బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు: అస్సలు మిస్ కావద్దండి

Written By:

భారతీయ సినీ ప్రపంచంలో అతి పెద్ద వేదిక బాలీవుడ్, దీనిని వేదికగా చేసుకుని ఎంతో పేరుగాంచిన కథానాయకులు మరియు కథానాయికలు తమకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వీరు విపరీతంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు, భాష, ప్రాంతీయ అనే భేధాలకు అతీతంగా అభిమానం చూపిస్తారు ప్రజలు. అదే వారి ప్రియమైన సెలబ్రిటీలకు చెందిన ఏ విధమైన న్యూస్ వచ్చినా ఉబ్బితబ్బిబైపోతారు.

అందుకోసం దేశ వ్యాప్తంగా ఉన్న 14 మంది బాలీవుడ్ అగ్ర హీరో మరియు హీరోయిన్లకు చెందిన బైకులు గురించి తెలుగు పాఠకులకు ప్రత్యేక కథనం అందిస్తున్నాము. మరిన్ని వివరాలకు క్రింద గల స్లైడర్ల మీద క్లిక్ చేయండి.

సంజయ్ దత్

సంజయ్ దత్

బాలీవుడ్‌లో సంజయ్ దత్ గురించి తెలియని వారు ఉండరు. సంజయ్ దత్ తనకు తానుగా దాదాపుగ 15 లక్షల రుపాయలు విలువ చేసే హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్ బైకును కలిగి ఉన్నాడు.

జాన్ అబ్రహాం

జాన్ అబ్రహాం

జాన్ అబ్రహాం బైకు ప్రేమికుడు అని బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తెలుసు, దీనిని సాక్ష్యం చూపాలి అంటే 25 లక్షలు విలువైన అప్రిలియా ఆర్‌ఎస్‌వి4 బైకు చాలు. ఎందుకంటే అబ్రహాం వద్ద ఈ బైకు ఉంది కాబట్టి. అంతే కాకుండా దీనితో పాటు మొత్తం ఏడు బైకులను కలిగి ఉన్నాడు. వాటి వివరాలు యమహా వి-మ్యాక్స్ 1700సీసీ (23 లక్షలు), కవసాకి జడ్‌ఎక్స్ నింజా (17 లక్షలు) సుజుకి హయాబుసా (15 లక్షలు), యమహా ఆర్1 1000సీసీ (14 లక్షలు) యమహా ఎమ్‌టి-01 (10 లక్షలు) యమహా రావెన్ (9 లక్షలు)

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్

షాహిద్ కపూర్ 18 ఏళ్ల వయస్సులో బజాజ్ కాలిబర్ బైకు ఉందని గర్వంగా ఫీల్ అయ్యేవాడు. మరి ఇప్పుడేమో యమహా ఎమ్‌టి-01 (10 లక్షలు) హ్యార్లీ డేవిడ్ సన్ బైకు (15 లక్షలకు పైబడి ఉంది)

 సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్‌కు హ్యార్లీ డేవిడ్‌సన్‌కు చెందిన ఐరన్883 బైకు అంటే మహా ప్రాణం. దీన ధర దాదాపుగా 7 లక్షలు పైబడి ఉంది.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

ఎటువంటి స్టంట్స్ చేయాలన్నా అక్షయ్ కుమార్ ఉండాల్సిందే. అటువంటి అక్షయ్ కుమార్ దగ్గర కస్టమ్ డిజైన్ చేయించిన హోండా సిబిఆర్ అంతర్జాతీయ మోడల్ కలదు. దీని విలువ దాదాపుగా 13 లక్షలు వరకు ఉంది. అయితే చిన్న తనంలో అక్షయ్ తండ్రి ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తనకు హోండాకు చెందిన బైకును కొనిచ్చాడు. అది ఇప్పటికీ అక్షయ్‌ దగ్గరే ఉంది. అయితే అదే హోండా కంపెనీకి అక్షయ్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్‌కు బైకులు అంటే భలే ఇష్టం. ప్రస్తుతం ఇతని వద్ద రెండు బైకులు కలవు. సుజుకి హయాబుసా స్పోర్ట్స్ బైకు ధర సుమారుగా రూ. 15 లక్షలు మరియు సుజుకి ఇంట్రూడర్ ఎమ్1800ఆర్‌జడ్ ధర సుమారుగా రూ. 16 లక్షలు వరకు ఉంటుంది.

నీల్ నితిన్ ముఖేష్

నీల్ నితిన్ ముఖేష్

ఇతను ఈ మధ్యనే ఈ జాబితాలోకి వచ్చి చేరాడు. ఇతను డుకాటికి చెందిన 848 బైకును కలిగి ఉన్నాడు. దీని ధర సుమారుగా రూ. 16 లక్షల వరకు ఉంటుంది.

ఉదయ్ చోప్రా

ఉదయ్ చోప్రా

ధూమ్ సినిమాలలో వినియోగించి అన్ని బైకులు కూడా ఉదయ్ చోప్రాకు చెందినవే. వీటితో పాటు సుజుకి జిఎస్‌ఎక్స్‌ఆర్ ధర సుమారుగా 16 లక్షలు, సుజుకి బందిత్ ధర సుమారుగా రూ. 10 లక్షలు మరియు సుజుకి జిఎస్ఆర్ ధర సుమారుగా రూ. 77,000 లు

ఆర్ మాధవన్

ఆర్ మాధవన్

ఆర్ మాధవన్ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన కె1600 జిటిఎల్ అనే బైకును కలిగి ఉన్నాడు. దీని ధర సుమారుగా రూ. 33 లక్షల వరకు ఉంది.

వివేక్ ఒబేరాయ్

వివేక్ ఒబేరాయ్

రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షలకు బాగా దగ్గరైన వివేక్ ఒబెరాయ్ డుకాటికి చెందిన 1098 ధర సుమారుగా రూ. 49 లక్షలు మరియు యమహా వి-మ్యాక్స్ బైకు ధర సుమారుగా రూ. 23 లక్షలు. విలువైన బైకులను కలిగి ఉన్నాడు.

ఫర్దీన్ ఖాన్

ఫర్దీన్ ఖాన్

ఫర్దీన్ ఖాన్ అత్యధికంగా 63 లక్షలు రుపాయలు ఖరీదైన కవాసకి జడ్‌జడ్ఆర్ 1200 బైకును కలిగి ఉన్నాడు.

గుల్ పనాగ్

గుల్ పనాగ్

గుల్ పనాగ్‌కు బైకు రైడింగ్ అంటే అమితాశక్తి . ఓ సారి పెళ్లి అయిన గుల్ పనాగ్ లక్ష రుపాయల విలువైన రాయల్‌ ఎన్ఫీల్డ్ బైకును కలిగి ఉంది.

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

శ్రద్దా కపూర్ ఎక్ విలాని చిత్రం నిర్మిస్తున్న సంజర్భంలో బైకు నడపాల్సి వచ్చింది. అయితే ఈ అమ్ముడు అలా బైకు రైడ్ చేస్తున్న సందర్బంలో క్రింజ పడి గాయాలపాలు అయ్యింది. అ తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ బైకును కొనుగోలు చేసింది.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

హీరోల బైకుల సరసన ప్రియాంకా చోప్రా కూడా చేరిపోయింది. ఈ మధ్యనే ప్రియాంకా అబ్బాయిలకు ధీటుగా ఆరు లక్షలు విలువైన హ్యార్లీ డేవిడ్‌‌సన్ బైకును కొనుగోలు చేసింది. అయితే తనకు నచ్చినట్లుగా దానిని పింక్ రంగులోకి మార్పించుకుంది అనుకోండి.

English summary
Bollywood Stars And Their Favourite Bikes
Story first published: Monday, March 7, 2016, 16:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos