సాధారణ డీజల్ కంటే తక్కువ ధరతో అధిక మైలేజ్ ఇచ్చే ఇండీజెల్

By Anil Kumar

పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో రకరకాల ప్రత్యామ్నయ ఇంధనాలు మార్కెట్లోకి వస్తున్నాయి, అందులో ఒకటి ఇండీజెల్. ఇటీవల అందుబాటులోకి ఇండీజెల్ ఇంధనం సాధారణ డీజల్ కంటే తక్కువ ధర, తక్కువ ఉద్గారాలతో మరియు అధిక మైలేజ్‌ ఇస్తుంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

తరిగిపోయే ఇంధన వనరులైన పెట్రోల్ మరియు డీజల్ ధరలు అంతకంతకూ పెరిగిపోడం మరియు వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మై ఇకో ఎనర్జీ సంస్థ విపణిలోకి ఇండీజెల్ అనే బయో డీజల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ప్రాంఛైజీల ద్వారా ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు చేసి ఇండీజెల్ విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

మై ఇకో ఎనర్జీ సంస్థ నాన్-పెట్రోలియం ఉత్పత్తుల ఆధారంగా ఇండీజెల్ బయో డీజల్‌ను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ కథనం మేరకు, వీటిని సాధారణ డీజల్ వాహనాలలో నిశ్చితంగా వాడవచ్చు. అన్నింటికంటే, యురో VI ఉద్గార నియమాలను పాటించే ఏకైక డీజల్ ఇదే మరియు బయో డీజల్ యొక్క సెకండ్ జనరేషన్ ఈ ఇండీజెల్.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

మై ఇకో ఎనర్జీ కో-ఫౌండర్ సంతోష్ వర్మ మాట్లాడుతూ, "సాధారణ డీజల్‌తో నడిచే వాహనాలకు ఇది మంచి ప్రత్యామ్నాయమే కాకుండా తక్కువ ధరలో అత్యధిక మైలేజ్‍‌ ఇస్తుంది. అంతే కాకుండా ఇంజన్ పరికరాలకు లుబ్రికేషన్ కల్పించి ఇంజన్ జీవితకాలాన్ని పెంచుతుంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

ఇండీజెల్ ఇంధనం ప్రజల కోసం మార్కెట్లోకి వచ్చేందుకు చివరి దశలో ఉంది. బయో డీజల్‌ను సుమారుగా 1200కిలోమీటర్లు పరీక్షించేందుకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందానికి ప్రత్యేక అవకాశం లభించింది. రెనో డస్టర్ ఆటోమేటిక్ డీజల్ ఎస్‌యూవీని ముంబాయ్ - బెంగళూరు రోడ్ ట్రిప్ ద్వారా ఇండీజెల్‌‌ను పరీక్షించాము. ఇండీజెల్ గురించి నా అభిప్రాయం...

ఇండీజెల్ బయో ఫ్యూయల్

ఇండీజెల్‌ను పరీక్షించేందుకు రెనో డస్టర్ ఎస్‌యూవీ ఆర్ఎక్స్‌జడ్ ఆటోమేటిక్ డీజల్ వేరియంట్‌ ఎంచుకొని కొంకన్ కోస్ట్ మార్గంలో వయా గోవా మరియ మంగళూరు మీదు ముంబాయ్ నుండి బెంగళూరుకు సాధారణ డీజల్ ఫ్యూయల్‌తో రోడ్డు ట్రిప్ చేశాము.

అయితే, ముంబాయ్‌కి తిరుగు ప్రయాణమైనపుడు, మై ఇకో ఎనర్జీ సంస్థ సుమారుగా 100 లీటర్ల ఇండీజెల్ ఇంధనాన్ని ఆఫర్ చేసింది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

ఎస్‌యూవీని రెగ్యులర్ డీజల్‌తో డ్రైవ్ చేసిన అనంతరం ఇండీజెల్ ఇంధన నింపాము. ట్యాంక్ కెపాసిటి 50 లీటర్లు మాత్రమే అయితే, తరువాత ఇండీజెల్ స్టేషన్ వరకు చేరుకోగలమో... లేదో... అనే అనుమానంతో అదనంగా మరో క్యాన్‌లో 15 లీటర్లు తీసుకెళ్లాము. మేము వెళ్లిన మార్గంలో తరువాత వచ్చే ఇండీజెల్ ఫ్యూయల్ స్టేషన్ సుమారుగా 950కిమీల తరువాత ఖోపోలి లోని ఖాలాపూర్‌లో ఉంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జడ్ వేరియంట్లో 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 109బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

ఇండీజెల్ ఇంధనం నింపిన తరువాత డస్టర్ ఎస్‌యూవీ మునుపటి కంటే మరింత స్మూత్‌గా రన్ అయ్యింది. హైవే మీద యాక్సిలేరషన్ చేస్తున్నపుడు పవర్ డెలివరీ అద్భుతంగా పెరిగింది. టార్క్ కూడా ఆశించిన దానికంటే ఎక్కువే ప్రొడ్యూస్ చేసింది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

మా రోడ్ ట్రిప్ ముగిసే సమయానికి మై ఇకో ఎనర్జీ కంపెనీ చెప్పిన ఫలితాలే వచ్చాయి. పర్ఫామెన్స్ పెరగడం మాత్రమే కాదు, మైలేజ్ కూడా గణనీయంగా పెరిగింది. అవును ఇండీజెల్ ఇంధనంతో డ్రైవ్‌ చేసినపుడు హైవే మీద లీటరుకు 18-21కిమీల మైలేజ్ వచ్చింది. అయితే, సాధారణ డీజల్‌తో డ్రైవ్ చేసినపుడు 15 నుండి 17కిమీల మైలేజ్ సాధ్యమైంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

అద్భుతమైన మైలేజ్‌తో, ఇండీజెల్ ఫ్యూయల్ స్టేషన్‌ను చేరుకునేసరికి ఇంకా 55కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఇండీజెల్ ఇంధనం ట్యాంకులో మిగిలింది. ట్రిప్ మొత్తం ఏ/సి ఆన్‌లో ఉన్నా కూడా ఈ మైలేజ్ సాధ్యమైంది. మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఇండీజెల్ ఫ్యూయల్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

మై ఇకో ఎనర్జీ ఫ్యూయల్ స్టేషన్లను కంపెనీ ప్రతినిధులు నిర్వహిస్తారు. అయితే, మనీ పేమెంట్ మరియు ఫ్యూయల్ పంపణీ మొబైల్ ఫోన్ యాప్ ద్వారా మాత్రమే జరుగుతాయి. దీంతో కస్టమర్లు పూర్తిగా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

ఖాలాపూర్‌లోని ఇండీజెల్ ఫ్యూయల్ నింపుకున్న తరువాత ముంబాయ్‌కు మా జర్నీ ప్రారంభమైంది. హైవే మీద వెళుతున్న వాహనాలను చాలా సులభంగా ఓవర్‌టేక్ చేయగలిగాము. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కంటే ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ వెహికల్ చాలా నెమ్మదిగా స్పందిస్తుంది. కానీ ఇండీజెల్ ఫ్యూయల్ నింపడంతో రెనో డస్టర్ ఏఎమ్‌టి చాలా వేగంగా స్పందించింది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాధారణ డీజల్ మరియు ఇండీజెల్‌ మధ్య తేడా ఏంటి...? ఇండీజెల్ చౌకైనది, పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తుంది, బయోడీగ్రెడబుల్ ఉత్పత్తులతో తయారైనది, ఎక్కువ మైలేజ్‌నిస్తుంది, పర్ఫామెన్స్ పెరగడంతో పాటు స్మూత్ రైడింగ్ కల్పిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలతో రెగ్యులర్ డీజల్ కంటే ఇండీజెల్ బెటల్ ఫ్యూయల్ అని మా ట్రిప్‌లో వెల్లడైంది.

ఇండీజెల్ బయో ఫ్యూయల్

దీనిని వాడటానికి ఉన్న ప్రధాన సమస్య ఆశించినన్ని ఫ్యూయల్ స్టేషన్లు లేకపోవడమే. అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారంగా దేశవ్యాప్తంగా ప్రాంఛైజీల ద్వారా ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Indizel — Cheaper, Cleaner And More Powerful Than Regular Diesel!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X