురల్ పెట్రోల్/డీజిల్ ఇంజన్లు మార్కెట్ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలో టర్బో ఇంజన్లకు డిమాండ్ జోరందుకుంది. దీంతో, వాహన తయారీదారులు తమ ప్రోడక్ట్ లైనప్ లో టర్బో చార్జర్ తో కూడిన ఇంజన్లను అందించడం ప్రారంభించారు. న్యాచురల్ ఇంజన్లతో పోలిస్తే, టర్బో ఇంజన్లు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్ లో శక్తివంతంగా ఉంటాయి. అయితే, టర్బో చార్జర్ ఇంజన్ల కన్నా శక్తివంతమైన సూపర్ చార్జర్ ఇంజన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఈ రెండికి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందాం రండి.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

వాహనాల ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు ఉద్గార నిబంధనలు పాటిస్తున్నాయి. పాతకాలపు ఇంజన్లు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో, తయారీదారులు ఆయా ఇంజన్లలో మార్పులు చేర్పులు కొత్త టర్బో చార్జర్ మరియు సూపర్ చార్జర్ టెక్నాలజీతో తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా మరియు అదే సమయంలో ఇంజన్ పనితీరు ప్రభావితం కాకుండా ఉండేలా ఇంజన్‌లో కొన్ని మార్పులు చేశారు.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

టర్బో ఛార్జర్ ఎలా పని చేస్తుంది?

టర్బో చార్జర్ అనేది ఇంజన్‌లో దహన ప్రక్రియకు అవసరమైన గాలి శాతాన్ని పెంచడానికి ఉపయోగించే ఓ యంత్ర పరికరం. ఇది ఇంజన్‌లోకి ప్రవేశించే గాలి మొత్తాన్ని పెంచడానికి ఒక టర్బైన్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ టర్బైన్ తిరుగినప్పుడు ఎక్కువ గాలి ఇంజన్ ‌లోకి వెళుతుంది, ఫలితంగా ఇంజన్ లో దహన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇంజన్ యొక్క ఎగ్జాస్ట్ పాయింట్ వద్ద టర్బైన్ నుండి నిష్క్రమించే పొగ వల్ల కలిగే ఒత్తిడి కారణంగా ఈ టర్బైన్ తిరుగుతుంది.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

సూపర్ ఛార్జర్ ఎలా పని చేస్తుంది?

సూపర్ ఛార్జర్ పనితీరు కూడా ఇంచు మించు టర్బో చార్జర్ మాదిరిగానే ఉంటుంది. సూపర్ ఛార్జర్ అనేది ఇంజన్‌ లోకి ఎక్కువ గాలిని ఆకర్షించే పరికరం మరియు ఇది టర్బో చార్జర్ మాదిరిగానే పని చేస్తుంది. కానీ గాలి తీసుకోవడం తిప్పడానికి ఇది ఎగ్జాస్ట్‌ను ఉపయోగించదు, దానికి బదులుగా క్రాంక్ షాఫ్ట్ వెంటనే తిరిగే మరియు ఇంజన్ సామర్థ్యాన్ని పెంచే సాధనాన్ని మౌంట్ చేస్తుంది. ఈ రెండింటి ఉపయోగం మాత్రమే ఒక్కటే అయినప్పటికీ, ఇవి పనిచేసే విధానాలు మాత్రం వేరుగా ఉంటాయి.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

టర్బో ఛార్జర్ మరియు సూపర్ ఛార్జర్ ప్రయోజనాలు

టర్బో ఛార్జర్‌ లో టర్బైన్ లేదా షాఫ్ట్‌కు కనెక్షన్ లేదు. కాబట్టి మెకానికల్ ట్రాక్ ఉండదు. ఈ సాంకేతికత పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజన్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక సూపర్ ఛార్జర్ విషయానికి వస్తే, ఇది ఇంజన్‌కు త్వరగా శక్తిని ఇస్తుంది. ఈ సాంకేతికతను ఇంజన్ లలో ఇన్‌స్టాల్ చేయడం సులభం. ఈ సాంకేతికత చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ ఇంజన్లకు కూడా అనుకూలంగా ఉంటుంది.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

ఈ రెండింటిలో ఏది బెస్ట్?

టర్బో ఛార్జర్ మరియు సూపర్ ఛార్జర్ రెండూ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రెండూ ఇంజన్ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. ఈ రెండింటిని పోల్చడం అంటే, వీటి శక్తి ఒకే విధంగా పెరుగుతుంది. కానీ, ఇంధన వినియోగం విషయానికి వస్తే టర్బో ఛార్జర్ సూపర్ ఛార్జర్ కంటే తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అందుకే వాహన తయారీదారులు మరియు కస్టమర్లు ఎక్కువగా టర్బోచార్జర్ ఇంజన్ లనుఇష్టపడతారు.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

ట్విన్ ఛార్జర్

ఒకే ఇంజన్‌లో టర్బోచార్జర్ మరియు సూపర్‌చార్జర్ రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం కూడా సాధ్యమవుతుంది. సాధారణంగా దీనిని రేస్ కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనినే ట్విన్ ఛార్జర్‌ అని కూడా పిలుస్తారు. ఈ ట్విన్ చార్జర్ ను పెట్రోల్ కార్లలో ఉపయోగించడం సులభం కానీ వీటిని డీజిల్ ఇంజిన్‌లో ఉపయోగించలేరు ఎందుకంటే ఇది ఆర్‌పిఎమ్ కంటే తక్కువ టార్క్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

శక్తి ఎంత పెరుగుతుంది?

సూపర్ ఛార్జర్ ఇంజన్ యొక్క హార్స్‌పవర్ మరియు టార్క్‌ను పెంచుతుంది. దీంతో ఇంజన్ పవర్ 70-80 శాతం పెరుగుతుంది. ఈ శక్తి త్వరగా మరియు సజావుగా లభిస్తుంది. కానీ సూపర్ఛార్జర్ నేరుగా ఆర్‌పిఎమ్ కి కనెక్ట్ చేయబడినందున ఇది ఇంధన వినియోగాన్ని కూడా పెంచుతుంది. తద్వారా కారు మైలేజీ తగ్గుతుంది. టర్బోచార్జర్ ఇంజన్ శక్తిని 20-30 శాతం పెంచుతుంది. కొన్నిసార్లు 50 శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇది సంప్రదాయ ఇంధనాల కంటే తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

మైలేజ్

మైలేజ్ పరంగా చూస్తే, టర్బో ఛార్జర్ ఇంజన్లు అత్యుత్తమ మైలేజీని అందిస్తాయి. కానీ, ఈ ఇంజన్‌కు గరిష్టంగా 50 శాతం శక్తిని మాత్రమే అందిస్తుంది. సగటున 25-30 శాతం శక్తిని అందిస్తుంది. అదే సమయంలో సూపర్ ఛార్జర్ 80 శాతం శక్తిని అందిస్తుంది, అయితే ఇది ఆర్‌పిఎమ్ కి కనెక్ట్ చేయబడినందున 20 శాతం మెకానికల్ లాగ్‌కు కారణమవుతుంది. ఒకవేళ మీకు మంచి పవర్ అవసరమని అనుకుంటే మీకు సూపర్ ఛార్జర్ ఉత్తమమైనది. మీకు పవర్‌తో పాటుగా మైలేజీ కూడా అవసరమని భావిస్తే, మీరు టర్బో ఛార్జర్ ను ఎంచుకోవడం మంచిది.

టర్బో ఛార్జర్ వర్సెస్ సూపర్ ఛార్జర్.. మీ కారుకు ఏది బెస్ట్?

ఏయే కార్లలో ఏయే ఛార్జర్లు ఉన్నాయి.?

భారత మార్కెట్లో విక్రయించబడుతున్న టాటా నెక్సాన్, ఫోక్స్‌వ్యాగన్ జిటి సిరీస్, మారుతి సుజుకి బాలెనో, టాటా బోల్ట్, టాటా జెస్ట్, ఫియట్ లీనియా డి-జెట్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లలో టర్బో చార్జర్ ఉంటుంది. అలాగే, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు రేంజ్ రోవర్ వంటి కార్లలో సూపర్ ఛార్జర్లు అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Which engine suits best to you turbocharger or supercharger lets find out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X