కార్ యాక్సిడెంట్‌లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నడుటు 'పౌల్ వాకర్' మృతి

Posted By:

షాకింగ్ న్యూస్.. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సినిమాతో అటు హాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ఇండియన్‌ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్‌ వాకర్‌ (Paul Walker) ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

పౌల్ వాకర్ తన స్నేహితుడి పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారులో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో తన స్నేహితుడు కారు నడుపుతుండగా, పౌల్ వాకర్ కో-ప్యాసింజర్ సీట్లో కూర్చొన్ని ఉన్నాడు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం శరవేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై పక్కగా స్థంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‍‌లో పరిశీలించండి.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యి, మంటల్లో కాలి బూడిదైంది. ఈ భీకర కార్ యాక్సిడెంట్‌లో పౌల్ వాకర్‌తో పాటుగా అతని స్నేహితుడు కూడా మృతి చెందాడు. ఈ విషయాన్ని పౌల్ వాకర్ అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ మరియు ట్విట్టర్ పేజ్‌లలో ధృవీకరించారు.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

పౌల్ వాకర్ మృతితో యావత్ హాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఆయనకు అనేక మంది సానుభూతి తెలిపారు.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న కారులో వెళ్తుండగానే, పౌల్‌కు ప్రమాదం జరిగింది. అంతేకాదు, ఇదే పౌల్ చివరి ఫోటో కూడా. పౌల్ శాంటా క్లారిటాకు బయలుదేరే ముందుగా తీసిన ఫొటో ఇది.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

ఇప్పటి వరకు మొత్తం 6 ఎడిషన్‌ల ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలు వచ్చాయి. ఇందులో టోక్యో డ్రిఫ్ట్ మినహా అన్ని చిత్రాల్లోను పౌల్ వాకర్ నటించాడు. ప్రస్తుతం 7వ ఎడిషన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా తెరకెక్కుతోంది.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌తో పాటుగా పౌల్ వాకర్ అనేక హాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. పౌల్ చివరి చిత్రం 'పాన్ షో క్రానికల్స్' అనే కామెడి డ్రామా. ఈ చిత్రంలో పౌల్‌తో పాటుగా మ్యాట్ డిల్లన్, బెర్నాండ్ ఫ్రాసెర్‌లు నటించారు.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

ఈ ఫోటోను పౌల్ నిన్న తన పేస్‌బుక్ పేజ్‌లో - The boys are back. Will you be ready? - (మేము సిద్ధం.. మీరు సిద్ధమేనా) అనే ట్యాగ్‌తో షేర్ చేశాడు.

కారు ప్రమాదంలో మరణించిన పౌల్ వాకర్

పౌల్ వాకర్ ఆత్మకు శాంతి కలగాలని డ్రైవ్‌స్పార్క్ కోరుకుంటూ, పౌల్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తుంది.

English summary
Hollywood actor Paul Walker, who acted in the Fast and Furious series of action films, has been killed in a car crash in California.
Please Wait while comments are loading...

Latest Photos