జర్మన్ లగ్జరీ కారు కొన్న ప్రేమకావాలి హీరో 'ఆది'.. మీరు చూసారా..!!

తెలుగు సినీ పరిశ్రమలో 'డైలాగ్ కింగ్' ప్రాచుర్యం పొందిన సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆసారాం లేదు. ఎందుకంటే సాయికుమార్ 'అగ్ని' అనే డైలాగ్ తో అందరికి బాగా దగ్గరైపోయారు. అయితే సాయికుమార్ కొడుకు 'ఆది' గురించి కూడా దాదాపు అందరికి తెలుసు. ప్రేమకావాలి, లవ్లీ మరియు ప్యార్ మే పడిపోయానే వంటి సినిమాల్లో నటించి కుర్ర కారుని ఎంతగానో ఆకట్టుకుని అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు.

జర్మన్ లగ్జరీ కారు కొన్న ప్రేమకావాలి హీరో 'ఆది'.. మీరు చూసారా..!!

సాధారణంగా సినీపరిశ్రమలో చాలామందికి లగ్జరీ కార్లు మరియు లగ్జరీ బైకులు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు మార్కెట్లో అడుగుపెట్టే ఆధునిక కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి వారు కొత్త లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ వరుసలో ఆది కూడా చేరిపోయాడు.

జర్మన్ లగ్జరీ కారు కొన్న ప్రేమకావాలి హీరో 'ఆది'.. మీరు చూసారా..!!

ఇటీవల 'ఆది' జర్మనికి చెందిన మెర్సిడెస్ బెంజ్ యొక్క ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆది తండ్రి సాయికుమార్ మరియు ఆది భార్య, కూతురు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు కూడా ఇక్కడ చూడవచ్చు.

జర్మన్ లగ్జరీ కారు కొన్న ప్రేమకావాలి హీరో 'ఆది'.. మీరు చూసారా..!!

లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారుని తన కుటుంబంతో కలిసి డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది బెంజ్ బ్రాండ్ యొక్క ఏ మోడల్ అనేది ఖచ్చితంగా తెలియదు, కావున దీని ధర కూడా ఖచ్చితంగా వెల్లడించలేదు. అయితే ఇది మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ 300డి లేదా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ 400డి అయి ఉంటుందని ఊహిస్తున్నాము.

జర్మన్ లగ్జరీ కారు కొన్న ప్రేమకావాలి హీరో 'ఆది'.. మీరు చూసారా..!!

అయితే మొత్తానికి ఇది చాలా ఖరీదైనదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, కావున ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో లేటెస్ట్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ అందుబటులో ఉన్నాయి. ఈ లగ్జరీ కారు యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో బెంజ్ లోగో మరియు ఆకర్షణీయమైన గ్రిల్ వంటివి ఉన్నాయి.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ డిస్ప్లై ఒకదాని మీద అమర్చబడి ఉంది, అంతే కాకూండా స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందించడానికి లెదర్ తో చుట్టబడి ఉండటం మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ స్ట్రీరింగ్ వీల్ లో కంట్రోల్ బటన్లు కూడా ఉన్నాయి. ఇందులో ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇంటీరియర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది.

జర్మన్ లగ్జరీ కారు కొన్న ప్రేమకావాలి హీరో 'ఆది'.. మీరు చూసారా..!!

ఇక ఇందులో ఆధునికి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్థాయి. ఇది అద్భుతమై పనితీరుని అందిస్తుంది, కావున వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని తప్పకుండా అందిస్తాయి.

హీరో 'ఆది' ప్రేమ కావాలి మరియు లవ్లీ సినిమాల తరువాత ఆశించిన విజయాలు లభించలేదు. అయితే ఇటీవల ఆది కొత్త మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్‌, యాక్షన్‌ ఓరియెంటెండ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7 న విడుదలైంది. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ముందుకు వెళుతోంది. ఇదే ఆనంద సమయంలో కొత్త లగ్జరీ కారు కోన్ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నెలకొల్పింది.

ఖరీదైన బెంజ్‌ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్‌ చేతిలో ఆరుకి పైగా సినిమాలున్నాయి. అయితే ఇప్పుడు ఆది కొనుగోలు చేసిన ఈ కారు దాదాపు రూ. 50 లక్షలకంటే కూడా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Aadi sai kumar buys mercedes benz details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X