వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

కారు యజమానులు తమ కారులో తరుచగా పట్టించుకోని విషయం అంటూ ఏదైనా ఉందంటే, అవి వైపర్ బ్లేడ్స్ అనే చెప్పాలి. చాలా మందికి ఇవి రోజూ కనిపిస్తూనే ఉన్నప్పటికీ, వాటిపై అంత శ్రద్ధ వహించరు. నిజానికి వైపర్ బ్లేడ్స్ చాలా అవసరమైన సేఫ్టీ ఫీచర్, ఇవి సరిగ్గా లేకుంటే కారు విండ్‌షీల్డ్ ని శుభ్రంగా ఉంచడం కష్టం. ప్రత్యేకించి, వర్షాకాలంలో వైపర్ బ్లేడ్స్ అవసరం చాలానే ఉంటుంది. వైపర్ బ్లేడ్స్ విండ్‌షీల్డ్ ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతాయి, తద్వారా రోడ్డుపై డ్రైవర్ విజిబిలిటీని పెంచుతాయి.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

నిజానికి, వైపర్ బ్లేడ్‌లు ఖరీదైనవేమీ కావు, అయినప్పటికీ చాలా మంది కార్ల యజమానులు సరైన వ్యవధిలో వైపర్ బ్లేడ్‌లను మార్చడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వైపర్ బ్లేడ్లను ఇంటి వద్దనే మీరే స్వయంగా మార్చుకోవచ్చు లేదా మెకానిక్ వద్దకు తీసుకువెళ్లినా వారు చిటికెలో వీటిని మార్చేస్తారు. వైపర్ బ్లేడ్‌పై అద్దాని తుడిచిపెట్టే భాగం మృదువైన రబ్బరుతో తయారు చేయబడినందున, అది కొంత కాలానికి గట్టిగా మారిపోతుంది. ఒకవేళ, మీకు కవర్డ్ పార్కింగ్ లేకుండా, కారును బయట పార్క్ చేయాల్సి వస్తే, ఎండ వేడి కారణంగా ఇవి మరింత త్వరగా గట్టిపడుతాయి.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

కాబట్టి, వైపర్ బ్లేడ్‌లు పాతవి మరియు గట్టిగా మారినప్పుడు వాటిని వెంటనే మార్చడం చాలా అవసరం. సాధారణంగా ప్రతి 12 నెలలకు ఒకసారి చొప్పున వైపర్ బ్లేడ్‌ లను మార్చాలని తయారీదారులు, టెక్నీషియన్లు సిఫార్సు చేస్తుంటారు. అయితే, ఇది ఒక్కో ప్రదేశానికి మారుతూ ఉంటుంది. విండ్‌షీల్డ్ వైపర్ల జీవితకాలం అనేది అవి సూర్యరశ్మికి గురికావడం, నీటి pH విలువ, నీటి కాఠిన్యం, విండ్‌షీల్డ్‌పై ధూళి మరియు గ్రిట్ పేరుకుపోవడం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

ఒకవేళ, మీరు కూడా మీ కారులో వైపర్ బ్లేడ్‌లను భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు సంప్రదాయ వైపర్ బ్లేడ్‌లను లేదా మరింత ఆధునికమైన ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఫ్రేమ్ లేని వైపర్ బ్లేడ్స్ కొత్తవి మరియు ఆధునికమైనవి కావడంతో, ఇవి ఫ్రేమ్ కలిగిన లేదా సంప్రదాయమైన వైపర్ బ్లేడ్‌ల కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే ఫ్రేమ్‌ లేని వైపర్ బ్లేడ్‌లు గాజు ఉపరితలంపై సమానమైన ఒత్తిడిని పంపిణీ చేస్తాయి, ఫలితంగా విండ్‌షీల్డ్ చాలా క్లీన్ గా మారుతుంది.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

ఈ ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్లు విండ్‌షీల్డ్‌పై సమానంగా ఒత్తిడిని పంపిణీ చేయడం వలన దానిపై హెయిర్-లైన్ స్క్రాచెస్ ఏర్పడే అవకాశాలు కూడా కొంత వరకు తగ్గుతాయి. అలాగే, భారీ వర్షాల సమయంలో, కన్వెన్షనల్ లేదా ఫ్రేమ్డ్ వైపర్ బ్లేడ్‌లు విండ్‌షీల్డ్ పై చేసే అసమాన ఒత్తిడి మరియు వైపర్ బ్లేడ్‌పై ప్రభావం చూపే అధిక వర్షం కారణంగా కొన్నిసార్లు విండ్‌షీల్డ్‌పై పలుచని నీటి పొరలను వదిలివేసే అవకాశం ఉంటుంది.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

అయితే, ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లలో ఈ విధమైన సమస్య దాదాపుగా ఉండదు, ఎందుకంటే విండ్‌షీల్డ్‌ పై ఒత్తిడి సమానంగా పంపిణీ చేయబడుతుంది మరియు నీరు చాలా శుభ్రమైన పద్ధతిలో విండ్‌షీల్డ్ నుండి తుడిచివేయబడుతుంది కాబట్టి. అంతేకాకుండా, ఇవి మంచి ఏరోడైనమిక్ డిజైన్‌ ను కలిగి ఉండి, భారీ వర్షాల సమయంలో ఈ ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లు మెరుగ్గా పనిచేస్తాయి.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

సాంప్రదాయ / ఫ్రేమ్డ్ వైపర్ బ్లేడ్‌లు విండ్‌షీల్డ్‌పై వివిధ స్థాయిల వక్రతకు (కర్వ్ కు) సర్దుబాటు చేయడానికి బహుళ కదిలే భాగాలను ఉపయోగిస్తాయి. కాబట్టి, భారీ వర్షం పడుతున్న సమయంలో ఇవి విఫలమయ్యే అవకాశాలను పెంచుతుంది. అదే ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లు అయితే, ఇవి సింగిల్-పీస్ యూనిట్‌లుగా ఉండి, తక్కువ కదిలే భాగాలను కలిగి ఉంటాయి. ఈ డిజైన్ నాణ్యత కారణంగా ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లు ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంటాయి మరియు భారీ వర్షపాతం సమయంలో కూడా విఫలమయ్యే అవకాశాలను తగ్గిస్తాయి.

వర్షాకాలం వచ్చేసింది.. వైపర్ బ్లేడ్స్ చెక్ చేశారా..? ఫ్రేమ్‌లెస్, కన్వెన్షనల్ వైపర్ బ్లేడ్‌ల మధ్య తేడాలు!

అయితే, ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లు సాంప్రదాయ / ఫ్రేమ్డ్ వైపర్ బ్లేడ్‌లతో పోల్చినప్పుడు అధిక ధరను కలిగి ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణంగా, వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు వీటి తయారీలో అధునాతన పదార్థాలను ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైపర్లతో పోలిస్తే, ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్‌లు కార్లపై చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఫ్రేమ్‌లెస్ వైపర్ బ్లేడ్లను మార్చడం కూడా చాలా సులభంగా ఉంటుంది. మరి మీ కారులో ఏ రకమైన వైపర్ బ్లేడ్స్ ఉన్నాయి? వాటిని ఎప్పుడైనా చెక్ చేశారా? ఈ వర్షాకాలం కోసం మీ కారు వైపర్లు సిద్ధంగా ఉన్నాయా?

Most Read Articles

English summary
Conventional wiper blades vs frameless wiper blades details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X