ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

కారు ఇంజన్‌లో ఎయిర్ ఫిల్టర్ (Air Filter) చాలా కీలకమైన భాగం. ఇంజన్ ఎక్కువ కాలం మన్నాలన్నా లేదా దాని పనితీరు సరిగ్గా ఉండాలన్నా కారులో క్రమం తప్పకుండా ఎయిర్‌ఫిల్టర్ మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా, ఇంజన్‌లో ఇంధనం పూర్తిగా మండాలంటే, అందులో శుభ్రమైన ఎయిర్‌ఫిల్టర్ ఉండటం ఎంతో అవసరం. సకాలంలో ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ను మార్చడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్గత దహన యంత్రం (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ICE) సరిగ్గా పనిచేయాలంటే, సదరు ఇంజన్ లోకి తగిన మోతాదులో ఇంధనం మరియు గాలి యొక్క మిశ్రమాన్ని పంపించి మండించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇంజన్‌లో దహన ప్రక్రియకు అవసరమయ్యే గాలి చాలా శుభ్రమైనదిగా ఉండాలి, అలా కాని పక్షంలో ఇంజన్‌లోకి దుమ్ముధూళి ప్రవేశించి, ఇంజన్‌లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

నిజానికి, మన కారులోని ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ యొక్క శుభ్రతను మనమే చెక్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక మెకానిక్ లపై ఆధారపడి, జేబుకు చిల్లు పెట్టుకుంటుంటారు. కారు టైర్లలో గాలి, విండ్‌షీల్డ్ ఫ్లూయిడ్, ఇంజన్ ఆయిల్ క్వాలిటీ వంటి అంశాలను మనం నిత్యం ఎలాగైతే చెక్ చేసుకుంటుంటామో, ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ శుభ్రతను కూడా అలానే చెక్ చేసుకోవచ్చు మరియు అవసరమైతే సులువుగా మార్చుకోవచ్చు.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా మార్చడం వలన ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది మరియు ఇంజన్‌లోకి చిన్నపాటి రేణువులు రాకుండా ఈ ఎయిర్ ఫిల్టర్లు నిరోధిస్తాయి. ఎయిర్ ఫిల్టర్ల వలన ఇదొక్కటే ప్రయోజనం అనుకోకండి. మీరు రెగ్యులర్ ఇంటర్‌వెల్స్ (క్రమం తప్పకుండా, నిర్ధిష్ట కిలోమీటర్లకు అనుగుణంగా) ఎయిర్ ఫిల్టర్లను మార్చినట్లయితే, మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే..

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఇంజన్ జీవిత కాలాన్ని పెంచుతుంది

శుభ్రంగా లేని లేదా పాడైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ల ద్వారా చిన్న పాటి రేణువులు ఇంజన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది సిలిండర్‌లు మరియు పిస్టన్‌ల వంటి ఇంజన్ లోపలి భాగాలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ డ్యామేజీని సరిచేయాలంటే చాలానే ఖర్చు అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం సకాలంలో ఎయిర్ ఫిల్టర్‌లను మార్చడమే.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సమయానుగుణంగా ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను రీప్లేస్ చేసినట్లయితే, ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. దీని వలన ఇంజన్ జీవిత కాలం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇంజన్ చాంబర్ లోకి ప్రవేశించే శుభ్రమైన గాలి, లోపలి ఇంధనాన్ని పూర్తిగా మండించడంలో సహాయపడుతుంది. ఫలితంగా ఇంజన్ సైడ్ వాల్స్ పై ఎలాంటి మురికి చేరకుండా ఉంచుతుంది. మీరు అనవసరంగా మీ కారు ఇంజన్‌పై పెద్ద ఖర్చు చేయకూడదనుకుంటే, సమయానికి ఎయిర్ ఫిల్టర్‌లను భర్తీ చేస్తూ ఉంటే సరిపోతుంది.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

అధిక మైలేజ్ లభిస్తుంది

మీరు మీ కారులో క్రమం తప్పకుండా ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌లను మార్చినట్లయితే, మీ కారు మైలేజ్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది యాక్సిలరేషన్‌ను మెరుగుపరచడంలో కూడా సహకరిస్తుంది. కారు యొక్క మైలేజీని ఎయిర్ ఫిల్టర్‌లు ఎలా ప్రభావితం చేస్తాయనే సందేహం మీకు రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, పాడైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ గుండా కారు ఇంజన్ లోకి దుమ్ము ధూళితో కూడిన గాలి ప్రవేశించినట్లయితే, ఇంజన్ వాల్స్ చుట్టూ జిడ్డుగా ఉండే మందపాటి మురికి పొరలు ఏర్పడుతాయి.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఇలాంటి పరిస్థితుల్లో ఇంజన్ సమర్థవంతంగా పనిచేయడం సాధ్యం కాదు. ఫలితంగా, ఇది ఎక్కువ ఇంధనాన్ని దహనం కోసం ఉపయోగిస్తుంది. కాబట్టి, కారు యొక్క మైలేజ్ కూడా భారీగా తగ్గిపోతుంది. అదే, మీరు క్రమం తప్పకుండా ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌ను మార్చినట్లయితే, ఈ సమస్య దూరంగా ఉండవచ్చు. మంచి ఎయిర్ ఫిల్టర్ ఉంటే, మంచి మైలేజ్ మీ సొంతం. కాబట్టి మీరు తరచూ పెట్రోల్ బంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంధనపు చుక్క కూడా చాలా ముఖ్యం.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది

ఇదివరకు చెప్పుకున్నట్లుగా పాడైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ల వలన ఇంజన్లలోకి ప్రవేశించి గాలి శాతం కూడా తక్కువగా ఉంటుంది. వాస్తవానికి ఇంజన్‌లోని ఇంధనం పూర్తిగా కాలిపోవాలంటే, సమపాళ్లలో ఇంధనం మరియు గాలి చాలా అవసరం. అయితే, పాడైన ఎయిర్ ఫిల్టర్ల కారణంగా ఇంజన్ లోకి ప్రవేశించి గాలి శాతం తగ్గుతుంది కాబట్టి, సైలెన్సర్ నుండి వచ్చే పొగ/ కాలుష్యం కూడా పెరుగుతుంది. కాబట్టి, పర్యావరణ పరిరక్షణకు మీ వంత కృషిగా ఏదైనా చేయాలనుకుంటే, అది మీ వాహనంలో క్రమం తప్పకుండా ఎయిర్ ఫిల్టర్లను మార్చుకోవడమే.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పుడు రీప్లేస్ చేయాలి?

సాధారణంగా మీ కారు ఇంజన్ యొక్క ఎయిర్ ఫిల్టర్ పాడైపోతే దాన్ని వెంటనే మార్చుకోవాలి. అలా కాకుండా, మీ కారు మెరుగైన పనితీరును ప్రదర్శించాలనుకుంటే కనీసం ప్రతి 12 వేల నుండి 15 వేల మైళ్లకు ఒక్కసారి చొప్పున ఎయిర్ ఫిల్టర్‌లను మార్చుకుంటే మంచిదని టెక్నీషియన్లు చెబుతారు. అంటే ప్రతి 19 వేల నుంచి 24 వేల కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్లను మార్చుకోవచ్చన్నమాట.

ఇంజన్ ఎయిర్ ఫిల్టర్లను సకాలంలో మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తక్కువ ధర, త్వరగా మార్చుకోవచ్చు!

ఎయిర్ ఫిల్టర్లను మార్చడం చాలా సులభమైన పని. కాబట్టి దీనిని చాలా త్వరగానే పూర్ చేయవచ్చు మరియు వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఎయిర్ ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, వీటిలో మీ కారుకు ఏది సరైన ఎయిర్ ఫిల్టర్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నాణ్యమైన ఎయిర్ ఫిల్టర్ల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, కాస్తంత ధర ఎక్కువైనా సరే బ్రాండెడ్ ఎయిర్ ఫిల్టర్లను ఎంచుకోవడం మంచిది.

Most Read Articles

English summary
Benefits of replacing car air filter on regualr intervals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X