NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయబడింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో జాతీయ రహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. కేవలం గత రెండు నెలల్లో అంటే ఏప్రిల్ మరియు మే నెలలో దాదాపు 1,470 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగినట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గత ఏడాది జరిగిన రోడ్డు నిర్మాణంతో పోలిస్తే ఇప్పుడు జరిగిన రోడ్డు నిర్మాణం దాదాపు 73.5 శాతం ఎక్కువ అని తెలుస్తోంది. గత సంవత్సరం కూడా ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. రోడ్డు నిర్మాణ డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ మరియు మే మధ్య ఎన్‌హెచ్‌ఏఐ 847 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించినట్లు తెలిసింది.

NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

ఇది కాకుండా మరో 663 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు గత నెల చివరి నాటికి ఆమోదించడం జరిగింది. 2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరంలో, ఎన్‌హెచ్‌ఏఐ సుమారు 4,350 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసింది. 2021 మరియు 2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రదానం చేయబోయే హైవే ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

MOST READ:మహీంద్రా థార్ కొనుగోలుచేసి బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో తెలుసా?

NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సుమారు 50,000 కోట్ల రూపాయల విలువైన హైవే ప్రాజెక్టులకు ఎన్‌హెచ్‌ఏఐ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే అవకాశం ఉందని ఒక నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 13,394 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది.

NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది. ఎన్‌హెచ్‌ఏఐ గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున 37 కిలోమీటర్ల రోడ్లు నిర్మించింది. దీనితో ఒక రోజులో అత్యధిక దూరం రహదారిని నిర్మించిన రికార్డును కూడా కైవసం చేసుకుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; హీరో నిఖిల్‌కు రెండు చలాన్లు జారీ చేసిన పోలీసులు

NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

నివేదికల ప్రకారం 2014 మరియు 2015 లో రోజుకు సగటున 12 కిలోమీటర్ల చొప్పున రోడ్లు నిర్మించబడ్డాయి. అది కాస్త ప్రస్తుతం రోజుకు 37 కిలోమీటర్లకు పెరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ నాయకత్వంలో దేశంలో రోడ్ నెట్‌వర్క్‌ను చాలా వేగంగా అభివృద్ధి చేసింది.

NHAI కి కలిసొచ్చిన కరోనా లాక్‌డౌన్‌, ఎందుకో తెలుసా?

2021 సంవత్సరం ప్రారంభంలో, ఎన్‌హెచ్‌ఏఐ విజయ్ పూర్ మరియు సోలాపూర్ మధ్య 25.54 కిలోమీటర్ల సింగిల్ లేన్ రహదారిని ఎన్‌హెచ్‌ 52 లో కేవలం 18 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది.

MOST READ:మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

Most Read Articles

English summary
NHAI Builds 1470 Kms National Highway In April-May During Lockdown Details. Read in Telugu.
Story first published: Saturday, June 5, 2021, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X