ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

బ్రిటన్‌ రాణి 'ఎలిజబెత్‌ 2' మరణించిన విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే బ్రటిష్ రాజ లాంఛనాలతో 10 రోజులు సంతాపదినాలు జరిపి తరువాత అంత్యక్రియలు జరుపుతారు. అయితే 'ఎలిజిబెత్ 2' యొక్క అంతిమ యాత్రకు 'మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్' ఉపయోగించారు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

క్వీన్ ఎలిజిబెత్ 2 యొక్క అంతిమ యాత్రకు వినియోగించిన 'మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్' యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

ఎలిజిబెత్ 2 మరణించిన తరువాత బాల్మోరల్ నుంచి శవపేటికలో ఎడిన్‌బర్గ్ ప్యాలెస్‌కి తీసుకెళ్లారు. అది కూడా అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన ఒక ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారులో తరలించారు. దాదాపు 100 కిలోమీటర్ల మేర సాగే ఈ చివరి యాత్రలో రాణి మృతదేహాన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేశారు.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

నిజానికి క్వీన్ ఎలిజబెత్ II పార్థివ దేహానికి ప్రజలు నివాళులు అర్పించే అవకాశం కూడా కల్పిస్తారు. ఈమె 10 రోజుల జాతీయ సంతాప దినాలు తరువాత విండ్సర్ కాజిల్‌లోని క్వీన్ సెయింట్ జార్జ్ చాపెల్‌లో ఆమె తల్లిదండ్రులు, కింగ్ జార్జ్ VI, క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగాయి. ఎలిజబెల్ 2 అంత్యక్రియలు కూడా అక్కడే జరిగే అవకాశం ఉంది.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

క్వీన్ ఎలిజిబెత్ మృతదేహం రోడ్డుమార్గం గుండా వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయింది. అయితే ఈమె మృత దేహాన్ని రాజ కుటంబీకుల సంప్రదాయం ప్రకారం, కాలానుగుణ పువ్వులతో చేసిన పుష్పగుచ్ఛములతో శవపేటికను అలంకరించి తీసుకెళ్లారు. అయితే మృత దేహాన్ని తీసుకెళ్లిన కారు మాత్రం చాలా ప్రత్యేకమైనది, ఇలాంటి వాహనాలు కనిపించడం చాలా అరుదు.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

ఎలిజిబెత్ మృత దేహాన్ని తీసుకెళ్లడానికిగాను మెర్సిడెస్ బెంజ్ కంపెనీ అంత్యక్రియల కోసం ఒక ప్రత్యేకమైన వాహనం తయారు చేసింది. దీని కోసం మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్‌ ప్రీ-ప్రొటెక్షన్ కారును ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా మాడిఫై చేసింది. కావున దీనికి పెద్ద వీల్ బేస్ లభిస్తుంది. ఈ కారు మొత్తం పొడవు 5,999 మిమీ వరకు ఉంటుంది. ఇది E-క్లాస్ స్టేషన్ వ్యాగన్ S212 కంటే 1104 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

ఈ ప్రత్యేకమైన వెహికల్ పెద్ద వీల్ బేస్ కారణంగా, ముందు సీటు, వెనుక వైపు సీటు మాత్రమే కాకుండా వెనుకవైపు ఒక పెద్ద క్యాస్కేడ్ డెక్ కూడా లభిస్తుంది. ఈ కారు యొక్క వెనుక డోర్ ఎత్తు మాత్రం 750 మి.మీ వరకు ఉంటుంది, కావున వాహనం మొత్తం ఎత్తు 1920 మిమీ. ఇది సాధారణ వాహనాలకంటే కొడా 445 మిమీ ఎక్కువ పొడవు ఉంటుంది.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

సాధారణంగా మనం ఇది వరకు మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కేవలం ప్రయాణాలకు మాత్రమే లగ్జరీ కార్లను తాయారు చేస్తుందని అనుకున్నాం. అయితే 1950 లోనే బెంజ్ కంపెనీ బెంజ్ అంబులెన్సులు పుట్టుకొచ్చాయి. అయితే ఈ ఆధునిక కాలంలో కంపెనీ లగ్జరీ కార్లతో పాటు లగ్జరీ లిమోసిన్లు, అంబులెన్సులు మరియు అంత్యక్రియలకు ఉపయోగించే వాహనాలను తాయారు చేస్తోంది.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

క్వీన్ ఎలిజబెత్ 2 కి గత ఏడాది నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి, దీని కారణంగానే నడవడం, నిలబడటం కూడా కష్టంగా ఉండేది. అయితే ఇటీవల స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని బాల్మోరల్ ప్యాలెస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

ఎలిజబెత్‌-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్‌ ఛార్లెస్‌ ను బ్రిటన్ రాజుగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ - 3 పేరుతో కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే పట్టాభిషేకానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా రాజు లేదా రాణి మరణించిన 24 గంటల్లో వారసులను ప్రకటించాలి. ఇది రాజ కుటుంభం యొక్క నియమం.

ఎలిజబెత్‌ 2 అంతిమయాత్రకు ఉపయోగించిన ప్రత్యేకమైన మెర్సిడెస్ బెంజ్ కారు.. ఇదే

బ్రిటన్ లో రాజా కుటుంబీకులు మరణిస్తే వెస్ట్‌మిన్‌స్టర్ చర్చిలోని గంటను మోగించే సంప్రదాయం ఉంది. అంతే కాకుండా అంత్యక్రియల రోజున లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ కూడా మూసివెళాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, అయినా ఇది అక్కడి నిబంధన. అదే సమయంలో అంత్యక్రియలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కవర్ చేయడానికి బిబిసి మిగిలిన అన్ని కార్యక్రమాలను కూడా నిలిపివేస్తుంది.

Source: Drive

Most Read Articles

English summary
Mercedes e class hearse used to take queen elizabeth ii s coffin
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X