కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశంలో కూడా ఒకటి. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది మనం నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ చాలామంది ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

Recommended Video

భారతీయ మార్కెట్లో 2022 Hyundai Tucson లాంచ్ | ఎప్పుడంటే?

ఇటీవల ఒక వ్యక్తి కారు వెనుక ఉన్న బూట్ స్పేస్ లో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసిన సంఘటన మరియు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

నివేదికల ప్రకారం, ఈ సంఘటన భాగ్యనగరం (హైదరాబాద్) లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ముగ్గురు పిల్లలను బూట్ స్పేస్ లో కూర్చోబెట్టాడు. ఇందులో ఇద్దరు అమ్మయిలు, ఒక అబ్బాయి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఒక బొమ్మతో ఆదుకోవడం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

ఈ వీడియోను సోంచో జరా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేస్తూ ఇలా రాష్ట్రాలు 'వారెంత బాధ్యత లేని తల్లిదండ్రులు? దయచేసి వారిపైన చర్యలు తీసుకోండి సార్' అంటూ.. KTRTRS TelanganaCOPs HiHyderabad tsrtcmdoffice పేర్లను ట్యాగ్ చేశారు.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

ఈ ట్వీట్‌పై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్‌ ఆధారంగా వారికి చలాన్ జారీ చేశారు. 'సర్ మీ ఫిర్యాదు మేరకు ఈ సంఘనతనకు కారకుడైన వాహనదారుడికి ఇ-చలాన్ పంపాము. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రీ ట్వీట్ చేశారు.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

ఈ కారులో పిల్లలతో సహా మొత్తమ్ 7 మంది ఉన్నట్లు చూడవచ్చు. ఇందులో ముందు ఇద్దరు, మధ్యలో ముగ్గురు కూర్చున్నారు. పిల్లలకు స్పేస్ లేనందున ఆ కారు యొక్క బూట్ స్పేస్ లో కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియోని వెనుక వాహనదారులు షూట్ చేశారు. ఇందులో కనిపిస్తున్న కారు హ్యుందాయ్ కంపెనీ యొక్క గ్రాండ్ ఐ10.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

ఈ వీడియో చూసినవారిలో చాలామంది ఈ సంఘటనకు కారకులైన వారికి జరిమానా విధించాలని, మరికొందరు వారికి తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. అంతే కాకుండా వారిలో ఒకరు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పాడు.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

ఈ వీడియోలో ఆ కారు యొక్క నెంబర్ ప్లేట్ TS7HA8607 కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలను కారు కూర్చోబెట్టి అతడు టెయిల్ గేట్ అలాగే ఓపెన్ చేసి ఉంచాడు. కావున అనుకోకుండా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వంటివి వస్తే వెనుక ఉన్న వారు కిందికి పడే అవకాశం ఉంటుంది. ఇది ఊహకందని ప్రమాదాన్ని కలిగిస్తుంది.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కావున వాహనాలను నడిపే వారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ వెనుక పిల్లలను కూర్చోబెట్టి ముందువున్న వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

నిజానికి కారులో బూట్ స్పేస్ అనేది లగేజ్ ఉంచుకోవడానికి మాత్రమే, మనకు ఇక్కడ కలిపిస్తున్న వీడియోలో అది పిల్లలను తరలించడానికి అన్నట్లు అనిపిస్తుంది. ఇది ఏ మాత్రం సురక్షితం కాదు. కావున ఇలాంటి వాటిపైన పోలీసులు తప్పకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మున్ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది.

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తప్పకుండా బైక్ రైడర్లు హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు మొదలైన రూల్స్ కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండవ వరుసలోని ప్రయాణికులకు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ ఉండాలనే కొత్త నియమాన్ని తీసుకువచ్చింది. ఇది త్వరలోనే అమలులోకి వస్తుంది.

కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మనం రోడ్డుపైన ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా.. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అదే నిర్లక్యంగా వెళితే అక్కడ జరిగే ప్రమాదాలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇది చుట్టుపక్కల ఉన్న వాహనదారులకు కూడా ప్రమాదాన్ని తీసుకువస్తుంది. కావున ఇలాంటి చర్యలను మనం ఎప్పటికప్పుడు ఖండించాలి, అప్పుడే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyderabad traffic police issue challan for driving car with kids in boot space details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X