శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

సాధారణంగా ఈ రోజుల్లో మనం బయటకి వెళ్లాలంటే తప్పకుండా వాహనాలనే వినియోగిస్తాం. అది కేవలం ఒక కిలోమీటర్ అయినా పది కిలోమీటర్లయినా, ఈ రోజు కాలినడకలో వెళ్లేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. అలాంటి ఈ రోజుల్లో తన పేషంట్ కోసం ఒక డాక్టర్ మూడు కిలోమీటర్లు పరుగెడుతూ అందరి చేత ప్రశంసించబడుతున్నాడు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఆ డాక్టర్ ఎందుకు అంతగా పరుగెత్తాల్సి వచ్చింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

నివేదికల ప్రకారం ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. నిజానికి బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య, కాబట్టి వాహనదారులు గమ్యానికి చేరుకోవాలంటే నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లోనే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా రోడ్లన్నీ నదులను తలపించాయి.

శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

నీటితో నిండిన రోడ్లపైన ప్రయాణించానికి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో మణిపాల్ హాస్పిటల్ లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ 'గోవింద్ నందకుమార్' కూడా ఈ ట్రాఫిక్ చిక్కులో చిక్కుకున్నాడు. అతను ఆగస్టు 30న అత్యవసర తన పేషంట్ కి గాళ్ బ్లాడర్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయితే సమయానికి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు. ఆపరేషన్ చేయడానికి లేట్ అవుతుందని గ్రహించిన ఆ డాక్టర్ గూగుల్ మ్యాప్ చూస్తే హాస్పిటల్ చేరుకోవటానికి దాదాపు గంట సమయం పడుతుందని చూపించింది.

శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

ఇక డాక్టర్ ఆ పరిస్థితుల్లో ఎమ్ చేయాలో అర్థం కాలేదు, ఎలాగయినా పేషంట్ కి ఆపరేషన్ చేయాలనీ నిర్చయించుకుని కారు దిగి పరుగెత్తడం ప్రారభించాడు, అయితే మొత్తానికీ 3 కిలోమీటర్లు పరుగెత్తి సమయానికి హాస్పిటల్ లో ఉన్న పేషంట్ కి సర్జరీ చేసాడు. సర్జరీ తరువాత పేషంట్ కూడా కోలుకుంది.

దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. ఇది చూసిన వారందరూ కూఆ డాక్టర్ చేసిన ఆ సాహసానికి ఎంతగానో ప్రశంసితున్నారు. నిజంగా ఆ డాక్టర్ చేసిన పని చాలా ప్రశంసనీయం. ఇది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.

శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

దీనిపైన డాక్టర్ గోవింద్ నందకుమార్ మాట్లాడుతూ.. సెంట్రల్ బెంగళూరు నుండి సర్జాపూర్ లోని మణిపాల్ హాస్పిటల్ కి ఎప్పుడూ కారులో ప్రయాణిస్తాను. అయితే ఆ రోజు ఒక పేషంట్ కి ఆపరేషన్ చేయాల్సి ఉంది, ఆ సమయంలో నా టీమ్ మొత్తం సిద్ధంగా ఉంది. కాబట్టి తప్పకుండా సమయానికి హాస్పిటల్ కి చేరుకోవాల్సి వుంది, ఆ సమయంలో నాకు ఏమి చేయాలో తోచలేదు.

శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

నా కారుని డ్రైవ్ చేయడానికి డ్రైవర్ కూడా ఉన్నాడు, కాబట్టి కారును వదిలేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాను. అంతే కాకుండా నేను రోజు జిమ్ చేస్తాను కాబట్టి అది నాకు కష్టం అనిపించలేదు. మొత్తానికి సమయానికి చేరుకొని పేషంట్ ని కాపాడగలిగాను, అంటూ చెప్పుకొచ్చాడు.

శభాష్.. డాక్టర్ సాబ్: పేషంట్ కోసం ట్రాఫిక్‌లో 3 కిమీ పరుగెత్తిన డాక్టర్, ఎక్కడో తెలుసా?

ఇటీవల గత కొన్ని వారాలుగా కురిసిన భారీ వర్షం వల్ల బెంగళూరు నగరం అస్తవ్యస్థమైపోయించి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి కార్లు కూడా అందులో చిక్కుకున్నాయి. దీనికి సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. ఇవన్నీ వర్షంలో బెంగళూరు నగరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయి.

Most Read Articles

English summary
Doctor stuck in traffic leaves car runs 3 km to the hospital to perform a surgery
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X