ఫ్యాన్స్‌కి పూనకాలు పుట్టించే కథనం.. ఖరీదైన బైక్ రైడ్ చేసిన జనసేనాని 'పవన్ కళ్యాణ్'

'పవన్ కళ్యాణ్' ఈ పేరుకి పెద్దగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగు సినీపరిశ్రమలో అత్యధిక సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే కాకుండా జనసేన పార్టీ స్థాపించి రాజకీయ రంగప్రవేశం కూడా చేశారు. అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తూ ఉన్నాడు.

ఇటీవల భీమ్లా నాయక్ సినిమా విజయం సాధించిన తరువాత హరిహర వీరమల్లు సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక ఖరీదైన బైకుపై కనిపించి అభిమానులను చాలా ఆశ్చర్యానికి గురిచేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ కాన్ల్యాం ఖరీదైన బిఎండబ్ల్యు కంపెనీ యొక్క R 1250 GS మోడల్ బైక్ రైడ్ చేశారు.

ఖరీదైన బైక్ రైడ్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

నిజానికి పవన్ కళ్యాణ్ కి గన్స్ మరియు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే తన కోసం ఈ BMW R 1250 GS బైక్ తీసుకురావడం జరిగింది. దీని ధర రూ. 24 లక్షలు (ఆన్ రోడ్-హైదరాబాద్) అని తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా లగ్జరీగా ఉంది. మంచి డిజైన్ అందుతాకు మించిన ఫీచర్స్ కలిగి బైక్ రైడర్స్ కి ఒక లగ్జరీ రైడింగ్ అనుభూతి అందిస్తుంది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతూ ఉంది. ఇది క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2023 మార్చి నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 900 మంది ఆర్టిస్టులతో చాలా వేగంగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక పక్క సినిమాలు చేస్తూనే ఒక పక్క రాజకీయాలను నడిపిస్తున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ రైడ్ చేసిన BMW R 1250 GS విషయానికి వస్తే, ఇది 1,254 సిసి టు-సిలిండర్, బాక్సర్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 7,750 rpm వద్ద 134 bhp పవర్ మరియు 6,250 rpm వద్ద 143 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఏకంగా 20 లీటర్ల వరకు ఉంటుంది. కావున ఇది దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అసెమ్మిట్రిక్ హెడ్‌లైట్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్‌, కీలెస్ రైడ్, హీటెడ్ గ్రిప్స్, బ్లూటూత్ ఎనేబుల్డ్ TFT కలర్ డిస్‌ప్లే, 12 వోల్ట్ సాకెట్ మరియు USB ఛార్జింగ్ ఇంటర్‌ఫేస్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇందులో ఎకో, రోడ్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేడిమీద ఉన్నాయి. ఎన్నికలు జరగటానికి కేవలం ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉంది. కావున అటు తెలుగుదేశం, జనసేన, బిజెపి వంటివి వచ్చే ఎన్నికల్లో గెలుపుగుర్రాలను ఎక్కాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే జనసేన ప్రయత్నాలు మరింత ముమ్మరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం ప్రచార రథం కూడా సిద్దమవుతోంది. ఈ వాహనంలో పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభించనున్నారు.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామానికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వస్తున్న సంగతి ముందే తెలుసుకున్న పోలీసులు ఆయన ఫ్రయాణిస్తున్న కార్లను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లేదని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులను కోరారు. మొత్తమ్ మీద పవన్ కళ్యాణ్ కార్లను పోలీసులు ఆపడంతో ఇంక చేసేది లేక కాలినడకనే బయలుదేరాడు.

Most Read Articles

English summary
Janasena chief pawan kalyan bmw bike riding in movie shooting
Story first published: Monday, December 5, 2022, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X