హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్లియర్ చేసిన ఫెమస్ ప్రొడ్యూసర్.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ట్రాఫిక్ కష్టాలను చాలామంది తమ నిత్య జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఒక ప్రొడ్యూసర్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కొంత సేపు ట్రాఫిక్ పోలీసుగా మారి పోయాడు.

నివేదికల ప్రకారం, హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్ లో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ వద్ద ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్ 'సురేష్ బాబు' తన కారు దిగి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో సురేష్ బాబు నడి రోడ్డు మీద నిలబడి వాహనాలను ముందుకు పంపుతున్న సన్నివేశాలు చూడవచ్చు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్లియర్ చేసిన ఫెమస్ ప్రొడ్యూసర్

నిజానికి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని అందరికి తెలుసు, అలాంటి సందర్భంలో చాలా మంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు. కానీ ఎవరూ ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి సాహసించరు. ఎందుకంటే అది ట్రాఫిక్ పోలీసుల బాధ్యత అని ఊరుకుంటారు. అంతే కాకుండా ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు గట్టిగా హారన్ కొడుతూ ఉంటారు. కానీ సురేష్ బాబు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు.

హైదరాబాద్ నగరంలో ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వాహన వినియోగదారులు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా నడుచుకోవాలి. ప్రొడ్యూసర్ సురేష్ బాబు ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి బాధ్యత గల పౌరుడిగా గుర్తింపు పొందాడు. దీనికి సంబంధించిన ఫొటోలో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలను మరియు వీడియోలను చూసిన చాలా మంచి సురేష్ బాబును ప్రశంసిస్తున్నారు. నిర్మాతగా గొప్ప పేరు ప్రఖ్యాతులున్న సురేష్ బాబు అవసరం వచినప్పుడు బాధ్యతగల పౌరుడిగా నడుచుకున్నారు. ఆయన చేసిన ఈ పని ఎంతో మందిని ఆకర్శించడమే కాదు, తప్పకుండా ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం కూడా తప్పకుండా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇదిలా ఉండగా గతంలో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి దశాబ్దాలుగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సురేష్ బాబు ప్రస్తుతం సినిమాల మీద ద్రుష్టి కొంత తగ్గించారనే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సురేష్ బాబు ఏ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించలేదు. అయితే ఇతర సంస్థలతో భాగస్వామిగా ఉంటూ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రొడ్యూసర్ సురేష్ బాబు గొప్ప పని చేసి సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతున్నారు.

సాధారణంగా నగరాల్లో కొన్ని కూడళ్ల వద్ద మాత్రమే ట్రాఫిక్ పోలీసులు ఉండి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని చిన్న కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నెల్స్ మాత్రమే ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కూడలి వద్ద ఏ ఒక్క వాహనదారుడు తప్పుగా ప్రవర్తించినా ట్రాఫిక్ స్తంభించి పోతుంది. ఇది ఇతర వాహనదారులను చాలా కష్టంగా ఉంటుంది.

గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్టంపించినప్పుడు కొంత మంది సాధారణ వ్యక్తులు ట్రాఫిక్ క్లియర్ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇది మనకెందుకు అనుకోవడం కంటే బాధ్యత కలిగిన పౌరులుగా అందరూ వ్యవహరించవలసి ఉంటుంది. దీనిని తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Famous producer suresh babu clears traffic in hyderabad video
Story first published: Wednesday, January 4, 2023, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X