మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి, చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

భారతదేశంలో చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు కూడా ఎక్కువ ఫీచర్స్ అందిస్తున్నాయి. ఎక్కువ మంది కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడే ఫీచర్ 'సన్‌రూఫ్'.

సన్‌రూఫ్ అనేది నిజానికి కారులోకి ఎక్కువ గాలి మరియు వెలుతురు రావడానికి ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది దీనిని మరొకలా ఉపయోగించుకుని ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

నివేదికల ప్రకారం.. సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన ఒక కారులో ఇద్దరు వ్యక్తులు ఆ సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి నిలబడి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు గమనించినట్లతే, కియా కార్నివాల్ కారు యొక్క సన్‌రూఫ్ నుంచి ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నట్లు తెలుస్తోంది.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

సన్‌రూఫ్ నుంచి ఆ వ్యక్తులు బయట ఉన్నప్పుడు కారుని నడిపే డ్రైవర్ వేగంగా కారుని డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కారుకి ఒక సందర్భంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు.ఈ సంఘటనను నిలబడి ఉన్న వ్యక్తులు అస్సలు ఊహించి కూడా ఉండరు. అయితే ఈ సందర్భంలో సన్‌రూఫ్ నుంచి బయట నిలబడి ఉన్న వ్యక్తి ముఖం కారుని గుద్దుకుంటుంది. అనుకోకుండా క్షణికంలో జరిగిన ఈ సంఘటనకు వారు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

కారు వేగంగా వెళుతున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడం వల్ల నిలబడి ఉన్న వారి ముఖం కారుని తాకుతుంది, అయితే ఈ సంఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ ప్రయాణించే కారు యొక్క సన్‌రూఫ్ లో నిలబడే వారికి ఇది ఇది ఒక చక్కని ఉదాహరణ అవుతుంది.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

నిజానికి రెప్పపాటు కాలంలో జరిగిన ఈ సంఘటనలో నిలబడి ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా షాకింగ్ లోకి వెళ్లిపోయారు. అయితే కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. కావున ఇలాంటి చర్యలకు పాల్పడే వారు తప్పకుండా మానుకోవాలి. ఎందుకంటే ఈ వీడియోలో సడన్ బ్రేక్ వేయడం వల్ల జరిగిన ప్రమాదం ఇక్కడ కొంత భయానికి లోను చేస్తుంది, కొన్ని సందర్భాల్లో వైర్లు లేదా పొడవైన స్తంభాలు తగిలే అవకాశం ఉంటుంది.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

ఇదిలా ఉండగా రోడ్డుపైన ప్రయాణించే సమయంలో మోటార్ వాహన చట్టానికి విరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు విధించబడతాయి. ఇందులో ఒకటి రోడ్డుపై వెళ్ళేటప్పుడు సన్‌రూఫ్ గుండా బయటకు రావడం కూడా. ఇలాంటి చర్యలకు పాల్పడేవారి మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో ఎక్కువ ధర వద్ద కొనుగోలు చేసే కార్లలో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఫీచర్ ఉండేది. అయితే ఇప్పుడు తక్కువ ధర వద్ద లభించే కార్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటోంది. కావున ఇలాంటి కార్లే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి.

ఇక వీడియోలో కనిపించిన కియా కంపెనీ యొక్క కార్నివాల్ విషయానికి వస్తే, ఇది ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో నిండి ఉండే కార్. ఇందులో 8 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్, వెనుక ప్రయాణీకుల కోసం సింగిల్ 10.1 ఇంచెస్ డిస్ప్లే, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి వాటితోపాటు హర్మాన్ కార్డాన్ ప్రీమియం 8 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ డ్రైవర్ సీటు మరియు డ్రైవర్ సీట్ వెంటిలేషన్ వంటివి ఉంటాయి.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

కియా కార్నివాల్ ప్రెస్టీజ్, లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ పొందుతుంది, ఇది 200 బిహెచ్‌పి పవర్ మరియు 440 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడి ఉంటుంది.

మీ కారులో సన్‌రూఫ్‌ ఉందా.. అయితే ఎప్పుడూ ఇలా చేయకండి: చేస్తే ఇలాగే అవుతుంది [వీడియో]

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కార్లలో అందుబాటులో ఉండే 'సన్‌రూఫ్' ఫీచర్ కారులోకి మరింత ఎక్కువ గాలి మరియు వెలుతురు రావడం కోసం ఉపయోగించబడుతుంది. అయితే కొంతమంది దీనిని అనవసర ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఇలాంటి ప్రయోజనాలే లభిస్తాయి. కావున సన్‌రూఫ్ ద్వారా నిలబడే వారందరికీ ఇది ఒక మంచి గుణపాఠం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Avoid standing out of sunroof in moving car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X