ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే పోలీసులను పట్టించి రూ. 1000 లు రివార్డ్ పొందండి

Written By:

సాధారణ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వారిని శిక్షంచడానికి అనే చట్టాలున్నాయి, సెక్షన్‌లున్నాయి, రకరకాల జరిమానాలు కూడా ఉన్నాయి. మరి మన సొసైటీలో భాగమై ఉండే పోలీసులు రూల్స్ అధిగమిస్తే
వారికి ఎలాంటి చట్టాలున్నాయి... అలాంటి వారిని ఎలా నియంత్రించాలి.... అందుకోసం రోహ్తక్ పట్టణంలో ఓ కొత్త రూల్ అమల్లోకి వచ్చింది.

మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే... ట్రాఫిక్ పోలీసులకు ముడుపులు చెల్లించుకోవడం, లేదంటే కేసు నమోదు చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ మన కళ్లెదుటే మనకు నీతులు చెప్పే అదికారులు రూల్స్ అతిక్రమిస్తే ఏదోలా ఉంటుంది కదూ...!

నిజమే ప్రజలకో నియమం... పోలీసులకో నియమం... ఉంటే బాగుండదు. కదా మొదటి వ్యవస్థ మారాలంటే ముందు మనం మారాలి. ఇందుకోసం రహదారి నియమాలను అతిక్రమించే పోలీసు అధికారుల మీద కొరడా జులిపించడానికి మన దేశంలో ఉన్న ఓ పట్టణ పోలీసు శాఖ సిద్దమయ్యింది.

ఈ నగరంలో పోలీసు లేదా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నపుడు మీ కంటపడితే ఓ ఫోటో కొట్టి పోలీసు అధికారి తెలిపిన ఫోన్ నెంబర్‌కు వాట్సాప్ చేస్తే, వాటిని పరిశీలించి తదుపరి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకుని ఫోటోలు పంపిన వారికి రూ. 1000 లు రివార్డును కూడా ఇవ్వనున్నారు.

రోహ్తక్ పట్టణ పోలీసు అధికారి ప్రారంభించిన వాట్సాప్ నెంబర్ 9996464100 కు పోలీసులు రహదారి నియమాలు ఉల్లంఘిస్తుండగా తీసిన ఫోటోలు మరియు వీడియోలను పంపించవచ్చు. ఇది ప్రధానంగా ఆ పట్టణంలోని పోలీసుల క్రమశిక్షణ మెరుగుపరచనుంది.

ఇందులో రోహ్తక్ పట్టణ ప్రజలు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముందుకు వచ్చి ఫోటోలు మరియు వీడియోలను నిరభ్యంతరంగా పైన తెలిపిన నెంబర్‌కు వాట్సాప్ చేయడం ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని సంభందిత అధికారి పేర్కొన్నారు.

ఇందులోని ప్రధాన అధికారి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే పోలీసుల ఫోటోలను వాట్సాప్ ద్వారా సెండ్ చేసినట్లు వెల్లడింటాడు.

వాహనాల మీద నెంబర్ ప్లేట్లు సరిగ్గా కనబడి మరియు ట్రాఫిక్ నియమాలను అతిక్రమించారని నిర్దారించుకుని వాటి అడ్రస్ ఆధారంగా ఇంటికి చలానా పంపినట్లు పేర్కొన్నాడు. వారం క్రితం ప్రారంభించిన దీనికి మంచి స్పందన లభిస్తోంది.

ఇదే వాట్సాప్ నెంబర్‌కు 50కి పైగా వీడియోలు మరియు ఫోటోలు వచ్చాయని, అయితే ఆధారాలు సరిగా లేనివి మరియు అసంబందితమైనవని తేల్చి వాటిని తొలగించినట్లు చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం వెనుక నుండి ఫోటోలు తీయడం ద్వారా నెంబర్ ప్లేట్లు క్లియర్‌గా లేవని తెలిపారు.

రోహ్తక్ పట్టణ ఎస్‌పి పంకజ్ నైన్ మాట్లాడుతూ, పోలీసులు ట్రాఫిక్ నియమాలను ఎందుకు పాటించరు అని ప్రజలు ప్రశ్నించకముందే, పోలీసులందరూ రహదారి నియమాలను విధిగా పాటించాలని సూచించారు.

ఏదేమయినప్పటికీ ఇది పోలీసుల పరువుకు సంభందించిన విషయం కాబట్టి ఇప్పుడు ఈ విన్నూత్న ఆలోచన అమలు పుణ్యమా అని ఒక్కొక్కరు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రారంభిస్తున్నారు.

ఇదే పద్దతిని మన పోలీసు వ్యవస్థ కూడా అమలుపరిస్తే బాగుటుంది కదూ....

English summary
Read in Telegu about get rs.1000 cash award for reporting on police violating traffic rules.
Please Wait while comments are loading...

Latest Photos