15 ఏళ్లు పూర్తి చేసుకున్న కొంకన్ రైల్వే రోరో సేవలు

By Ravi

రోరో రైల్.. ఈ పేరే కొత్తగా ఉంది కదూ. కానీ ఇది 15 ఏళ్ల పాత పేరు. అవును కొంకణ్ రైల్వే ఈ విశిష్టమైన రోరో రైల్ సేవలను ప్రారంభించి ఈ ఏడాది జనవరితో సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. రోరో అంటే రోల్-ఆన్ రోల్-ఆఫ్ అని అర్థం. ఇదొక రవాణా రైలు.

కొంకణ్ రైల్వే జనవరి 26, 1999తేదీన దీనిని పరిచయం చేశారు. ఆ సమయంలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా కొంకణ్ రైల్వే రూట్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఫ్లాట్ వ్యాగన్లపై లారీలను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రవాణా చేస్తుంటారు.

ఈ సేవలను ప్రారంభించినప్పుడు మొదట్లో దీనికి పెద్ద ఆదరణ లభించలేదు. అప్పట్లో కేవలం ఐదు ఫ్రైట్ సర్వీస్ సంస్థలే వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఈ సేవల గురించి ఆనోటా ఈనోటా ప్రచారం లభించడంతో ఇది మంచి విజయవంతమైన రవాణా సాధనంగా మారింది.

రోరో రైలు సేవలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌‌లో పరిశీలించండి..!

కొంకన్ రైల్వే రోరో సేవలు

కొంకణ్ రైల్వే రూట్‌లో ఫ్రైట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వే లోడ్ చేయబడిన గూడ్స్ ట్రక్కుల కోసం ఈ ప్రత్యేకమైన రోరో సేవలను ప్రారంభించింది. ఇందులో ట్రక్కులను రైల్వే ఫ్లాట్ వ్యాగన్ల పిగ్గీ బ్యాక్‌పై తీసుకువెళ్తారు.

కొంకన్ రైల్వే రోరో సేవలు

ఈ సేవలు కేవలం కొంకణ్ రైల్వే రూట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల ద్వారా ప్రస్తుతం రైల్వేకి సాలీనా రూ.50 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఈ 15 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షలకు పైగా గూడ్స్ ట్రక్కులను రవాణా చేసుంటారు.

కొంకన్ రైల్వే రోరో సేవలు

వాస్తవానికి ఈ రూట్లో లోడ్ చేయబడిన ట్రక్కులను రోడ్డుపై తీసుకువెళ్లటం కన్నా ఇలా రైలుపై తీసుకువెళ్లటమే ఎంతో లబ్ధిదాయకం. ఇది ఇటు లారీ సంస్థల యజమానులకు అటు రైల్వేకి మంచి లాభాలాను తెచ్చిపెడుతుంది.

కొంకన్ రైల్వే రోరో సేవలు

ఈ రూట్లో రవాణా సంస్థల యజమానులను సంప్రదించి, ఈ సేవల యొక్క ప్రయోజనాలను వివరించేందుకు కొంకణ్ రైల్వే చేపట్టిన ప్రచార, మార్కెటింగ్ కార్యకలాపాలు మంచి విజయాన్ని సాధించాయి.

కొంకన్ రైల్వే రోరో సేవలు

గత 15 ఏళ్ల కాలంలో కొంకణ్ రైల్వే సేవల్లో అనేక మార్పులు చేర్పులు చేయబడ్డాయి. షార్టర్ రూట్స్‌ను పరిచయం చేయటం, మరిన్ని ర్యాక్స్‌ను జోడించటం మరియు ఈ ర్యాక్స్ సమయానికి గమ్యాన్ని చేరేలా చూడటం మొదలైన మార్పులు చేయబడ్డాయి.

కొంకన్ రైల్వే రోరో సేవలు

ప్రస్తుతం సగటున ప్రతి ర్యాక్‌కు50 ట్రక్కులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఇలా మొత్తం మూడు ర్యాక్‌ల వరకు ప్రతిరోజు లోడ్ చేయబడుతున్నాయి. అటు రైల్వేస్‌కి ఇటు రోడ్వేస్‌కి మధ్యన మంచి సంబంధాన్ని ఏర్పచడంలో కొంకణ్ రోరో సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

కొంకన్ రైల్వే రోరో సేవలు

ఈ సేవలను కొంకణ్ రైల్వే ప్రతిపాధించింది. ప్రస్తుతం రెండు రోరో సేవలు (ఒకటి కోలాడ్ (ముంబై నుంచి 145 కి.మీ.) నుంచి వెర్నా (417 కి.మీ), రెండవది కోలాడ్ నుంచి సురాత్కల్ (721 కి.మీ)) ఉన్నాయి. కోలాడ్ నుంచి వెర్నాకు 12 గంటల ప్రయాణం, కోలాడ్ నుంచి సురత్కల్‌కు 22 గంటల ప్రయాణ సమయం పడుతుంది.

Most Read Articles

English summary
RORO means Roll On Roll Off, where loaded trucks are directly carried by railway wagons to their destination. Konkan Railways passes through tough terrains of India. 
Story first published: Wednesday, May 21, 2014, 13:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X