రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

సాధారణంగా కారులో వెళ్తుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది, కదా.. అయితే కారుని ఉపయోగించేటప్పుడు డ్రైవింగ్ చేసేదగ్గర నుంచి మెయింటెనెన్స్ మరియు రిపేర్ వంటి వాటిపైన కూడా చాలా శ్రద్ద తీసుకోవాలి, అదే సమయంలో బహు జాగ్రత్తగా కూడా వ్యవహరించాలి. లేకుంటే అనుకోని ప్రమాదాలు మనవెంటే ఉంటాయి.

ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో ఒక వ్యక్తి కారుని రిపేర్ చేస్తుండగా మీదికే వెళ్లిపోయింది. ఇది చూడటానికే భయానకంగా అనిపిస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

నిజానికి సోషల్ మీడియాలో విడుదలైన వీడియో భయాన్ని కలిగించడమే కాదు, హృదయ విదారకంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కారు మెకానిక్ గ్యారేజిలో కారుని రిపేర్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి కారు యొక్క బోనెట్ పైకి ఎత్తి తన పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఈ సందర్భంలోనే అతడు బోనెట్ లో చాలా సార్లు చెక్ చేస్తూ ఉంటాడు.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

బోనెట్ లో ఆ మెకానిక్ రిపేర్ చేస్తూ ఉండగానే అనుకోకుండా.. ఆ కారు ముందుకు కదులుతుంది, ఆ కదిలే సమయంలో ఆ మెకానిక్ ని కూడా తోసుకుంటూ వెళ్లి ముందు ఉన్న షట్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన ఎవరూ ఊహించకుండానే జరిగిపోయింది. ఇందులో ఆ మెకానిక్ తలకి తీవ్రంగా దెబ్బ తగిలింది.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

ఈ సంఘటనలో ఆ మెకానిక్ తల కారుకి మరియు షట్టర్‌కి మధ్యలో ఇరుక్కుంది. అయితే మెకానిక్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలియదు. ట్విట్టర్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 7.5 లక్షల మందికి పైగా చూశారు. ట్విట్టర్ వినియోగదారులు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

ఈ వీడియోలో కనిపించే కారు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగిన కారు అని, కావున ఆ మెకానిక్ రిపేర్ చేసే సమయంలో తనకు తానుగా ముందుకు కదిలిందని భావిస్తున్నారు. అయితే ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న కారు మాత్రం యాక్సిలరేటర్ నొక్కకుండా ముందుకు కదలదు, అని కూడా చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

నిజానికి ఆటోమాటిక్ కారు డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నా, రివర్స్ మోడ్‌లో ఉన్నా యాక్సిలరేటర్‌ను నొక్కకుండా ముందుకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన కారు అని కూడా చాలామంది అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కావున ఆ కారు డ్రైవర్ ఆ కారుని ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్ లో ఉంచి హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయి ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏది నిజం అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

ఒక కారులో అనేక రకాల ఆటోమేటిక్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. కావున అందులో ఏవైనా విఫలమైనప్పుడు, సరైన సమయానికి స్పందించే అవకాశం ఉండదు. ఆ సమయంలో తప్పనిసరిగా గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మెకానిక్ లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

కారుని రిపేర్ చేసేటప్పుడు మెకానిక్ తప్పనిసరిగా కారు యొక్క ఇంజిన్ ఆప్ చేసి ఉందా.. లేదా అనేది నిర్దారించుకోవాలి. ఒకవేళా ఇంజిన్ ఆప్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత చేయవలసిన రిపేర్ చేయాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

అది మాత్రమే కాకుండా వాహన వినియోదారులు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలను పాటించాలి. ఇందులో మొదటిది తప్పనిసరిగా కారుని రిపేర్ చేసినప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ ఉపయోగించడం మరచిపోకూడదు. ఒక వేళా ఎత్తు పల్లం ఉండే ప్రాంతాల్లో కారుని నిలపాల్సి వచ్చినప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ వేయడం మరచిపోవద్దు. హ్యాండ్ బ్రేక్ వేయడం వల్ల కారు ముందుకు లేదా వెనుకకు కదలకుండా ఓకే స్థానంలో ఉంటుంది. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

రిపేర్ చేస్తుండగా మెకానిక్‌పైకి వెళ్లిన కారు.. హృదయ విదారకమైన వీడియో

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

వాహనాలు రిపేర్ చేసేటప్పుడు మెకానిక్ మరియు కార్ డ్రైవర్ ఇద్దరూ కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇవి ఏకంగా ప్రాణాలనే తీసే అవకాశం ఉంటుంది. మనం ఈ వీడియో చూసినట్లయితే ఎవరి ప్రమేయం లేకుండా ఒక మెకానిక్ ప్రాణాలమీదికే తెచ్చుకున్నాడు, ఇది నిజంగా బాధాకరం అనే చెప్పాలి. వాహనాలను రిపేర్ చేసుకోవడానికి వెళ్లేవారు తప్పకుండా జాగ్రత్తలు వహించాలి, ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Most Read Articles

English summary
Beware of an automatic car mechanic injured by car that moves itself
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X