యాంకర్ అనసూయ అకౌంట్లో ఖరీదైన ఆడి కారు

By Anil

అనసూయ కొంత కాలం క్రితం ఇది ఒక సాదారణ పేరు మాత్రమే. కాని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనసూయ గురించి ఎవర్ని పలుకరించినా ఠక్కున జబర్దస్త్ అనసూయ అని చెప్పుకొస్తారు. సాధారణ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ బుల్లి తెర కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా చాలా పాపులారిటీ తెచ్చుకుంది.

ఇలా ఓ నాలుగైదు షోలు చేసుకుంటూ ఏకంగా వెండి తెర మీద తన నటన చూపించింది. "సోగ్గాడే చిన్ని నాయనా" సినిమాలో రొమాంటిక్ రోల్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇంత సేపు ఈ కుందనపు బొమ్మ గురించి పొగుడుతున్నారు అసలు మ్యాటరేంటి అనుకుంటున్నారా ? యాంకర్ మరియు నటి అయిన అనసూయ భరద్వాజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు కోటి రుపాయల విలువైన కారును కొనుగోలు చేసింది. అనసూయ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

అనసూయ ఆడి క్యూ7

అనసూయ ఆడి క్యూ7

సాదారణంగా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కథనాయకీ, నాయకులు మాత్రమే ఇలాంటి కార్లను కొనుగోలు చేస్తారు. కాని యాంకర్ మరియు నటిగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆడికు చెందిన క్యూ7 లగ్జరీ కారును ఎంచుకుంది.

ఆడి క్యూ7 సాంకేతిక వివరాలు

ఆడి క్యూ7 సాంకేతిక వివరాలు

ఆనసూయ ఎంచుకున్న ఆడి క్యూ7 కారులో 2967 సీసీ కెపాసిటి గల 3.0-లీటర్ వి- టైపు డీజల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 245 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ విడుదల చేయును.

వేగం

వేగం

ఇందులో గల ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అనుసంధానం చేశారు. తద్వారా ఇది కేవలం 7.1 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరకుటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లుగా ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ముందు మరియు వెనుక వైపున స్పీకర్లు, బ్లూటూత్,యుఎస్‌బి మరియు ఏయు‌క్స్ కనెక్టివిటీ కలవు. లెథర్ సీట్లు, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కలవు.

భద్రత ఫీచర్లు

భద్రత ఫీచర్లు

యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, ప్యాసింజర్ మరియు డ్రైవర్ ఎయిర్ బ్యాగులు, ముందు మరియు వెనుక వైపున సైడ్ ఎయిర్ బ్యాగులు, క్రాష్ సెన్సార్లు, పవర్ డోర్ లాక్స్, యాంటి థెఫ్ట్ అలారమ్, ఇంజన ఇమ్మొబిలైజర్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో కలవు.

ఆడి క్యూ7 కారు ధర

ఆడి క్యూ7 కారు ధర

ఆడి క్యూ7 లగ్జరీ కారు ధర సుమారుగా 97 లక్షలు (అందాసు)గా ఉంది. జబర్దస్త్ యాంకర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

నానో కారుతో ప్రారంభం

నానో కారుతో ప్రారంభం

అనసూయ ప్రారంభంలో హైదరాబాదులో నానో కారులో చక్కర్లు కొడుతూ కనిపించేది. ఇప్పుడు అవే రోడ్ల మీద ఆడి కారులో తిరగనుంది.

కెరీర్

కెరీర్

యాంకర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చక్కనైన చుక్కనమ్మ హైదరబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. కాలేజి రోజుల్లో పార్ట్ టైమ్ జాబ్ కోసం టివీ షోలోలలో నటించి ఇప్పుడు శాశ్వతంగా వెండి మరియు బుల్లి తెరలకు అంకితమైపోయింది.

వయస్సు

వయస్సు

యాంకర్ అనసూయ 1989 జనవరి 23 న పుట్టింది. ఈ ఏడాదితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

రెమ్యున్యరేషన్

రెమ్యున్యరేషన్

సాదారణ టీవీ షోలలో ఒక షోకు పది వేలు మరియు ఆడియో రిలీజ్ మరియు ఇతరత్రా షో లకు 50 వేల వరకు తీసుకుంటునట్లు తెలిసింది. అయితే తాజా సోగ్గాడే చిన్ని నాయనలో నటించిన అనసూయ రోజుకు 4 లక్షలు చొప్పున 10 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ కోసం 40 లక్షలు ముట్టినట్లు తెలిసింది.

జబర్దస్త్ ద్వారా

జబర్దస్త్ ద్వారా

జబర్దస్త్ కామెడీ షోకు ముందు అనసూయ మా మ్యూజిక్‌లో విజె గా, మంత్ర, సాక్షి ఛానెల్ న్యూస్ రీడర్‍‌గా ఎన్నో షోలలో యాంకరింగ్ చేసంది. అయితే ఈ టీవి వారి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరుతో పాటు కెరీర్‌ను ఎంతో అందంగా మలుచుకుంది.

సినిమాలలో

సినిమాలలో

"సోగ్గాడే చిన్నినాయన" సినిమా విజయవంతంలో ఎంతో ఆనందంతో ఉన్న ఈ అమ్ముడు ప్రస్తుతం "క్షణం" అనే హారర్ సినిమాలో పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారు. ఇలాగే అనసూయ జీవితం మంచి సినిమాలు మరియు టీవీ షో ల ద్వారా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని కోరుకుందాం....

సెలబ్రిటీలు మరియు వారి కార్లు
  • ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు
  • కోహ్లి ఆట తీరు, కార్ల ఎంపిక తీరు రెండూ అత్భుతమే...!
  • కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

Most Read Articles

English summary
Telugu - Anchor Anasuya Bharadwaj Gets Audi Q7
Story first published: Thursday, March 31, 2016, 15:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X