ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

భూమిలో శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) అంతరించుపోతున్న నేపథ్యంలో, ఇప్పుడు ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలు మరియు వనరులతో నడిచే వాహనాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి. ఈ దిశలో భాగంగా, మనకి సులువుగా లభించే మరియు వినియోగానికి తక్షణమే అందుబాటులో ఉన్న ఏకైక వనరు విద్యుత్ (ఎలక్ట్రిసిటీ).

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా (మనదేశంలో కూడా) అనేక ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొచ్చాయి మరియు కొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఎలక్ట్రిక్ వాహనాలు మంచి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కార్లలో ప్రధానమైనది మరియు ప్రజలను ఆలోజింపజేసేది వాటి రేంజ్ (మన భాషలో చెప్పాలంటే మైలేజ్).

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

సాధారణంగా, ఎలక్ట్రిక్ టూవీలర్లు పూర్తి చార్జ్ పై సగటున 60 నుండి 150 కిలోమీటర్లు, ఎలక్ట్రిక్ కార్లు 300 నుండి 450 కిలోమీటర్లు రేంజ్ ను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, ఈ కథనంలో మనం చెప్పుకోబోయే ఎలక్ట్రిక్ ట్రక్కు మాత్రం పూర్తి చార్జ్ పై గరిష్టంగా 1099 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అంతేకాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం దక్కించుకుంది.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

వివరాల్లోకి వెళితే, ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్ మరియు కాంటినెంటల్ టైర్‌లతో కలిసి యూరోప్‌లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫ్యూటరికం (Futuricum) అభివృద్ధి చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ట్రక్ రేంజ్ పరంగా, ఇప్పటి వరకూ ఉన్న మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

పూర్తి ఛార్జ్ పై 1099 కిలోమీటర్ల రేంజ్

స్విస్ ఆటోమొబైల్ బ్రాండ్ వోల్వో (Volvo) అందిస్తున్న ఓ ఎలక్ట్రిక్ ట్రక్కును Futuricum సంస్థ మోడిఫై చేసి, దాని బ్యాటరీ సామర్థ్యం మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్రీని మార్చడం ద్వారా రేంజ్ ను పెంచడానికి అప్‌గ్రేడ్ చేయబడింది. ఇటీవల దీనిని కాంటినెంటల్ టైర్స్ (Continental Tyres) 2.8 కిమీ మేర వృత్తాకారంలో ఉన్న టెస్ట్ ట్రాక్ పై డ్రైవింగ్ చేయడం ద్వారా పరీక్షించింది.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఈ పరీక్షలో పూర్తిగా చార్జ్ చేయబడిన ఎలక్ట్రిక్ ట్రక్కును 392 ల్యాప్‌ లలో 23 గంటల పాటు నిర్విరామంగా నడిపారు. ఈ సమయంలో ట్రక్ యొక్క సగటు వేగం గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్లుగా ఉంది. అంటే, హైవేపై ప్రయాణించే ఇతర సాధాణర ట్రక్కుల యొక్క సగటు వేగానికి సమానం.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఈ ట్రక్ ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది, ఇది పూర్తిగా సిద్ధంగా ఉండటానికి మరికొంత సమయం పడుతుంది. సరుకు రవాణా కోసం ఉపయోగించే డీజిల్ ట్రక్కులను ఈ ఎలక్ట్రిక్ ట్రక్ భర్తీ చేస్తుందని కంపెనీ చెబుతోంది. సుమారు 19 టన్నుల ఈ ఎలక్ట్రిక్ ట్రక్ డీజిల్ ట్రక్ చేసే అన్ని పనులకు ఉపయోగించబడుతుంది.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఎలక్ట్రిక్ ట్రక్కులో శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్

ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంది మరియు ఇది పూర్తి చార్జ్ పై సగటున 1000 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను అందిస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులో 680 kWh సామర్థ్యంతో కూడిన సెల్ఫ్ కూలింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇంతటి భారీ బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ ట్రక్కు ఖాలీగా దాని మొత్తం బరువు 19 టన్నులుగా ఉంటుంది. ఈ బ్యాటరీ సాయంతో ట్రక్కులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 680 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు.

ఈ ఎలక్ట్రిక్ ట్రక్ రోజుకు సగటున 300 కిమీ కంటే ఎక్కువ దూరం నడపవచ్చు.

సాధారణంగా డీజిల్ తో నడిచే ట్రక్కులను సగటున 200 నుండి 250 కిలోమీటర్ల దూరం పాటు ఆపకుండా నడపవచ్చు. ఆ తర్వాత, కొంత సమయం పాటు ఇంజన్ మరియు తదితర భాగాలను చల్లబరచేందుకు ట్రక్కును పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు విషయంలో అలా కాదు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు పూర్తి లోడ్‌తో సగటున 300 కిమీ కంటే ఎక్కువ దూరం నిరంతరాయంగా నడపచ్చు.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఇందుకు ప్రధాన కారణంగా, ఇందులోని సెల్ఫ్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్ మరియు అధునాతన ఎలక్ట్రిక్ మోటార్. అయితే, సాధారణ ట్రక్కుల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు విషయంలో కూడా తరచూ విరామం తీసుకోవటం అవసరం. ఇది ఇటు ట్రక్కును నడిపే డ్రైవరుకు మరియు అటు ట్రక్కు యొక్క విశ్రాంతికి మంచిది. ఇంతటి శక్తివంతమైన ఎలక్ట్రిక్ ట్రక్కు ఇంకా యూరప్‌లో వాణిజ్య పరంగా తయారు చేయబడలేదని కంపెనీ పేర్కొంది.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

టాటా స్టీల్ ప్లాంట్ వద్ద ఎలక్ట్రిక్ ట్రక్కులు..

ఇదిలా ఉంటే, మనదేశంలో కూడా ఎలక్ట్రిక్ ట్రక్కులను వినియోగించేందు ప్రముఖ స్టీల్ బ్రాండ్ 'టాటా స్టీల్' (Tata Steel) నడుం బిగించింది. టాటా స్టీల్ ఇటీవల తమ జంషెడ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు రవాణా కోసం ఎలక్ట్రిక్ ట్రక్కులను వినియోగించేందుకు గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఇందుకోసం టాటా మోటార్స్ ఓ భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీతో చేతులు కలిపింది. ఇందులో భాగంగా 27 ఎలక్ట్రిక్ ట్రక్కులను ఉక్కు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ చాలా పెద్దది, అందుకే దీనిని 'రాక్షస ట్రక్' (మోన్స్టర్ ట్రక్) అని కూడా పిలుస్తారు. టాటా స్టీల్ ప్లాంట్‌లో నియమించబడిన ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు అత్యంత కఠినమైన పరిస్థితులలో కూడా పనిచేసేలా రూపొందించబడ్డాయి.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఒక్కొక్క ఎలక్ట్రిక్ ట్రక్కు సుమారు 35 టన్నుల స్టీల్ (కనీస సామర్థ్యం) మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మొత్తం 27 ట్రక్కులో 15 ట్రక్కులను జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో మరియు 12 ట్రక్కులను సాహిబాబాద్ ప్లాంట్‌లో ఉపయోగించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులలో 2.2 టన్నుల బరువు కలిగిన 230.4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించారు.

ఫుల్ ఛార్జ్‌పై 1099 కిలోమీటర్ల రేంజ్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌‌లో చోటు..

ఈ బ్యాటరీ ప్యాక్ అధునాతన కూలింగ్ సిస్టమ్‌తో పాటుగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది మరియు ఇది 60 డిగ్రీల సెల్సియస్ వేడి కలిగిన పరిసర ఉష్ణోగ్రతలలో కూడా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 160 kWh ఛార్జర్ సెటప్‌తో వస్తుంది, దీని సాయంతో కేవలం 90 నిమిషాల్లోనే దీనిని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Futuricum electric truck sets guinness world record for covering 1099 kms on single charge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X