Just In
- 17 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' అపురూపైన కార్లు.. బొలేరో ఇన్వాడెర్ నుంచి స్కార్పియో-ఎన్ వరకు
భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పారిశ్రామిక రంగంలో మాత్రమే కాకుండా.. కార్ల మీద వ్యామోహం కలిగిన వ్యక్తులలో కూడా ఒకరు. ఈ కారణంగానే ఈయన వద్ద అనేక కార్లు ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
మహీంద్రా బొలేరో ఇన్వాడెర్:
ఆనంద్ మహీంద్రా వద్ద ఉన్న కార్ల జాబితాలో మొదటి కారు ఈ 'మహీంద్రా బొలేరో ఇన్వాడెర్'. ఇది ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన బొలేరో ఆధారంగా రూపుదిద్దుకున్న ఎస్‌యూవీ. ఇది షార్ట్-వీల్ బేస్, 3 డోర్లు కలిగిం కారు. ఈ కారు లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ కొనుగోలుదారులను ఉద్దేశించబడింది కనుక, ఇది సాఫ్ట్ రూఫ్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది సాధారణ బొలెరో కంటే చాలా స్పోర్టియర్ గా ఉంటుంది.

మహీంద్రా టియువి300:
ఆనంద్ మహీంద్రా వద్ద మహీంద్రా టియువి300 కూడా ఉంది. నిజానికి ఆనంద్ మహీంద్రా తన వ్యక్తిగత వినియోగానికి 2015 లో తన గ్యారేజీకి కస్టమైజ్ చేయబడ్డ టియువి300 ను సొంతం చేసుకొన్నాడు. ఈ వెర్షన్ ఆర్మీ యాక్సెసరీ ప్యాక్, రూఫ్ మౌంటెడ్ యాక్సిలరీ ల్యాంప్ వంటివి పొందుతుంది. ఇది గ్రీన్ కలర్ పొందటం వల్ల చూడటానికి ఒక యుద్ధ వాహనం మాదిరిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ టియువి300 నిలిపివేయబడింది.
మహీంద్రా టియువి300 ప్లస్:
ఆనంద్ మహీంద్రా వద్ద ఉన్న మరో కారు ఈ మహీంద్రా టియువి300 ప్లస్. దీనికి ఆనంద్ మహీంద్రా 'గ్రే ఘోస్ట్' అని పేరు పెట్టాడు. ఈ కారుని సొంతం చేసుకోవడానికి చాలా రోజులు వేచి ఉన్నట్లు కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇది ఒక ప్రత్యేకమైన 'స్టీల్ గ్రే' కలర్ పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఇది ఆనంద్ మహీంద్రాకు ఇష్టమైన కార్లలో ఒకటి కూడా.
మహీంద్రా స్కార్పియో:
ఆనంద్ మహీంద్రా వాహన ప్రపంచంలో మొదటి తరం స్కార్పియో కూడా ఉంది. ఇది 4×4 వెర్షన్. కావున ఇది చాలా దృడంగా ఉంటుంది. ప్రస్తుతం భారతీయ రోడ్ల మీద ఈ SUV కనిపించడం చాలా అరుదు. అయినప్పటికీ దీనికి ఇప్పటికీ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మహీంద్రా స్కార్పియో ఇప్పుడు దేశీయ మార్కెట్లోకి స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో ఎన్ రూపాల్లో విడుదలైంది మరియు విక్రయించబడుతోంది.
మహీంద్రా ఆల్టురాస్ G4:
మహీంద్రా కంపెనీ యొక్క ఒకప్పటి అత్యంత ఖరీదైన కారు ఈ మహీంద్రా ఆల్టురాస్ G4. ఇది కూడా ఆనంద్ మహీంద్రా వద్ద ఉంది. దీనిని ఆనంద్ మహీంద్రా విడుదలైన మొదటి రోజుల్లోనే సొంతం చేసుకున్నారు. ఈ కారు కొనుగోలు చేసినప్పుడు దానికోసం ఒక మంచి పేరు సూచించాలని సోషల్ మీడియాలో తన అనుచరులను కోరారు. చివరికి ఈ అల్టురాస్ జి 4 కోసం 'బాజ్' అనే పేరును ఖరారు చేశాడు.
మహీంద్రా స్కార్పియో-ఎన్:
ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా ఆనంద్ మహీంద్రా కొనుగోలు చేశారు. ఈ కారుకి కూడా ఒక మంచి పేరు పెట్టాలని, ఆలాంటి పేరు కావాలని తన అనుచరులను కోరాడు. దీనికి చాలామంది రిప్లై ఇస్తూ చాలా పేర్లను తెలిపారు, కానీ అన్ని పేర్లను పరిశీలించి చివరికి 'భీమ్ మరియు బిచ్చు' రెండు పేర్లను సెలక్ట్ చేశారు. చివరికి చాలామంది సలహా మేరకు ఆ కారుకి భీమ్ అని పేరు పెట్టుకున్నాడు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా గురించి చాలామందికి తెలిసినప్పటికీ, ఆయన వద్ద కార్లను గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ కథనం ద్వారా ఆనంద్ మహీంద్రా కార్లను గురించి తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మరియు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.