ఇండియన్ రైల్వేలో అత్యంత వేగంతో ప్రయాణించే 10 హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

Written By:

170 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఇండియన్ రైల్వేలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. అయితే రైళ్లు ప్రయాణించే వేగంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. మన కంటే చిన్న దేశాల్లోని రైల్వే నెట్‌వర్క్‌లో గంటకు 200కిమీల వేగంతో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ఆర్థిక వృద్దిలో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నా మన దేశంలోని రైళ్ల వేగం మాత్రం 150కిమీలకు మించకపోవడం గమనార్హం.

ఇండియన్ రైల్వేలో అత్యధిక వేగంతో ప్రయాణించే టాప్-10 రైళ్ల గురించి ఓ లుక్కేసుకుందాం రండి...

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ - 12050 (న్యూ ఢిల్లీ-ఆగ్రా)

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ - 12050 (న్యూ ఢిల్లీ-ఆగ్రా)

ప్రముఖ పర్యాటక నగరాలైన న్యూ ఢిల్లీ మరియు ఆగ్రాల మధ్య గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళును నడుపుతున్నారు. ఈ సెమి-హై స్పీడ్ రైలు ఇరు గమ్యస్థానాల మధ్య ఉన్న దూరాన్ని 100 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 160కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్న రైలు ఇదే.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-భోపాల్)

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-భోపాల్)

న్యూ ఢిల్లీ మరియు భోపాల్ మధ్య నడిచే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రెండవ అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం గంటకు 155కిలోమీటర్లుగా ఉంది. మెట్రో నగరాలను కలుపుతూ కొన్ని పర్యాటక ప్రాంతాల మీదుగా ఇది ప్రయాణిస్తుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్ (ముంబాయ్-న్యూ ఢిల్లీ)

రాజధాని ఎక్స్‌ప్రెస్ (ముంబాయ్-న్యూ ఢిల్లీ)

దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ నుండి న్యూ ఢిల్లీ మధ్య సేవలందిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇండియన్ రైల్వే ఉన్న శతాబ్ది మరియు దురంతో ఎక్స్‌ప్రెస్‌లతో పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా అత్యంత వేగవంతమైనది. దీని స్పీడ్ గంటకు 140కిలోమీటర్లుగా ఉంది.

కాన్పూర్ రివర్స్ శతాబ్ధి (న్యూ ఢిల్లీ-కాన్పూర్)

కాన్పూర్ రివర్స్ శతాబ్ధి (న్యూ ఢిల్లీ-కాన్పూర్)

కాన్పూర్ మరియు ఢిల్లీ మధ్య రెండు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. మొదటి రైలు లక్నో స్వర్ణ శతాబ్ది కాగా, కాన్పూర్-న్యూ ఢిల్లీ రివర్స్ శతాబ్ధి రైలు రెండవది. కాన్పూర్‌కు ఉన్న మొదటి శతాబ్ధి రైలు టైమింగ్స్‌తో పోల్చుకుంటే రెండవ శతాబ్ధి రైలు టైమింగ్స్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే దీనికి కాన్పూర్ రివర్స్ శతాబ్ధి అనే పేరు పెట్టారు. దీని వేగం గంటకు 140కిలోమీటర్లుగా ఉంది.

సీల్దా దురంతో ఎక్స్‌ప్రెస్(సీల్దా-న్యూ ఢిల్లీ)

సీల్దా దురంతో ఎక్స్‌ప్రెస్(సీల్దా-న్యూ ఢిల్లీ)

ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలను దేశ రాజధాని ఢిల్లీ కలపడానికి దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైళ్లు ఎక్కువ దూరం పాటు, తక్కువ స్టాపులతో ప్రయాణిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా నుండి ఢిల్లీకి ప్రయాణించే సీల్దా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్ట వేగం గంటకు 135కిమీలుగా ఉంది. మరియు దీని సగటు వేగం 85కిమీలుగా ఉంది.

హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-హౌరా)

హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-హౌరా)

హౌరా మరియు న్యూ ఢిల్లీ మధ్య ఇండియన్ రైల్వే ప్రారంభించిన మొదటి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ హౌరా రాజధాని ఎక్స్‌ప్పెస్. పూర్తి స్థాయిలో ఎయిక్ కండీషన్ కోచ్‌లు మరియు ఐదు ఏసి-2 టైర్ కోచ్‌లు ఉన్న తొలి ఎక్స్‌ప్రెస్ హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు. దీని గరిష్ట వేగం గంటకు 135కిమీలుగా ఉంది.

హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-హౌరా)

హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్ (న్యూ ఢిల్లీ-హౌరా)

హౌరా-న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలును కోల్‌కత్తా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు అని కూడా పిలుస్తారు. కలకత్తా నుండి దేశ రాజధాని నగరానికి ఉన్న అతి ముఖ్యమైన రైలు ఇది. సీల్దా రాజధాని మరియు హౌరా రాజధాని రైళ్ల కన్నా ఇది వేగవంతమైనది. దీని గరిష్ట వేగం గంటకు 120కిమీలు మరియు సగటు వేగం 85కిలోమీటర్లుగా ఉంది.

అలహాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు(న్యూ ఢిల్లీ-అలహాబాద్)

అలహాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు(న్యూ ఢిల్లీ-అలహాబాద్)

లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి న్యూ ఢిల్లీ మధ్య ఈ అలహాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ సేవలందిస్తోంది. అదే విధంగా మహారాష్ట్రలోని ముంబాయ్ మరియు అలహాబాద్ మద్య ఉన్న వేగవంతమైన రైలు కూడా ఇదే. దీని గరిష్ట వేగం గంటకు 120కిలోమీటర్లు మరియు సగటు వేగం 85కిమీలుగా ఉంది.

సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ (సీల్దా-న్యూ ఢిల్లీ)

సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ (సీల్దా-న్యూ ఢిల్లీ)

కలకత్తాలోని సీల్దా నుండి న్యూ ఢిల్లీకి దురంతో ఎక్స్‌ప్రెస్‌ తరువాత ఉన్న రెండవ వేగవంతమైన రైలు సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్. 1458 కిలోమీటర్లు పాటు సీల్దా నుండి న్యూ ఢిల్లీకి ప్రయాణించే ఈ సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు సగటు వేగం గంటకు 83కిలోమీటర్లుగా ఉంది.

గరీబ్ రథ్ (నిజాముద్దీన్-బాంద్రా)

గరీబ్ రథ్ (నిజాముద్దీన్-బాంద్రా)

ముంబాయ్ బాంద్రా టి-హజరత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌‌ప్రెస్ రైలు ఇండియన్ రైల్వేలో ఉన్న గరీబ్ రథ్ కెటగిరీలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది. ముంబాయ్-న్యూ ఢిల్లీ మధ్య ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు తరువాత ఉన్న రెండవ అత్యంత వేగవంతమైన సర్వీస్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్. దీని వేగం గంటకు 81.15కిమీలుగా ఉంది.

Read more on: #రైలు #rail
English summary
Read In Telugu To Know About Top 10 Highest-Speed Express Trains of Indian Railways
Story first published: Saturday, June 10, 2017, 12:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark