మహేంద్ర సింగ్ ధోని కార్ మరియు బైక్ కలెక్షన్

భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తూ వచ్చిన మహేంద్ర సింగ్ ధోనికి వెహికల్స్ అంటే అమితాసక్తి. ఇవాళ్టి స్టోరీ ద్వారా ఎమ్.ఎస్. ధోనీ వద్ద ఎలాంటి బైకులు మరియు కార్లు ఉన్నాయో చూద్దాం రండి.

By N Kumar

భారత క్రికెట్ ప్రపంచంలో ఎమ్.ఎస్ ధోనిది ప్రత్యేకం స్థానం. జట్టును ముందుండి నడిపించడంలో ధోని తర్వాతే ఎవరైని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో జట్టుకు అత్యధికంగా సారథ్యం వహిచింది ధోని (331) ఆ తర్వాత స్థానంలో రిక్కి పాంటింగ్ (324) ఉన్నాడు. అయితే ఇక తన క్రికెట్ ప్రస్థానం కొనసాగదని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు.

దేశ క్రికెట్ చరిత్రలో చెదరని ముద్ర వేసుకున్న మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తన ట్వట్టర్ ఖాతా ద్వారా నిర్ణయాన్ని క్రికెట్ ప్రేమికులతో పంచుకున్నాడు. ధోనికి క్రికెట్ తో పాటు వెహికల్స్ అన్నా అమితమైన ఇష్టం. ప్రస్తుతం ధోని వద్ద ఎలాంటి బైకులు మరియు కార్లు ఉన్నాయో చూద్దాం రండి.

కవాసకి నింజా హెచ్2

కవాసకి నింజా హెచ్2

టూ వీలర్లలో అత్యంత శక్తివంతమైన బైకు కవాసకి నింజా హెచ్2 ను తన బైక్ గ్యారేజిలోకి ఎంచుకున్నాడు. ఈ శ్రేణిలో అత్యంత శక్తివంతమైన సూపర్ ఛార్జ్‌డ్ బైకు ఇదే. ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 134బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల దీని ధర రూ. 29.1 లక్షలుగా ఉంది.

కాన్ఫెడరేట్ ఎక్స్132హెల్‌క్యాట్

కాన్ఫెడరేట్ ఎక్స్132హెల్‌క్యాట్

వేగంగా వెళ్లే బైకులంటే మంచి క్రేజ్ ఉన్న ఈ క్రికెటర్ ఎక్స్132 హెల్‌క్యాట్ అనే సూపర్ బైకును అమెరికా నుండి ఆర్డర్ చేయించి మరీ ఇండియాకు దిగుమతి చేయించుకున్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ సూపర్ బైకుల తయారీ సంస్థ కాన్ఫెడరేట్ అందిస్తున్న శక్తివంతమైన మోటార్ సైకిళ్లలో ఎక్స్132హెల్‌క్యాట్ ఒకటి.

ఎమ్ఎస్ ధోని వాహన ప్రపంచం

ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్‌లో శక్తివంతమైన 2163 సీసీ (వామ్మో...) వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 132 బిహెచ్‌పిల శక్తిని, 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ విడుదల చేసే శక్తి దాదాపు ఓ ప్రీమియం కారు (చెవర్లే క్రూజ్ వంటిది)కు సమానం. ఇండియాలో ఎక్స్132 హెల్‌క్యాట్ సూపర్‌బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.27 లక్షలకు పైమాటే.

కవాసకి నింజా జడ్ఎక్స్-14ఆర్

కవాసకి నింజా జడ్ఎక్స్-14ఆర్

నింజా జడ్ఎక్స్-14ఆర్ బైకు కవాసకి వారి ఫ్లాగ్‌షిప్ హైపర్ మోటార్ సైకిల్. అందులో బ్లాక్ కలర్ నింజా జడ్ఎక్స్-14ఆర్ ను ధోని ఎంచుకున్నాడు. ఇందులో 1,400సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 197బిహెచ్‌పి పవర్ మరియు 162.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీని ధర రూ. 17.66 లక్షల రుపాయలుగా ఉంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బ్యాయ్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బ్యాయ్

ధోని బైక్ గ్యారేజీలో ఉన్న ఏకైక బ్లూ క్రూయిజర్ మోటార్ సైకిల్ హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బ్యాయ్. హ్యార్లీ డేవిడ్‌సన్ సాఫ్ట్ టెయిల్ సిరీస్ లోని ప్రముఖ ఇకానిక్ మోటార్ సైకిల్ ఈ ఫ్యాట్ బ్యాయ్. ఇందులో 1,690సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 61బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీని ధర రూ. 15.5 లక్షల రుపాయలుగా ఉంది.

డుకాటి 1098

డుకాటి 1098

డుకాటి ఈ 1098 మోటార్ సైకిల్‌ను 2007 నుండి 2009 మద్య ఉత్పత్తి చేసింది. డుకాటి లైనప్‌లో అత్యంత పాపులర్ బైకు 1098. ధోని వద్ద ఈ శక్తివంతమైన బైకులో 1099సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది 160బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

మొదటి బైకు

మొదటి బైకు

ప్రతి ఒక్కరి లైఫ్‌లో మొదటి బైక్ అంటూ ఒకటి ఉంటుంది. అలాగే ధోని జీవితంలోని మొదటి బైకు ఆర్‌డి350. దీనిని 4500 రుపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ధోని క్రికెట్‌లో నిమగ్నమయిన తరువాత ఈ బైకు తన ప్రధాన్యతను కోల్పోయింది. దీంతో పాటు వినియోగం కూడా తగ్గిపోయింది.

యమహా ఆర్‌డి350

యమహా ఆర్‌డి350

కొత్తవొచ్చాక పాత వాటిని చాలా వరకు దూరం పెడుతుంటారు. కొంత మంది అయితే ఏకంగా పాత ఇనుప సామన్ల క్రింద అమ్మేస్తారు. అయితే మన కెప్టెన్ అలా చేయకుండా తానే స్వయంగా దీనిని విప్పదీసి స్వయంగా అసెంబుల్ చేసుకున్నాడు. తరువాత ఇదిగో ఇలా కనిపించింది.

సుజుకి షోగన్

సుజుకి షోగన్

1990 ల కాలంలో సుజుకి విడుదల చేసిన అత్యంత ఆసక్తికరమైన మోటార్ సైకిల్ సుజుకి షోగన్. అప్పట్లో యువతకు ఇదే బెస్ట్ బైకు. ఈ 2 స్ట్రోక్ బైకును ధోని తరచుగా వినియోగించేవాడు. ధోని ఈ మధ్యనే ఫేస్‌బుక్ సామాజిక మాధ్యమం ద్వారా తన వద్ద ఈ బైకు ఉన్నట్లు తెలిపాడు.

యమహా థండర్ క్యాట్

యమహా థండర్ క్యాట్

మహేంద్ర సింగ్ ధోని కొనుగోలు చేసిన మొదటి సూపర్ బైకు థండర్ క్యాట్. థండర్‌ క్యాట్ బైకు దేశీయంగా లభించేది కాదు. అయితే జపాన్ ఆధారిత మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ యమహా విక్రయించే ఈ బైకును ధోని దిగుమతి చేసుకున్నాడు. ఇందులో 600సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 100బిహెచ్‌పి పవర్

బిఎస్ఎ గోల్డ్‌స్టార్

బిఎస్ఎ గోల్డ్‌స్టార్

ఎమ్.ఎస్ ధోనికి పాత కాలం నాటి బైకుల మీద సవారీ అన్నా కూడా ఇష్టమే. అందుకే బ్రిటిష్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బిఎస్ఎ కు చెందిన గోల్డ్‌స్టార్ ను కొనుగోలు చేసాడు. ఈ మోటార్ సైకిల్ గంటకు 161 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 500సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 48బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

నార్టన్ జూబ్లీ 250

నార్టన్ జూబ్లీ 250

ధోని వద్ద ఉన్న లేటెస్ట్ వాంటేజ్ బైకులలో ఒకటి నార్టన్ జూబ్లీ 250. ఇది 250సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. నార్టన్ సంస్థ తయారు చేసిన చిన్న బైకులలో ఇది ఒకటి. 1958 లో అందుబాటులోకి వచ్చిన ఇది సుమారుగా 16బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

హీరో కరిజ్మా జడ్‌ఎమ్‌ఆర్

హీరో కరిజ్మా జడ్‌ఎమ్‌ఆర్

వన్డే వరల్డ్ సిరీస్ లో ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన తరువాత ధోని ఈ కరిజ్మా జడ్ఎమ్ఆర్ ను ఎంచుకున్నాడు. హీరో మోటోకార్ప్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ కరిజ్మా జడ్ఎమ్ఆర్ లో 223సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 20బిహెచ్‌పి పవర్ మరియు 19.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హమ్మర్ హెచ్2

హమ్మర్ హెచ్2

భారీ పరిమాణంలో ఉన్న ఎస్‌యువి వాహనాల నిర్మాణానికి పేరుగాంచింది హమ్మర్, అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ వినియోగ వాహనాల తయారీలో కూడా మంచి ప్రాముఖ్యతను సంపాదించుకుంది. హమ్మర్ లోని రెండవ తరం ఎస్‌యవి హమ్మర్ 2 ను ధోని కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నాడు. ఇందులో 6.2-లీటర్ సామర్థ్యం గల వి8 పెట్రోల్ ఇంజన్ కలదు.

ఎమ్ఎస్ ధోని వాహన ప్రపంచం

ఇది సుమారుగా 393బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఎస్‌యువి కేవలం 10 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకుంటుంది. చూడటానికి ఎస్‌యువిలాగే ఉంటుంది కాని దీని బరువు ఎంతో తెలుసా ? ఏకంగా మూడు టన్నులుగా ఉంది.

ఫెరారి జిటి599

ఫెరారి జిటి599

ధోని ఎంచుకున్న ఏకైక సూపర్ కారు, ఫెరారి జిటి599. ఇందులో 6-లీటర్ సామర్థ్యం గల వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 661బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. కేవలం 3.35 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీనిని గరిష్ట వేగం గంటకు 335కిలోమీటర్లుగా ఉంది.

మారుతి సుజుకి ఎస్ఎక్స్4

మారుతి సుజుకి ఎస్ఎక్స్4

మారుతి సుజుకి కంపెనీకి ఏదయినా అపజయం ఉందంటే అది ఎస్ఎక్స్4 అని చెప్పాలి, సి-సెగ్మెంట్లోకి విడుదలయిన ఈ సెడాన్ ఆశించిన స్థాయిలో విక్రయాలు సాధించలేదు. ధోని ఎంచుకున్న ఈ సెడాన్ పెట్రోల్, సిఎన్‌జి మరియు డీజల్ వంటి ఇంధన వేరియంట్లలో లభించేది.

మిత్సుబిషి అవుట్ ల్యాండర్

మిత్సుబిషి అవుట్ ల్యాండర్

గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్‌తో అత్యుత్తు పనితీరును కనబరిచే అవుట్ ల్యాండర్ ఎస్‌యువిని మిత్సుబిషి పెట్రోల్ వేరియంట్లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 170బిహెచ్‌‌పి పవర్ మరియు 226ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. స్పోర్టివ్ పనితీరు కోసం ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు.

మిత్సుబిషి పజేరో ఎస్ఎఫ్ఎక్స్

మిత్సుబిషి పజేరో ఎస్ఎఫ్ఎక్స్

దశాబ్దాల క్రితం మిత్సుబిషి సృష్టించిన సునామీలో పజేరో ఎస్‌‌యువి ఒకటి. ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన సమయం నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా విక్రయాలు జరపుతూనే ఉంది. పజేరో లోని 2.8-లీటర్ టుర్బో డీజల్ ఇంజన్ ప్రారంభంలో 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. అవసరాన్ని బట్టి ఇది 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించును.

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడి అందించిన క్రాసోవర్ ఎస్‌యువి క్యూ7. ధోని ఎంచుకున్న వాటిలో ఇదీ ఒకటి. ఇది 3-లీటర్ల సామర్థ్యం ఉనన వి6 మరియు 4.2-లీటర్ సామర్థ్యం గల వి8 డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభించును. ఈ అత్యాధునిక భద్రతా ఫీచర్లకు ఈ మోడల్ పేరుగాంచింది.

జిఎమ్‌సి సియెర్రా

జిఎమ్‌సి సియెర్రా

జిఎమ్‌సి సియెర్రా 3500హెచ్‌డి పికప్ ట్రక్కు అమెరికా యొక్క ఇకానిక్ మోడల్. అమెరికా నుండి ధోని దీనిని దిగుమతి చేసుకున్నాడు. ఇందులో 6.6-లీటర్ సామర్థ్యం గల వి8 టుర్బో డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 397బిహెచ్‌పి పవర్ మరియు 1,036ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ 2

ల్యాండ్ రోవర్ అందుబాటులోకి తెచ్చిన ఎంట్రీ లెవల్ ఎస్‌యువి ఫ్రీల్యాండర్2. ఆఫ్ రోడింగ్ మీద అద్బుతమైన పనితీరు కనబరచడంలో దీనికిదే సాటి. ల్యాండ్ రోవర్ దేశీయంగా మొదటి సారిగా అసెంబుల్ చేసిన ఎస్‌యువి ఫ్రీల్యాండర్2. ఐదు మంది కూర్చునే సామర్థ్యం గల ఇందులో 2.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఎస్‌డి4 టుర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 148బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రసిద్దిచెందిన ఎస్‌యువిలలో స్కార్పియో ఒకటి. ధృడమైన డ్రైవింహ్ స్వభావానికి ఇది పెట్టింది పేరు. మేడిన్ ఇండియా స్కార్పియో ఎస్‌యువిని ప్రస్తుత భారత ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అధికారిక వాహనంగా వినియోగించేవారు. 2007 లో మహీంద్రా ప్రత్యేకించి ధోని కోసం కస్టమ్ స్కారియోను నిర్మించింది. ఇందులో ఏడు సీట్లకు బదులుగా నాలుగు సీటింగ్ సామర్థ్యం ఉండే పైలటీ సీట్లతో నల్లటి రోల్ కేజ్ టాప్ బాడీని కలిగి ఉంది.

 టయోటా కరోలా ఆల్టిస్

టయోటా కరోలా ఆల్టిస్

ధోని తరచూ నిత్యావసరాలకు కరోలా ఆల్టిస్ ఉపయోగించే వాడు. ఇండియాలో వీటి వాడకం తక్కువే, కానీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు సాగించే వాటిలో ఇది ఒకటి. కరోలా ఆల్టిస్ పెట్రోల్ మరియు టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ వేరియంట్లో అందుబాటులో ఉంది. అందులో డీజల్ వేరియంట్ ఆల్టిస్ ను ధోని ఎంచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడానికి ముఖ్య కారణం గరిష్ట నాణ్యత మరియు తక్కువ నిర్వహణ ఖర్చు అని చెప్పవచ్చు.

యమహా ఎఫ్‌జడ్1

యమహా ఎఫ్‌జడ్1

ఇండియన్ పీపుల్స్ లీగ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటానికి చెన్నైకి వచ్చినపుడు ధోని ఇలా యమహా ఎఫ్‌జడ్1 బైకు మీద సరదాగా వెళ్లేవారు. ఇది ఎప్పుడు చెన్నైలోనే ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

సైకిల్

సైకిల్

కారు, మోటార్ సైకిల్ మరియు సైకిల్... ఇవీ ధోనీ ఇష్టమైన వాహనాలు. అన్నింటికన్నా ప్రతి రోజు గ్రౌండ్ కు మరియు వ్యాయామానికి సైకిల్ మీద వెళ్లడం అంటే ధోనికి మహా ఇష్టం....మరిన్ని సెలబ్రిటి కథనాల కోసం మరియు తెలుగులో నిరంతరం ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు.

ఎమ్ఎస్ ధోని వాహన ప్రపంచం

కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు దేశ వ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. బ్యాట్ పట్టడం మానేసినప్పటికీ ఇతనికి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కొన్ని కోట్ల మంది సచిన్‌ను ఎంతగానో అభిమానిస్తుంటే సచిన్ మాత్రమే ఒకరికి వీరాభిమాని. ఎవరో తెలుసా....?

ఎమ్ఎస్ ధోని వాహన ప్రపంచం

వీర బాధుడు బాదే విరాట్ కోహ్లి కార్ కలెక్షన్

టీమిండియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న విరాట్ కోహ్లి కార్ల గురించి మరియు కార్ల ఎంపిక పట్ల ఇతనికి ఉన్న మక్కువ గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఎమ్ఎస్ ధోని వాహన ప్రపంచం

అద్భుతమైన కార్లను కలిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ...

వెండి తెర ద్వారా తెలుగువారితో అత్యంత సాన్నిహిత్యం ఏర్పరచుకున్న అక్కినేని కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబానికి ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణించవచ్చు. అక్కినేని కుటుంబం యొక్క కార్ల కలెక్షన్ గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

Most Read Articles

English summary
Read In Telugu: Mahendra Singh Dhoni Car Bike Collections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X