వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

రోడ్డుపై తిరిగే ప్రతి మోటార్ వాహనాని వాహన బీమా (మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్) పాలసీ ఉండటం తప్పనిసరి. వాహన భీమా లేకుండా మోటార్ వాహనాన్ని రోడ్డుపై నడపడం చట్టరీత్యా నేరం. అయితే, వాహన బీమా తీసుకునే వారిలో చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, తుఫానులు, వరద ఈదురు గాలులు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వలన తమ వాహనాలకు జరిగే నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తాయా అని. మరి ఈ సందేహాన్ని ఈ కథనంలో నివృత్తి చేసుకుందాం రండి.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

సాధారణంగా సంభవించే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవటం మానవ సాధ్యం కాదు. ఇలాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవులతో పాటుగా వాహనాలకు కూడా నష్టం వాటిళ్లుతుంది. ఉదాహరణకు చెట్టు క్రింద పార్క్ చేసి ఉన్న వాహనంపై చెట్టు విరిగి పడటం, భూకంపం కారణంగా వాహనం నేలలోకి ఒరిగిపోవడం, వరదల కారణంగా కారు నీటిలో కొట్టుకుపోవడం మొదలైన నష్టాలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరుగుతుంటాయి.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ వాహనాలకు జరిగే నష్టాన్ని వాహన బీమా కంపెనీలు కవర్ చేస్తాయా అంటే, ఈ ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం - అవును. ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ వాహనానికి కలిగే నష్టాలను బీమా కంపెనీలు కవర్ చేస్తాయి. కానీ దానికి కొన్ని నిబంధనలు మరియు షరతులు జోడించబడ్డాయి, వాటిని నెరవేర్చిన తర్వాత మాత్రమే బీమా కంపెనీ నష్టం యొక్క క్లెయిమ్‌ని నిర్ణయిస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవాలంటే ముందుగా మనం బీమా భావనను అర్థం చేసుకోవాలి.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

బీమా కంపెనీకి మరియు కారు బీమాను కొనుగోలు చేసే వ్యక్తికి మధ్య కుదుర్చుకునే ఒప్పందమే వాహన బీమా. పాలసీ తీసుకునే వ్యక్తి బీమా ప్రీమియం చెల్లించి, బీమా సంస్థ నుంచి పాలసీని కొనుగోలు చేసి పాలసీదారు అవుతాడు. బీమా కంపెనీ ప్రీమియంను అంగీకరిస్తుంది మరియు నిర్దిష్ట నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి తమ వాగ్దానాన్ని అందిస్తుంది. బీమా కంపెనీలు ప్రకృతి వైపరీత్యాలను కూడా కవర్ చేస్తాయి, అయితే ఇది పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు లోబడి మాత్రమే ఉంటుంది.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు బీమా వర్తిస్తుందా?

ప్రకృతి వైపరీత్యం కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఓ నిర్దిష్ట బీమా పాలసీ అంటూ ఏదీ లేది. అయితే, ప్రకృతి వైపరీత్యం వల్ల మీ వాహనానికి కలిగే నష్టాన్ని సమగ్ర మోటారు బీమా పాలసీ (కాంపర్హెన్సివ్ మోటార్ వెహికల్ పాలసీ) కవర్ చేస్తుంది. సమగ్ర బీమా పాలసీ ప్రకృతి వైపరీత్యంలో ఒకరి స్వంత వాహనానికి జరిగిన నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కాబట్టి, మీరు సమగ్ర బీమా పాలసీని ఎంచుకుంటేనే, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుండి మీ కారు రక్షించబడుతుంది. ధర్డ్ పార్టీ పాలసీలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే నష్టాలను కవర్ చేయవు.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

వాహనం చోరీకి గురైనా సమగ్ర బీమా వర్తిస్తుందా?

వాస్తవానికి, సమగ్ర వాహన బీమా పాలసీలో, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టమే కాకుండా, దొంగతనం కూడా కవర్ చేయబడుతుంది. మోటారు వాహన బీమా రక్షణలో రెండు రకాలు ఉన్నాయి - స్వంత నష్టం (ఓన్ డ్యామేజ్) మరియు మూడవ పక్షం (ధర్డ్ పార్టీ). మీరు మీ వాహనం కోసం సమగ్ర బీమా పాలసీని తీసుకున్నట్లయితే, దొంగతనం జరిగినప్పుడు బీమా కంపెనీ స్వంత నష్టం కింద నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

బీమా క్లెయిమ్ ను ఎలా ఫైల్ చేయాలి?

ఏదైనా ప్రకృతి వైపరీత్యంలో మీ వాహనం దెబ్బతిన్నట్లయితే, ముందుగా మీరు వాహనం యొక్క ఫొటోలను తీయండి. దాని తరువాత, వెంటనే బీమా కంపెనీకి కాల్ చేసి మీ వాహనానికి జరిగిన నష్టాన్ని అందుకు గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి. కాల్ చేసేటప్పుడు మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మీ వాహన పాలసీ నంబర్‌ను గుర్తుంచుకోండి మరియు వాటి పత్రాలను మీకు అందుబాటులో ఉంచుకోండి. ఎందుకంటే, బీమా కంపెనీ మిమ్మల్ని దానికి సంబంధించిన పత్రాలను అడిగే అవకాశం ఉంటుంది.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

బీమా కంపెనీ క్లెయిమ్ ప్రక్రియ ప్రకారం ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించమని లేదా ఇమెయిల్ చేయమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. దాని తర్వాత, బీమా కంపెనీ మీరు పేర్కొన్న చిరునామాకు సర్వేయర్‌ను పంపుతుంది, వారు మీ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బీమా కంపెనీకి ఓ నివేదికను పంపిస్తారు. సర్వేయర్‌ వచ్చిన సమయంలో మీ వాహనానికి జరిగిన నష్టానికి గల కారణాలు మరియు ఎంత మేర నష్టపోయారనే సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది.

వాహనంపై చెట్టు విరిగిపడినా, వరదలో కొట్టుకుపోయినా వెహికల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా?

సర్వేయర్ తనిఖీ చేసిన తర్వాత, మీరు సమీపంలోని మరమ్మతు దుకాణం లేదా సర్వీస్ సెంటర్‌లో వాహనాన్ని రిపేరు చేసుకోవచ్చు. బీమా కంపెనీ మరమ్మతు ఖర్చును నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు లేదా సర్వీస్ సెంటర్ అందించే బిల్లు ఆధారంగా నేరుగా సర్వీస్ సెంటర్ కే చెల్లించవచ్చు.

Most Read Articles

English summary
Car damaged due to natural calamity lets find out what vehicle insurance policy says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X