కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

సాధారణంగా కార్లలో లైటింగ్ వ్యవస్థ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ లైటింగ్ వ్యవస్థలో హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, టెయిల్ లైట్స్, మరియు పార్కింగ్ లైట్స్ మొదలైనవి ఉంటాయి.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

ఇదివరకటి కార్లలో ఈ లైట్లన్నీ కూడా హాలోజెన్ బల్బులను కలిగి ఉండేవి. అయితే, ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వస్తున్న ఆధునిక కార్లలో సాంప్రదాయ హాలోజెన్ బల్బులకు బదులుగా ఎల్ఈడి లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే, వీటి వలన కలిగే ప్రయోజనాల కన్నా దుష్ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి:

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

హీటింగ్ మరియు కూలింగ్

ఎల్ఈడి హీటింగ్‌పై పనిచేస్తోంది, కాబట్టిని దీనికి శీతలీకరణ వ్యవస్థ కూడా అవసరం. ఇందులో లైట్ బల్బ్ చిన్నదే అయినప్పటికీ, దాని శీతలీకరణ వ్యవస్థ (కూలింగ్ సిస్టమ్) మాత్రం పెద్దదిగా ఉంటుంది. ఈ కూలింగ్ సిస్టమ్ వలన ఎల్ఈడి లైట్ ఖర్చు కూడా పెరుగుతుంది.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

పాదచారులకు ముప్పు

ఎల్ఈడి లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి సాంప్రదాయ హాలోజన్ బల్బుల కంటే ఎక్కువ కాంతిని ఇస్తాయి. ఇది కారు నడిపే వారికి సౌకర్యంగానే అనిపిస్తుంది, కానీ ఆ కారుకి ఎదురుగా వచ్చే పాదచారులకు మాత్రం ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ఎల్ఈడి లైట్ల నుండి వచ్చే అధిక కాంతి వలన పాదచారుల దృష్టి లోపించి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

అటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ మీ కారులో ఎల్‌ఈడీ లైట్లు ఉన్నట్లయితే, వాటిని సందర్భానుసారంగా ఉపయోగించడం మంచిది. ప్రత్యేకించి, ఎల్ఈడి లైట్ల విషయంలో అవసరమైతే తప్ప హైబీమ్ ఉపయోగించకూడదు. పెడస్టేరియన్ సేఫ్టీ కోసం చాలా కార్లలో ఎల్‌ఈడీ లైట్లు డ్రైవర్ వైపు కొద్దిగా తక్కువగా మరియు ప్రయాణీకుల వైపు ఎక్కువగా ఉండే విధంగా ట్యూన్ చేయబడతాయి.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

స్నో లేదా ఫాగ్

స్నో లేదా ఫాగ్ (ఘనీభవించిన మంచు లేదా పొగ మంచు) పరిస్థితుల్లో తెలుపు కాంతిని వెదజల్లే ఎల్ఈడి లైట్స్ అంత సురక్షితమైనవి కావు. తెలుపు రంగుపై తెల్లటి లైట్స్ మరింత ప్రకాశవంతంగా పనిచేసి, డ్రైవర్ విజిబిలిటీని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి, మీరు అలాంటి పరిస్థిల్లో డ్రైవ్ చేస్తుంటే, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

సాధారణంగా, ఇలాంటి సందర్భాల్లో హాలోజెన్ బల్బులు బాగా సురక్షితమైనవి. లేదా ఫాగ్ ల్యాంప్స్ విషయంలో ఎల్ఈడి లైట్లలో వార్మ్ వైట్ కలర్‌ను ఎంచుకోవటం మంచిది. ఇవి తెలుగు రంగు (మంచు లేదా పొగ మంచు)పై తక్కువ కాంతిని ప్రతిభింభింపజేస్తాయి.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

ఒకవేళ మీరు మంచు మరియు పొగమంచు పడే ప్రదేశంలో నివసిస్తుంటే, మీరు రెండు రకాల లైట్లను ఉపయోగించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. పొగమంచు సమయంలో, మీ కారు హెడ్‌లైట్లను లోబీమ్‌లో ఉంచి, వార్మ్ వైట్ ఫాగ్ ల్యాంప్స్‌ను ఉపయోగించి డ్రైవ్ చేయటం మీకు మరియు మీ ఎదురుగా వచ్చే వాహనాలకు సురక్షితం.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

ధర

సాధారణంగా ఎల్‌ఈడీ లైట్ల ధరలు సాధారణ హాలోజన్ లైట్ల ధరల కంటే అధికంగా ఉంటాయి. అయినప్పటికీ, ఈ ఎల్ఈడి లైట్లు హాలోజెన్ బల్బుల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి మరియు హాలోజెన్ బల్బుల కన్నా అధిక కాంతిని అందిస్తాయి.

కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!

చివరిమాట

మీరు నిత్యం చీకటి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రైవ్ చేసేవారు అయితే, మీ కారులో ఎల్ఈడి లైట్లు ఉండటం మంచిది. ఒకవేళ మీరు కేవలం నగరంలో మాత్రమే కారు నడుపుతుంటే, మీ వాహనానికి ఎల్ఈడి లైట్లు అవసరం లేదు. అలాకాకుండా, మీరు కొనుగోలు చేసిన కారులో అన్ని లైట్లు తెలుపు ఎల్ఈడిలే అయితే, మీరు వాటిని వార్మ్ వైట్‌కు మార్చుకోవచ్చు లేదా హెడ్‌ల్యాంప్స్‌పై పారదర్శక పసుపు రంగు స్టిక్కర్ వేయించుకోవచ్చు.

Most Read Articles

English summary
LED Lights In Car: Advantages, Disadvantages And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X