PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

By Anil

ఉపగ్రహాలను కక్ష్యలలో సురక్షితంగా ప్రవేశ పెట్టడంలో రాకెట్ల ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అంతటి ముఖ్యమైన రాకెట్‌లలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ యొక్క పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఎంతో శక్తివంతమైనది. ప్రపంచ దేశాలు తమ శాటిలైట్లను కక్ష్యలలోకి ప్రవేశపెట్టడానికి పిఎస్‌ఎల్‌వీ రాకెట్ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇలాంటి రాకెట్‌ను మన ఇస్త్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.

అయితే ఈ పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను పక్కకు నెట్టి దీని కన్నా అత్యంత చౌకగా, శక్తివంతమైన రాకెట్‌ను రూపొందించే పనిలో ఇస్త్రో విజయం సాధించింది. స్క్రామ్‌జెట్ అనే ఇంజన్‌ రూపొందించి ప్రయోగించి పరీక్షించి చూసింది. ఇది విజయం కూడా సాధించింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్ (ATV) అనే పేరు దీనిని ఇది భవిష్యత్తులో ఉపగ్రహాలను ప్రయోగించడానికి వినియోగించనున్నారు. దీని గురించి పూర్తి వివరాలు...

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

ఈ స్క్రామ్‌జెట్ ఇంజన్ గల ఎటివి (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్) మ్యాక్ 6 వేగంతో నింగిలోకి దూసుకుపోతుంది. మ్యాక్ 6 అనగా ధ్వని కన్నా ఆరు రెట్ల వేగంతో. ఈ సాంకేతికతను అభివృద్ది చేసుకుని ఇలాంటి పరిజ్ఞానం గల నాలుగవ దేశంగా భారత్ ఎదగడానికి ఇస్రో దోహదపడింది.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

స్క్రామ్‌జెట్ (Scramjet) ను సూపర్ సోనిక్ ర్యామ్‌జెట్ (Super Sonic Ramjet)అని కూడా పిలుస్తారు. అయితే ఇందులో ఉన్న ర్యామ్‌జెట్‌లను తక్కువ వేగం వద్ద మరియు హైపర్‌సోనిక్ వేగం వద్ద అదే విధంగా క్రయోజనిక్ ఇంజన్‌లు వర్యావరణం చివరలో ఉన్నపుడు స్క్రామ్‌జెట్‌లను వినియోగిస్తారు.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

ఈ ఎటివి ముందుకు వెళుతుంటుంది కాబట్టి ఎదురుగా వచ్చే గాలి ఇంజన్‌లోని ముందు భాగానికి చేరుకుంటుంది, మధ్య భాగంలో మండుతుంది, చివరిలో పొగ బయటకు వస్తుంది. చివరిలోనే ఎక్కువ ఒత్తిడి ఉత్పత్తి కాబట్టి ఎటివి అత్యంత వేగంగా ముందుకు దుసుకెళుతుంది.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

గాలిని గ్రహించే భాగం యొక్క డిజైన్, గాలి ఒత్తిడిని పెంచే విధానం, గాలి వీచే ప్రభావం, గరిష్ట ఉష్ణోగ్రత, ఫ్యూయల్ ఇంజెక్షన్‌లకు సంభందించిన పరికరాల డిజైనింగ్ ఎంతో కష్టతరంతో కూడుకున్నది.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

స్క్రామ్‌జెట్ ఇంజన్‌లు ప్రారంభంలో అంత శక్తివంతంగా ఉండకపోయినా, కాస్త వేగాన్ని పుంజుకున్నాయంటే సూపర్ సోనిక్ వేగాన్ని అందుకుంటాయి. కారణం ఇది ప్రయాణించే దిశ నుండి ఇంజన్‌లోకి గాలి వచ్చి చేరుతుంది కాబట్టి.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

ఇస్రోకు ఇది ఎంతో ముఖ్యమైన ఇంజన్‌ ఎందుకంటే ? పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో రెండు రకాలుగా ఇంధన వినియోగం జరుగుతుంది. కాని స్క్రామ్‌జెట్‌లో ఒకే విధమైన ఇంధనం చాలు.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని ఇంజన్‌లో తిరిగే విడి భాగాలు ఉంటాయి. కాబట్టి, అప్పుడప్పుడు ఇవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాని స్క్రామ్‌జెట్‌లో అలాంటి ఇంజన్ ఉండదు కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు దాదాపుగా చాలా వరకు తక్కువ.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

సామర్థ్యం పరంగా పోల్చుకుంటే స్క్రామ్‌జెట్ ఇంజన్‌ గల ఎటివిలు పిఎస్‌ఎల్‌వీల కన్నా ఎక్కువ బరువును మోసుకెళ్లగలవు మరియు పిఎస్‌ఎల్‌వీ రాకెట్లను ప్రయోగించడానికి వినియోగించే మొత్తంలో సగం డబ్బుతో స్క్రామ్‌జెట్ ఎటివిలను ప్రయోగించవచ్చు.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

స్క్రామ్‌జెట్ ఇంజన్‌లను ఈ ఎటివిలలో వినియోగించడం ఇది మొదటి సారి కాదు, బ్రహ్మోస్-II క్షిపణుల్లో కూడా వినియోగించారు. తద్వారా ఇవి గరిష్టంగా మ్యాక్ 7 వేగంతో ప్రయాణించగలవు.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల్లో లిక్విడ్ ఫ్యూయల్ వినియోగించుకునే ర్యామ్‌జెట్ ఇంజన్‌ను వినియోగిస్తున్నారు. ఇది గరిష్టంగా మ్యాక్-3 వేగంతో దూసుకెళుతుంది. ప్రపంచంలో ఉన్న క్రూయిజ్ మిస్సైల్స్‌లలో ఇది అత్యంత వేగవంతమైనది.

PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

  • ముంచుకొస్తున్న ముప్పు....!!
  • ఇస్రో ఒడిలో పిఎస్‌ఎల్‌వీ అద్భుతం, ఒక్క ప్రయోగంతో 20 శాటిలైట్
  • PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు

    • అణు బాంబులకు సైతం చెదరని, బెదరని జెల్‌జవా భూగర్భ స్థావరం
    • హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం

Most Read Articles

English summary
Important Things About Isro Scramjet Engine
Story first published: Thursday, September 1, 2016, 11:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X