బాగా చూడండి ఇది మహీంద్రా వారి మోడిఫైడ్ ఎక్స్‌యువీ500

Written By:

డ్రైవ్‌స్పార్క్ కొత్తగా విడుదలయ్యే టూ వీలర్లు మరియు కార్లు గురించే మాత్రమే కాదు ఆసక్తిపరులు తమకు నచ్చిన విధంగా మార్చుకున్న బైకులు మరియు టూ వీలర్లకు చెందిన వివరాలను కూడా అందిస్తుంది. అందులో భాగంగానే సరికొత్తగా ఇన్నోవేషన్‌కు శ్రీకారం చుట్టడం వలన రూపొందిన మహీంద్రా ఎక్స్‌యు500 డ్రైవ్‌స్పార్క్ కంటపడింది.

మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఎక్స్‌యువి500 ఇప్పటికే విపరీతమైన ప్రజాదరణను పొందింది. మరి దీనిని మరింత అందంగా మోడిఫైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. తెలుగు పాఠకుల కోసం డ్రైవ్‌స్పార్క్ ప్రత్యేక కథనం: మరిన్ని వివరాలు క్రింద గల స్లైడర్లలో....

సరికొత్త రూపంలో మహీంద్రా ఎక్స్‌యువి500

బెంగళూరుకు చెందిన జుబిర్ అబ్ధుల్లా తన మహీంద్రా ఎక్స్‌యువి 500 వాహనాన్ని ఇలా తనకు నచ్చిన విధంగా మార్చుకున్నాడు.

సరికొత్త రూపంలో మహీంద్రా ఎక్స్‌యువి500

ఇతను దీనికి మహీంద్రా ఎక్స్‌యువీ500 ఎస్‌‌యువి అని కాకుండా ఇంటర్‌పిడ్ జుబిర్ అని ముద్దు పేరు పెట్టుకున్నాడు.

ప్రత్యేకమైన రంగుల్లో

ప్రత్యేకమైన రంగుల్లో

జుబిర్ అబ్దుల్లా దీనిని పూర్తిగా నలుపు రంగులో మార్చేసి తరువాత ఎరుపు రంగుతో హైలైట్ చేశాడు. ప్రత్యేకమైన రంగులో ఉన్న ఈ మహీంద్రా ఎక్స్‌యువీ500 ను గుర్తుపట్టడం కొంచెం కష్టమే అని చెప్పాలి.

గ్రాండ్

గ్రాండ్

ఇది ఎంతో మందిని ఆకర్షిస్తోంది. కారణం దీనిని మోడిఫై చేసిన తీరుతో పాటు, వీటి చక్రాలకు ప్రత్యేకంగా పూసిన ఎరుపు రంగు ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.

ఎక్ట్సీరియర్ మార్పులు

ఎక్ట్సీరియర్ మార్పులు

ముందు వైపున బెండ్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఎంతో అందంగా ఉంది మరియు దీనికి అచ్చంగా కుదిరింది అని చెప్పవచ్చు. రాత్రి సమయంలో ఇది జర్నీలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనబడటానికి నూతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రత్యేక ఫీచర్లు

ప్రత్యేక ఫీచర్లు

ఇతను కారులోని వచ్చిన ఫీచర్లకు అదనంగా ఫీచర్లను ఇందులో కల్పించాడు. అందులో బురద మట్టిలో ఇరుక్కుపోయిన వాటి బయటకు లాగడానికి హుక్ గల రించ్ మరియు సరికొత్త గ్రిప్ గల టైర్లు ఇందులో ఉన్నాయి. దీనికి ఇట్రిపిడ్ అనే పేరుతో బోర్డును ఏర్పాటు చేశాడు మరియు నెంబర్ ప్లేట్ మారిన ప్రదేశాన్ని ఇక్కడ చూడవచ్చు.

అదనపు ఫ్లాష్ లైట్లు

అదనపు ఫ్లాష్ లైట్లు

వాహనం యొక్క రూఫ్ పైన ప్లాష్ లైట్లను మరియు ముందు వైపున అదనపు హెడ్‌లైట్లను అందించారు. అయితే వాహనానికి వచ్చిన ప్రొజెక్టర్ హెడ్ లైట్లను అలాగే ఉంచారు. మరియు ముందు వైపున ఇంజన్‌కు అధికం మొత్తంలో గాలి చేరడానికి ప్రత్యేకమైన డిజైన్ చేశారు.

భద్రతపరమైన మార్పులు

భద్రతపరమైన మార్పులు

ప్రయాణంలో ఉన్నప్పుడు కొమ్మలు కిటకీల ద్వారా తగులుతూ ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకోసం మంచి బలమైన పైపులతో కావాల్సిన చోట్ల ఫ్రేమ్‌లుగా డిజైన్‌ చేసి భద్రపరుచుకున్నారు.

అదనపు అమరికలు

అదనపు అమరికలు

ఇంతగా డిజైన్ చేసుకున్నప్పుడు దూర ప్రాంకాలకు వెళ్లకుండా ఉంటారా ? అందుకే కాబోలు ఇందులో అదనపు ఇంధన ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. మరియు రూఫ్ పైన లగేజ్ వేయడానికి వెనుక వైపున ఇనుముతో తయారు చేసిన నిచ్చెన తగిలించారు. కొత్త డిజైన్‌తో చూడటానికి ఎంతో బాగుంది.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఎక్స్‌యువీ500 ని బాహ్య భాగాలను మాత్రమే కాకుండా ఇంటీరియర్‌ను కూడా మోడిఫై చేశారు. స్పోర్టివ్‌‌గా ఉండేవిధంగా పెడల్స్, బ్లాక్-బ్రౌన్ రంగుల్లో రూపొందించబడిన ఇంటీరియర్ వీరి చేసిన మార్పులు చూస్తే ఇంజన్‌కు కూడా మార్పులు చేశారా అనే అనుమానం వస్తుంది.

సరికొత్త రూపంలో మహీంద్రా ఎక్స్‌యువి500

మహీంద్రా ఎక్స్‌యువి500 వాహనాన్ని ఇలా మోడిఫై చేసిన తరువాత మీకు కూడా ఇలాంటి ఐడియా వచ్చిందా...? మీరు మీ వాహనాలను మోడఫై చేసినపుడు లేదా ఏవరైనా మోడిఫై చేసిన వాహనాలు మీ కంటపడితే మాతో పంచుకోండి. క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా షేరు చేసుకోండి.

సరికొత్త రూపంలో మహీంద్రా ఎక్స్‌యువి500
English summary
heavily modified mahindra xuv500 from bangalore

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark