భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

భారత రహదారులు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ్టి కథనంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐదు అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారులు గురించి తెలుసుకుందాం రండి...

By N Kumar

Recommended Video

Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

భారత రహదారులు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఒక్క 2015లో 1,46,213 మంది భారతీయ రోడ్ల మీద మరణించారు.

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

అప్పట్లో ప్రతి లక్ష మంది జనాభాలో 11 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి 3.6 నిమిషాలకు ఓ ప్రాణం గాల్లో కలిసిపోతోంది. ఇవన్నీ 2015 గణాంకాల ప్రకారం, మరి ఇప్పుడు... ఈ సంఖ్య ఇంకా పెరిగింది. జాతీయ రహదారులు మీదే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఇవాళ్టి కథనంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐదు అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారులు గురించి తెలుసుకుందాం రండి...

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారులు

5. చెన్నై-తెని జాతీయ రహదారి (NH45)

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నుండి కేరళ సరిహద్దులో మదురైకి సమీపంలో ఉన్న తెని ప్రాంతం వరకు ఉన్న జాతీయ రహదారి 45 భారతదేశపు ఐదవ అత్యంత ప్రమాదకరమైన నేషనల్ హైవేగా నిలిచింది.

Picture credit: Wiki Commons

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

గణాంకాల ప్రకారం, ఈ చెన్నై-తెని జాతీయ రహదారి మీద 24 బ్లాక్ స్పాట్స్(ప్రమాదకరమైన ప్రదేశాలు)ఉన్నాయి. ఒక్క 2013లో ఈ హైవే మీద సుమారుగా 3,143 ప్రమాదాలు సంభవించాయి. ఈ మార్గం వెంబడి మొత్తం 68 గ్రామాలు ఉన్నాయి.

Picture credit: NHAI

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

4. థానే-చెన్నై(NH4)

భారతదేశపు జాతీయ రహదారుల్లో అతి ముఖ్యమైనది NH4.మహారాష్ట్రలోని థానే నగరం మరియు తమిళనాడులోని చెన్నై నగరాన్ని కలిపే నాలుగవ నెంబర్ జాతీయ రహదారి మీద మొత్తం 27 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి.

Picture credit: Wiki Commons

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

1,235 కిలోమీటర్ల పొడవున్న ఈ థానే-చెన్నై నేషనల్ హైవే మీద 2015లో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. అధిక వేగంతో డ్రైవ్ చేసేందుకు అనువుగా ఉండటంతో వేగాన్ని అదుపులేనంత మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడం ద్వారా ప్రమాదకరమైన మలుపుల్లో అధిక ప్రమాదాలు జరిగాయి.

Picture credit: Wiki Commons

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

3. నాంగ్‌స్టోయిన్-సబ్రూమ్ (NH44)

ఈశాన్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న నాంగ్‌స్టోయిన్ మరియు దక్షిణ ప్రాంతంలో ఉన్న సబ్రూమ్ నగరాలను ఈ జాతీయ రహదారి 44 కలుపుతుంది. ఈ జాతీయ రహదారి మీద సుమారుగా 38 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఇది భారతదేశపు మూడవ అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారి.

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

ఇండియాలో గిరిజన ప్రాంత నివాసితులను ఎక్కువగా పొట్టనపెట్టుకుంటున్న జాతీయ రహదారి కూడా ఇదే. ఈ మార్గంలో ఉన్న పెద్దకుంట అనే గ్రామానికి చెందిన గిరిజనలు జాతీయ రహదారిని దాటే క్రమంలో ఎక్కువ మంది పురుషులు మృత్యువాతపడ్డారు. అందుకే ఈ గ్రామాన్ని బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్(BBC) విలేజ్ ఆఫ్ విడోస్(వితంతువుల గ్రామం)గా అభివర్ణించింది.

Trending On DriveSpark Telugu:

ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ?

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన 10 రహదారులు

ఈ ఇండియన్ రోడ్ల మీద వెళితే తిరిగి రావడం కష్టమే!!

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

2. ఢిల్లీ-ముంబాయ్(NH8)

దేశ రాజధాని ఢిల్లీ మరియు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబాయ్ నగరాలను కలిపే 8 వ జాతీయ రహదారి భారతదేశపు రెండవ అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారిగా నిలిచింది. ఈ రహదారి మీద మొత్తం 45 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి.

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

ఇదే రహదారిలో భాగంగా ఉన్న ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి అత్యంత ప్రమాదకరమైనది. ముంబాయ్ రహదారిలో భాగంగా ఉన్న ఈ మార్గంలో 2010 నుండి 2015 మధ్య కాలంలో ఏడాదికి సగటున 191మంది మరణించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ గణాంకాల మేరకు, 2010-2015 మధ్య ఏడాదికి 3,000 చొప్పున రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

1. ఢిల్లీ-కలకత్తా(NH2)

1,465కిలోమీటర్ల మేర పొడవున్న రెండవ నెంబర్ జాతీయ రహదారి భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మార్గంలో 59 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి.

Picture credit: Wiki Commons

భారతదేశంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన ఐదు జాతీయ రహదారులు

ఢిల్లీ, హర్యాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖడ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించి కలకత్తా వరకు ఉన్న ఈ జాతీయ రహదారి ప్రతి ఏటా ఎన్నో ప్రమాదాలకు నిలయమవుతోంది. ప్రతేకంగా గుర్తించిన 59 మలుపుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Picture credit: Wiki Commons

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: India's Most Dangerous National Highways
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X