'సౌరభ్ శుక్లా' కొనుగోలు కొత్త జర్మన్ లగ్జరీ కార్.. ఇదే: చూసారా..!!

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రచయిత మరియు ప్రొడ్యూసర్ అయిన 'సౌరభ్ శుక్లా' ఇటీవల జర్మన్ బ్రాండ్ అయిన ఆడి కంపెనీ యొక్క క్యూ2 ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. సౌరభ్ శుక్లా సత్య, యువ, బర్ఫీ, జాలీ ఎల్‌ఎల్‌బి, కిక్, పికె, జాలీ ఎల్‌ఎల్‌బి 2 మరియు రైడ్ వంటి చిత్రాలలో నటించి అత్యంత పాపులర్ నటుడుగా నిలిచాడు. అయితే ఇప్పుడు ఆడి క్యూ2 కొనుగోలు చేసి మరో సారి వార్తల్లో నిలిచాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

సౌరభ్ శుక్లా కొనుగోలు చేసిన ఈ కొత్త ఆడి క్యూ2 ఎస్‌యూవీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు శుక్లా యొక్క డెలివరీకి సంబంధించిన చిత్రాలను ఆడి కంపెనీ తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. మీరు కూడా ఈ ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Audi Q2 SUV విషయానికి వస్తే, ఈ లగ్జరీ SUV యొక్క ప్రారంభ ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 48.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఆడి Q2 SUV ఐదు ట్రిమ్ ఎంపికలలో అందించబడుతుంది. అవి స్టాండర్డ్, ప్రీమియం, ప్రీమియం ప్లస్ I, ప్రీమియం ప్లస్ II మరియు టెక్నాలజీ. అయితే శుక్లా ఇందిలో ఏ వేరియంట్ కొనుగోలు చేసారు అనేది ఖచ్చితంగా తెలియదు.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

దేశీయ మార్కెట్లోని ఆడి క్యూ2 SUV కంపెనీ యొక్క అతి చిన్న మరియు అత్యంత సరసమైన కారు. ఇది అక్టోబర్ 2020లో భారతదేశంలో ప్రారంభించబడింది. SUV ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క MQB ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఆడి క్యూ2 కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా భారత మార్కెట్లోకి దిగుమతి అవుతుంది.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

కొత్త ఆడి క్యూ 2 లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 228 కిమీ.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

ఆడి క్యూ 2 ఎస్‌యూవీ డిజైన్ గమనించినట్లయితే ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సపరేట్ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, డైనమిక్ టర్న్ ఇండికేటర్, మాట్టే ఫినిష్ గ్రిల్, ఆడి లోగో, బ్లాక్ అండ్ డ్యూయల్ టోన్ ఓఆర్‌విఎం, 5 స్పోక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ట్రిమ్ ప్రకారం స్టైలింగ్ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఆడి క్యూ 2 ఎస్‌యూవీలో ఆడి వర్చువల్ కాక్‌పిట్, స్మార్ట్ ఇంటర్‌ఫేస్, స్పోర్ట్ సీట్, వైర్‌లెస్ ఛార్జింగ్, పార్కింగ్ యాడ్, రియర్ వ్యూ కెమెరా, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

అంతే కాకుండా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌విఎం, 10 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి అధునాత ఫీచర్స్ కూడా ఉన్నాయి. కానీ ముందు సీటు కోసం రియర్ ఎసి వెంట్స్ మరియు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సౌకర్యం లేదు.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

ఆడి క్యూ 2 ఎస్‌యూవీ సంస్థకు భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1, వోల్వో ఎక్స్‌సి 40 మరియు మినీ కంట్రీమన్‌ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ SUV దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో మంచి ఆదరణ పొందుతూ సాగుతోంది.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

ఇదిలా ఉండగా ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో త్వరలో తన క్యూ7 SUV ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త ఆడి క్యూ7 కారు గ్లోబల్ మార్కెట్‌లో ఆరు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

ఆడి క్యూ7లో కంపెనీ 2,995సిసి వి6 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఆడి తన A8L, A6 మరియు Q8 మోడళ్లలో కూడా ఈ ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

'సౌరభ్ శుక్లా' కొనుగోలు చేసిన కొత్త కార్.. ఇదే: చూసారా..!!

త్వరలో రానున్న ఈ కొత్త మోడల్ లో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకూండా పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్ మరియు యాంబియంట్ లైటింగ్‌ వంటి వాటిని కూడా పొందుతుంది. కొత్త ఆడి క్యూ7 ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ దీని ధర రూ. 1 కోటి వరకు ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Actor saurabh shukla buys new audi q2 suv here are all the details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X