మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ప్రముఖ వాహన తయారీ దారు మారుతి సుజుకి బ్రాండ్ యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన వాహనాలలో మారుతి ఆల్టో ప్రసిద్ధి చెందింది. ఈ కారు భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. మారుతి ఆల్టో తక్కువ ధర, తక్కువ నిర్వహణ వ్యయం, మరియు ఎక్కువ మైలేజ్ వంటివి కలిగి ఉండటం వల్ల ఇప్పటికి కూడా సామాన్య ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు.

మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ఇటీవల కాలంలో రోజు రోజుకి కొత్త వాహనాలు ఎక్కువగా భారత మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. కావున మారుతి ఆల్టో కారు ఊహించిన రీతిలో అమ్మకాలను సాగించలేకపోతోంది. ఎందుకంటే కార్లు కొనే కొత్త కస్టమర్లు లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న వాహనాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆల్టో కారు కూడా ఆశించిన లేటెస్ట్ ఫీచర్స్ అందుకోలేదు. ముఖ్యంగా మారుతి ఆల్టో కారులో సన్‌రూఫ్ అందించబడలేదు. ఇటీవల కాలంలో సన్ రూఫ్ ఉన్న కార్లకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా విడుదలైన ఒక వీడియోలో కనిపిస్తున్న ఒక మారుతి ఆల్టో కారుకి సన్ రూఫ్ ఉంది.

MOST READ:మహీంద్రా థార్ & ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్‌; ఇందులో విజేత ఎవరంటే?

మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

మారుతి ఆల్టో కారులో ఈ ఫీచర్ ఎలా వచ్చింది అని అనుమానం మీకు రావచ్చు. నిజానికి ఈ కారుకి ప్రత్యేకంగా సన్ రూఫ్ అమర్చబడింది. మాడిఫై చేయడం వల్ల ఈ ఫీచర్స్ ఇందులో ఉంది.

2012 లో కొనుగోలు చేసిన ఈ ఆల్టో కారుకి కారు యజమానులు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేశారు. అంతే కాకుండా ఈ కారుని చాలా లేటెస్ట్ గా అప్డేట్ చేశారు. ఈ కారు పొందిన అప్డేటెడ్ ఫీచర్స్ అన్ని మీరు ఇక్కడ వీడియోలో గమనించవచ్చు.

మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ వీడియోను 'ఇంజనీర్ సింగ్' అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆల్టో కారు 2012 కి చెందినది. కానీ ఇప్పుడు ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ముందు ప్యానెల్లు బ్లాక్ బంపర్ మరియు బోనెట్ లిప్స్ తో భర్తీ చేయబడ్డాయి.

MOST READ:తండ్రికి నచ్చిన బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన తనయుడు.. వాహ్ సూపర్

మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ కారులో ఉన్న హెడ్‌లైట్ల స్థానంలో ఫాగ్ లాంప్స్ మరియు రౌండ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి వీల్, న్యూ హ్యాండిల్, ఎయిర్ వెంట్ మరియు మడ్ గార్డ్లను ఏర్పాటు చేశారు. ఈ కారు యొక్క బయట మాత్రమే కాదు లోపలి భాగంలో కూడా ఎక్కువ మార్పులు జరిగాయి.

అప్డేటెడ్ ఫీచర కలిగిన ఈ కారు యొక్క లోపలి భాగంలో కూడా కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రేసింగ్ కార్లలో కనిపించే స్పార్కో స్టీరింగ్ వీల్, స్పీకర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ విత్ యాంప్లిఫైయర్ మరియు సబ్‌ వూఫర్ వంటివి ఉన్నాయి.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

మీకు తెలుసా.. ఈ మారుతి ఆల్టో కారుకి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ ఉంది.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ మారుతి ఆల్టో కారులో గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, ఇందులో ఉన్న ఇంజిన్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ కారులో 796 సిసి 3-సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 46.3 బిహెచ్‌పి పవర్ మరియు 62 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Image Courtesy: ENGINEER SINGH

Most Read Articles

English summary
Maruti Alto Modified With Electric Sunroof. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X