దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

దాదాపు 200 సంవత్సరాలు బ్రిటీషు వారి పాలనలో మగ్గి, ఎంతోమంది అమరవీరులు ప్రాణ త్యాగం వల్ల మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరికి తెలిసిందే. దీనికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన శుభదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఖ్యాతిని తెలిపే మువ్వెన్నెల జెండాను సగర్వంగా ఎగుర వేస్తారు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

మువ్వెన్నెల జెండా అంటే కేవలం గుడ్డ ముక్క కాదు, అది మన జాతి గౌరవం.. అలాంటి మువ్వెన్నెల జెండాను ప్రతి భారతీయుడు తప్పకుండా గౌరవించి తీరాల్సిందే. ఇది రాజ్యాంగం చెప్పిన మాట, అదే శాసనం కూడా. అయినా అలాంటి జాతీయ జెండాను ఎవరైనా అవమానిస్తే వారిని కఠినంగా శిక్షించవచ్చు.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

ఇటీవల దేశ రాజధాని నగరం ఢిల్లోలో జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

నివేదికల ప్రకారం, ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతానికి చెందిన 52 సంవత్సరాల ఓ వ్య‌క్తి జాతీయ జెండాతో త‌న స్కూటీని తుడుస్తూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతడు మడతపెట్టిన జాతీయ జెండాతో తన వైట్ కలర్ హోండా స్కూటీని తుడుచుకోవడం కనిపిస్తుంది.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

ఆ సంఘటన గమనించిన చుట్టుపక్కల జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చివరికి ఢిల్లీ పోలీసుల దృష్టికి చేరింది. పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ వ్యక్తిపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

ఈవీడియో చూసిన చాలామంది ప్రజలు ఆ వ్యక్తిమీద మంది పడుతున్నారు. వారిలో కొందరు ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అంటున్నారు, మరికొందరు ఆ దేశ ద్రోహిని ఉరి తీసినా తప్పులేదు అంటున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

అయితే ఆ వ్యక్తి జాతీయ జెండాతో శుభ్రం చేసిన స్కూటీ హోండా యాక్తివా అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో ఈ హోండా యాక్టివా కూడా ఒకటి. ఇది వాహన వినియోగదారులు చాలా అనుకూలమైన డిజైన్ మరియు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్‌ లో కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక సైకిల్ షాపు యజమాని దుకాణం ముందు ఉంచిన పాత సైకిళ్లు, ఇతర వస్తువులపై పడిన దుమ్ము, దూళిని దులిపేందుకు ఏకంగా మన జాతీయ జెండానే పాత గుడ్డలాగా ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది దేశభక్తులు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన పెట్టిన సైకిళ్లపై ఉన్న అభిమానం దేశంపై లేకపోవడం విచారకరమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

జాతీయ జెండాపైన మనదేశంలో చాలామందికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ కారణంగానే తమ వాహనాలపైన కూడా ఎగురవేస్తారు. అయితే తమ వాహనాలపై భారతీయ జెండాను ప్రదర్శించేటప్పుడు అనేక నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

నిజానికి తమ కార్లపైన మన జాతీయ పతాకాన్ని శాశ్వతంగా ప్రదర్శించే హక్కు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు విదేశాలలోని భారతీయ మిషన్ల అధిపతులు, ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రులు, లోక్ సభ స్పీకర్ మరియు భారత ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే పరిమితం చేయబడింది.

అయితే సాధారణ ప్రజలు కూడా జాతీయ జెండాను కొన్ని నియమాలతో ప్రదర్శించుకోవచ్చు. సెక్షన్ 3.12 కింద, ప్రైవేట్ వాహన యజమానులు జాతీయ జెండాను కారుపై ఒంటరిగా ప్రదర్శించినప్పుడు, దానిని ఒక స్టాఫ్ నుండి ఎగురవేయాలి. అంతే కాకుండా కారు యొక్క బానెట్ యొక్క మధ్య ముందు భాగంలో లేదా కారు యొక్క ముందు కుడి వైపుకు గట్టిగా అతికించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జెండాకు అవమానం కలిగించకూడదు.

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

భారతదేశంలో మన దేశపు జెండాను అవమానిస్తే వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. జెండాను అవమానించిన వారిపైన ఎన్ని కేసులైన పెట్టవచ్చు, ఎంత కఠినమైన శిక్షలైన వేయవచ్చు. ఆ నేరానికి ఇదే శిక్ష అని ఎక్కడా లేదు. కావున భారతీయులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా మన జాతీయ జెండాను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి, కాపాడుకోవాలి.

Most Read Articles

English summary
Delhi man jailed for wiping vehicle on national flag scooter siege video goes viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X