Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?
చాలామంది వాహనదారులు వాహనాలను కొంటూ ఉంటారు. కొంతమంది ఫ్యాషన్ కోసం కొంటె కొంతమంది పాపులారిటీ కోసం కొంటారు. పాపులారిటీ కోసం కొనే వారు ఖరీదైన లగ్జరీ కార్లను కొంటూ ఉంటారు. ఖరీదైన కార్లు కొన్న తరువాత వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ కొంత ప్రత్యేకంగా ఉండాలనుకోవడం సహజం.

ఫ్యాన్సీ నెంబర్ కావాలనే కోరిక వల్ల ప్రజలు ఫాన్సీ నంబర్ కొనడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఫ్యాన్సీ నంబర్‌ను కొనుగోలు చేయడం వల్ల ఆ కారుకి కొంత ప్రత్యేకంగా కనిపిస్తుందని చాలామంది భావిస్తారు.

ఢిల్లీ వంటి మహానగరాలలో కార్ కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో ఫ్యాన్సీ నంబర్ క్రేజ్ కలిగి ఉన్నారు. ఈ కారణంగా ఢిల్లీ రవాణా శాఖ వేలం ప్రక్రియ ద్వారా ఫాన్సీ నంబర్లను విక్రయిస్తుంది.
MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

ఢిల్లీ రవాణా శాఖ 2014 నుండి ఫ్యాన్సీ నంబర్ అమ్మకం కోసం ఆన్‌లైన్ ఇ-వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌గా తమ సొంత నంబర్‌ను పొందాలనుకునే వారు వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు.

ఈ వేలంలో పాల్గొనేవారు ఫాన్సీ నంబర్ పొందడానికి మిలియన్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సెప్టెంబరులో జరిగిన వేలం ప్రక్రియలో 0009 అనే నెంబర్ ని రూ. 10.10 లక్షలకు అమ్మినట్లు తెలిసింది.
MOST READ:మాడిఫైడ్ బెంజ్ 600 పుల్మాన్ లిమోసిన్ : ఈ కార్ ముందు ఏ కారైనా దిగదుడుపే

జూలైలో 0009 నెంబర్ 7.10 లక్షలకు వేలంలో అమ్ముడయ్యాయి. మునుపటికంటే ఇప్పుడు వేలంలో ఇది మరింత ఎక్కువ ధర పలికింది. అంతే కాకుండా 0003 మరియు 0007 సంఖ్యలను కూడా వేలం వేశారు. ఈ రెండు నంబర్లు ఒక్కొక్కటి రూ. 3.10 లక్షలకు అమ్ముడయ్యాయి. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ సమయంలో ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయాయి మరియు ఆటోమొబైల్ పరిశ్రమ నష్టపోయింది

లాక్-డౌన్ సడలింపు తర్వాత వాహనాల అమ్మకాలు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఢిల్లీ రవాణా శాఖ ఫాన్సీ నంబర్ల అమ్మకం కోసం వేలం ప్రక్రియ విజయవంతమైంది. మార్చిలో బిడ్డింగ్ ప్రక్రియ నిలిపివేయబడింది. ఏప్రిల్‌లో వేలం తిరిగి ప్రారంభమైంది. అప్పటి నుండి ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన వేలం ప్రక్రియలో 9000 నంబర్ రూ .1.50 లక్షలకు అమ్ముడయ్యాయి.
MOST READ:మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

మేలో 5 ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయడం ద్వారా రూ. 9.30 లక్షలు సేకరించారు. జూన్‌లో ఈ మొత్తం రూ. 1.70 లక్షలకు, జూలైలో రూ. 33.80 లక్షలకు పెరిగింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఢిల్లీ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ వేలం నుంచి రూ. 99 లక్షల ఆదాయాన్ని వసూలు చేసింది. దీనిని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.