సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఆదివారం 50 ఏళ్ల వ్యక్తిపై ఫెరారీ కారు దూసుకెళ్లింది. ఫెరారీ సూపర్ కార్ డ్రైవర్ నవీన్ కుమార్ గా గుర్తించబడి, అతనిపై మాధపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

ND టివి నుండి వచ్చిన కథనాల ప్రకారం, మరణించిన 50 ఏళ్ల వ్యక్తిని యేసు బాబుగా గుర్తించారు. అతను మాధపూర్ అదే ప్రాంతంలోని సమీప నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణ స్థలంలో కాపలాదారుగా ఉన్నారు. యేసు బాబు అక్కడికక్కడే మరణించాడు మరియు అతని మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

ఈ సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మాధపూర్ పోలీసులు, ఫెరారీ సూపర్ కార్‌ను స్వాధీనం చేసుకున్నారు, అదే సమయంలో దాని డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఫెరారీ డ్రైవర్ మాధపూర్ నుండి జూబ్లీ హిల్స్‌కు వెళుతున్నట్లు చెబుతున్నారు.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

ఇక్కడ మనం ఫోటోలను గమనించినట్లయితే ఫెరారీ సూపర్ కార్ బ్రాండ్ యొక్క జిటిసి 4 లూసో సమర్పణగా ఉంది. ఫోటోలలో మనం చూసినట్లయితే ఫెరారీ యొక్క కుడి వైపున భారీ నష్టం జరిగింది. కారు యొక్క ఎడమ వైపు టెయిల్ లైట్లు కూడా విరిగిపోయినట్లు చూడవచ్చు. కారు పరిస్థితిని చూస్తే, ఫెరారీ సూపర్ కార్ యొక్క డ్రైవర్ ఎక్కువ వేగంతో వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువ వేగంతో రావడం వల్ల కారుని కంట్రోల్ చేయలేకపోయి ఉండే అవకాశం ఉంది.

సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

ఏదేమైనా ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కువ సమాచారం అందుబాటులో కాలేదు. ఈ సంఘటన అక్టోబర్ 11 ఆదివారం సాయంత్రం జరిగినట్లు చెబుతున్నారు.

MOST READ:భార్యని 90 కిమీ రిక్షా మీద తీసుకెళ్లిన భర్త.. ఎందుకో తెలుసా ?

ఈ ప్రమాదంలో పాల్గొన్న ఫెరారీ సూపర్ కార్ బ్రాండ్ యొక్క నాలుగు సీట్ల జిటి సమర్పణ, దీనిని జిటిసి 4 లూసో అని పిలుస్తారు. ఇటాలియన్ సూపర్ కార్ భారత మార్కెట్లో కొన్ని సంవత్సరాలుగా అమ్మకానికి ఉంది. దీని ప్రారంభ ధర సుమారు 5.2 కోట్ల రూపాయలు [ఎక్స్-షోరూమ్, ఇండియా].

సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

ఈ ఇటాలియన్ సూపర్ కార్ 6.2-లీటర్ వి 12 పెట్రోల్ ఇంజిన్‌తో 8000 ఆర్‌పిఎమ్ వద్ద 680 బిహెచ్‌పి మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 697 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. టీవీఎస్ XL100 కంఫర్ట్ బిఎస్ 6 రివ్యూ.. వచ్చేసింది

Most Read Articles

English summary
Ferrari sports car with over speed kills security guard. Read in Telugu.
Story first published: Wednesday, October 14, 2020, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X