Just In
- 16 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
పర్వత శ్రేణుల్లో చంద్రబాబు కోడలు 'నారా బ్రాహ్మణి' బైక్ రైడింగ్.. వెలుగులోకి వచ్చిన అరుదైన ఘటన
నందమూరి బాలక్రిష్ణ కుమార్తె, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కోడలు 'నారా బ్రాహ్మణి' గురించి అందరికి తెలుసు. అటు తాతకు తగ్గ మానవరాలిగా అటు రాజకీయాలు, ఇటు సినీ నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో తనదైన శైలిలో దూసుకెళ్తోంది.
హెరిటేజ్ సంస్థ బాధ్యతలను అంకిత భావంతో చూసుకుంటూ వ్యాపార రంగంలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన నారా బ్రాహ్మిణిలో మరో టాలెంట్ కూడా ఉన్నట్లు ఇటీవల తెలిసిపోయింది. వ్యాపారరంగంలో మాత్రమే కాకుండా మంచి బైక్ రైడర్ గా కూడా ఇప్పుడు ఎంతో ఫెమస్ అయిపోయింది. ఇటీవల నారా బ్రాహ్మణి జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ - లడక్‌లో బైక్‌పై రైడ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బ్రాహ్మణి రైడ్ చేసిన బైక్ ఎల్లో కలర్ లో ఉంది. అయితే ఈమె ఎల్లో కలర్ బైక్ ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా.. లేదా అనేది ఖచ్చితంగా తెలియదు. సాధారణ బైకులకంటే ఎక్కువ బరువున్న ఈ బైకుని హ్యాండిల్ చేయడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
నారా లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణి వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల సమయంలో 'లోకేష్' తరపున మంగళగిరిలో ప్రచారం నిర్వహించింది. తండ్రి బాలక్రిష్ణతో కలిసి అప్పుడప్పుడు కొన్ని సినిమా ఫంక్షన్లకు కూడా హాజరవవుతూ ఉంటుంది. వీటితో పాటు ఇప్పుడు బైక్ రైడింగ్ చేస్తూ మరో కొత్త టాలెంట్ బయటపెట్టినందుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
నారా బ్రాహ్మణి తన టీమ్ తో కలిసి లేహ్ పర్వత శ్రేణుల మీదుగా బైక్ రైడ్ చేసింది. పర్వత శ్రేణి యొక్క అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ, బ్రహ్మణి కూడా ధ్యానం చేసింది. ఇక బ్రాహ్మణి రైడ్ చేసిన బైక్ విషయానికి వస్తే, ఇది 'యెజ్డీ స్క్రాంబ్లర్' అని తెలుస్తుంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మంచి డిజైన్, ఫీచర్స్ తో అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
యెజ్డీ స్క్రాంబ్లర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు. కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇచ్చి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ కలిగి.. రోడ్, రైన్ మరియు ఆఫ్-రోడ్ అనే మూడు ABS మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇది ముందువైపు 320మి.మీ డిస్క్, వెనుకవైపు 240మి.మీ డిస్క్ బ్రేకులు పొందుతుంది. ఇందులో USB టైప్-C మరియు స్టాండర్డ్ USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటాయి.
యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 28.7 బిహెచ్‌పి పవర్ మరియు 28.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్క్రాంబ్లర్‌లో ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉటుంది. కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. బైక్ రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
యెజ్డీ స్క్రాంబ్లర్ యొక్క ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్ మరియు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఈ బైక్ లో స్పీడో మీటర్ అనేది ఫ్రంట్ ఫోర్క్ పైన ఉంటుంది. ఇది బైక్ గురించిన చాలా సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది. మొత్తానికి నారా వారి కోడలు హిమాలయ అంచుల్లో తన ప్రతిభను చాటుకుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.