గాల్లోకి ఎగిరి రెండు అంతస్థుల మేడ మీదకు దూసుకెళ్లిన కారు

కాలిఫోర్నియా నగరంలో ఓ కారు డ్రైవర్ మెరుపు వేగంతో రోడ్డు మీద వెళ్లుతూ, డివైడర్‌ను ఢీకొని, దానికి ఎదురుగా ఉన్న భవంతిలోకి దూసుకెళ్లినట్లు కాలిఫోర్నియా అధికారులు మీడియాకు వెల్లడించారు.

By Anil

Recommended Video

Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

మేడ మీద ఇరుక్కుపోయిన ఈ కారును చూస్తే, ఫ్లైఓవర్ మీద నుండి అదుపు తప్పి ప్రక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి దూసుకెళ్లిందనుకున్నారు కదూ... మీరే కాదు మేము కూడా మొదట్లో అలాగే బోల్తా పడ్డాము. ఎందుకంటే ఇది ఫ్లైఓవర్ మీద నుండి కాదంట, క్రింద ఉన్న రోడ్డు మీద నుండే ఇలా రెండంస్థతుల మేడ మీదకు దూసుకెళ్లిందట.

రెండు అంతస్థుల భవనంలోకి దూసుకెళ్లిన కారు

షాకయ్యారు కదూ... మరి కాకుండా ఉంటారా... రోడ్డ మీద నుండి రెండవ భవంతిలోకి ఓ కారు వెళ్లడమంటే మాటలా... చేతికొచ్చిందల్లా రాసేస్తున్నారని పొరబడకండి. ఇది నూటికి నూరు పాళ్లు జరిగిన సంఘటన.

రెండు అంతస్థుల భవనంలోకి దూసుకెళ్లిన కారు

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియా నగరంలో ఓ కారు డ్రైవర్ మెరుపు వేగంతో రోడ్డు మీద ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా ఉన్న భవంతిలోకి దూసుకెళ్లినట్లు కాలిఫోర్నియా అధికారులు మీడియాకు వెల్లడించారు.

ఈ ప్రమాదం తాలూకు వీడియో కూడా ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన ఆరేంజ్ కంట్రీ ఫైర్ అథారిటీ బృందం రెండవ అంతస్థులో ఇరుక్కున్న కారులో నుండి ఇద్దరిని రక్షించారు.

నిస్సాన్ అల్టిమా కారు మితి మీరిన వేగంతో దూసుకెళ్లి, అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ, రోడ్డుకు ఎదురుగా ఉన్న డెంటల్ హాస్పిటల్ భవనం రెండవ అంతస్థు మీదకు దూసుకెళ్లింది.

రెండు అంతస్థుల భవనంలోకి దూసుకెళ్లిన కారు

తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో రోడ్డు ప్రక్కనే ఉన్న చిన్న కార్యాలయాన్ని పూర్తి ధ్వంసం చేసింది. అదృష్టం ఏమిటంటే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.

Trending On DriveSpark Telugu:

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

అందరూ స్పాట్‌లోనే ఛిద్రమయ్యారు

8 నెలల గర్భవతిని కారుతో తొక్కించాడు

రెండు అంతస్థుల భవనంలోకి దూసుకెళ్లిన కారు

ప్రమాదం జరిగిన వెంటనే మంటలు స్వల్పంగా చెలరేగాయి. కారులో డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి ప్రమాదం గురించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాత్రికి రాత్రే వారిని ఆ కారులో నుండి రక్షించారు.

రెండు అంతస్థుల భవనంలోకి దూసుకెళ్లిన కారు

మరుసటి రోజు ఉదయం అధికారుల ఈ కారును క్రేన్ మరియు హైడ్రాలిక్ లిఫ్ట్ సహాయంతో భవంతి నుండి కారును క్రిందకు దించారు. ఎవ్వరూ ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదం డ్రైవర్లందరికీ ఓ మంచి గుణపాఠం నేర్పిందని చెప్పవచ్చు.

రెండు అంతస్థుల భవనంలోకి దూసుకెళ్లిన కారు

మితిమీరిన వేగంతో జరిగే అనర్థాలకు లెక్కేలేదు. ప్రమాదం ఎలా జరిగినా చివరగా మిగిలేది ప్రాణ నష్టమే. కాబట్టి రోడ్డు ప్రయాణిస్తున్నపుడు పరిమిత వేగాన్ని మాత్రమే అనుసరించండి. అనవసరపు వేగం మీతో పాటు ఇతర కుటుంబాలకు కూడా తీరని లోటును మిగుల్చుతుంది.


రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారులో ప్రయాణికులంతా సేఫ్: ఇంతకీ ఇది ఏ కారో... తెలుసా...?

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది... అదే గ్రహచారం బాగుంటే ఎంత ఘోరం నుంచైనా తాపీగా తప్పించుకోవచ్చు. కొన్నిసార్లు ఈ నానుడి నిజమే అనిపించినప్పటికీ, అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. ఉదాహరణకు కేరళలో ఓ కారు రెండు లారీల మధ్య నలిగిపోయింది. అయితే, అందులో ఉన్న వారందరూ ఏ మాత్రం గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

ఇక్కడ వీరంతా సురక్షితంగా తప్పించుకున్నారంటే ఆ క్రెడిట్ అదృష్టానిదో... లేదంటే గ్రహచారానిదో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే, ఆ కారు నిర్మాణ నాణ్యతే వారిని బయటపడేసింది. ఇంతకీ ఆ కారేదో చెప్పలేదు కదూ... ఈ ప్రమాదం ఎలా జరిగింది మరియు కారు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

కేరళలో జరిగిన ఓ ప్రమాదంలో కారు ముందు మరియు వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయినా...అందులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

వోక్స్‌వ్యాగన్ వెంటో కారు ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఇదే క్రమంలో వెంటో కారుకు వెనకాలే వచ్చిన మరో లారీ కారును వెనక నుండి ఢీకొట్టింది. దీంతో రెండింటి మధ్య తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. ఫోటోలను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

వోక్స్‌వ్యాగన్ వెంటో కారులోని క్రంపల్ జోన్స్ ప్రమాదం జరిగినపుడు ఎలా పనిచేస్తాయో ఈ యాక్సిడెంట్ నిరూపించింది. క్రంపల్ జోన్స్ అంటే ముందు మరియు వెనుక వైపు నుండి ప్రమాదం జరిగినపుడు ప్రమాద తీవ్రత క్యాబిన్‌ను చేరకుండా ప్రమాదం నుండి వచ్చిన ఫోర్స్ చిన్న చిన్న మొత్తంలో విడిపోతుంది. ఈ పనితనం మొత్తం కారు ఫ్రేమ్‌లో ఇమిడి ఉంటుంది.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

వోక్స్‌వ్యాగన్ వెంటో కారుకు పోటీగా ఉన్న ఇతర మిడ్ సైజ్ సెడాన్ కార్లలో ఇదే బెస్ట్. అత్యుత్తమ బిల్ట్ క్వాలిటీ, బాడీ స్ట్రక్చర్‌ పెద్ద పెద్ద ప్రమాదాల నుండి ప్రయాణికులను సురక్షితంగా రక్షిస్తుంది. ఈ ప్రమాదంలో బాడీ స్ట్రక్చర్‌తో పాటు సీట్ బెల్ట్ మరియు ఎయిర్ బ్యాగులు కూడా చక్కటి పనితీరును కనబరిచాయి.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

మంచి నిర్మాణ నాణ్యతలతో నిర్మించిన కార్లు ఎప్పుడైనా ప్రాణాలను కాపాడుతాయి. అలాంటి కార్లను నిర్మించే కంపెనీల్లో వోక్స్‌వ్యాగన్ ఒకటి. నిజమే, ఇండియాలో వోక్స్‌వ్యాగన్ ఆశించిన ఫలితాలు సాధించకపోయినా... ఆ కార్ల ధరలు ఎక్కువ అనిపించినా... సేఫ్టీ పరంగా సామాన్యుల బెస్ట్ కార్లు ఇవే అని చెప్పాలి.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

ఇండియాలో చాలా వరకు కార్ల కంపెనీలు తేలికపాటి బరువున్న ఛాసిస్ మీద తక్కువ లోహంతో రూపొందించిన బాడీని నిర్మించి కార్లను తయారు చేస్తాయి. ఇందుకు ప్రధాన కారణం తక్కువ ధరలో మరియు అధిక మైలేజ్ ఇచ్చే విధంగా తయారు చేయాలనుకోవడం. ఇప్పట్లో కస్టమర్లు కూడా ఇలాంటి కార్లనే ఎంచుకుంటున్నారు.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

డబ్బు మరియు మైలేజ్ మనిషి ప్రాణం కంటే విలువైనవేం కాదు. కాబట్టి కాస్తంత నాణ్యత ఉన్న కార్లను ఎంచుకోవడానికే ప్రయత్నించండి. మైలేజ్ బాగా వస్తాయని, తక్కువ ధరలోనే లభిస్తాయని నాణ్యత లేని కార్లను ఎంచుకోకండి.

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారు

వోక్స్‌వ్యాగన్, స్కోడా, ఫియట్ మరియు ఫోర్డ్ వంటి కంపెనీలు బడ్జెట్ ధరలో అత్యుత్తమ నిర్మాణ నాణ్యత గల కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ కంపెనీ కార్లు భారీ ప్రమాదాల నుండి ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Picture credit: OCFA PIO

Most Read Articles

English summary
Read In Telugu: Car crashes into second floor of building
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X