భారత్‌లో అమ్మకాలకు సిద్దమైన పిఏఎల్-వి ఫ్లయింగ్ కార్లు

Written By:

నేల మీద కార్ల తరహాలో తిరుగుతూ, నడవడానికి అసాధ్యమయ్యే ప్రాంతాల్లో పక్షిలా ఎగిరిపోయే వాహనాల గురించి సినిమాల్లోనో లేదంటే కార్టూన్లలో చూస్తుంటారు. వీటి మీద ప్రయోగాలు జరగకపోతే పురాణాల్లో కూడా కలిపేస్తారు. అయితే ఆ అవకాశం లేకుండా పిఏఎల్-వి వన్ సంస్థ నేల మీద నడుస్తూ అదే విధంగా గాలిలో ఎగరగలిగే వాహనాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఫ్లయింగ్ కార్లు

ఇద్దురు కూర్చుని ప్రయాణించే ఈ సాధనాన్ని హైబ్రిడ్ కారు మరియు గైరో ప్లేన్ లేదా వ్యక్తిగత గాలి మరియు నేల మీద ప్రయాణించే వాహనం అని కూడా పిలవచ్చు.

ఫ్లయింగ్ కార్లు

ఇండియాలో దీని విషయానికి వస్తే, డచ్ కు చెందిన తయారీదారులు పిఏఎల్-వి యూరోప్ ఎన్‌వి ఈ మూడు చక్రాలు గల ఫ్లయింగ్ కారుకు సంభందించి కలకత్తాలోని పేటెంట్ ఆఫీసులో పేటెంట్ హక్కులను పొందింది.

ఫ్లయింగ్ కార్లు

చూడానికి బైకు తరహాలో ఉన్నప్పటికీ సౌకర్యం పరంగా కారును పోలి ఉంటుంది, అయితే నేల మీద నడవడానికి మరియు గాలిలో ఎగరానికి అనుకూలంగా ఉండేందుకు అభివృద్ది చేసిన టిల్టింగ్ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.

ఫ్లయింగ్ కార్లు

దీనిని సాధారణ కారుగా వినియోగిస్తున్న సమయంలో గాలిలోకి ఎగరాలంటే, విమానం తరహాలో కొద్ది దూరం పాటు సమతలం మీద ప్రయాణించి నిర్ధిష్ట వేగం పొందిన తరువాత టేకాఫ్ చేస్తే గాలిలోకి చేరుకోవచ్చు. టేకాఫ్ కోసం ఇందులోని టచ్ ప్యాడ్ మీద టేకాఫ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

ఫ్లయింగ్ కార్లు

ఈ ఫ్లయింగ్ కారులో ఉన్న సింగల్ రోటార్ మరియు ప్రొపెల్లర్ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే విచ్చుకుంటుంది. ఆ తరువాత పూర్తి స్థాయిలో గాలిలో ఎగరడానికి అనుకూలంగా సిద్దమవుతుంది.

ఫ్లయింగ్ కార్లు

గాలిని ఉత్పత్తి చేయడం ప్రారంభించాక పిఏఎల్-వి వన్ ఫ్లయింగ్ కారు గరిష్టంగా 4,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఇది ఎయిర్ అన్‌కంట్రోల్డ్ (వాయు అనియంత్రిత) విజువల్ ఫ్లయిట్ రూల్స్ ట్రాఫిక్ విభాగంలోకి రావడం వలన వాణిజ్య విమానం తరహాలో అనుమతులు పొందాల్సి ఉంటుంది.

ఫ్లయింగ్ కార్లు

పిఏఎల్-వి వన్ ఫ్లయింగ్ కారులో ఫ్లయిట్ సర్టిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది నేల మరియు వాయు మార్గాలలో గరిష్టంగా గంటకు 180కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫ్లయింగ్ కార్లు

ఇది దాదాపు హెలికాఫ్టర్‌ను పోలి ఉంటుంది. నిర్మాణం పరంగా దాదాపు ఒకే ఆకృతిని పోలి ఉన్నప్పటికీ హెలికాఫ్టర్‌లోని మెయిన్ రోటార్‌తో పోల్చితే, ఇందులోని మెయిన్ రోటార్ యొక్క వేగం తక్కువగా ఉంటుంది.

ఫ్లయింగ్ కార్లు

ఇందులోని ఇంజన్ విఫలమయితే దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులోని గైరోప్లేన్ టెక్నాలజీ రోటార్‌ను తిప్పడానికి సహాయపడుతుంది. తద్వారా తక్కువ వేగం వద్ద ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చు.

ఫ్లయింగ్ కార్లు

పిఏఎల్-వి వన్ ఫ్లయింగ్ కారులో సీసముమిశ్రమ రహిత పెట్రోల్‌ను ఇంధనంగా వినియోగిస్తారు. గగన తలంలో ఉన్నప్పుడు గంటకు 28 లీటర్లు మరియు నేల మీద ఉన్నప్పుడు లీటర్‌కు 12కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ఫ్లయింగ్ కార్లు

పిఏఎల్-వి సంస్థ ఈ ఫ్లయింగ్ కార్లను 2018-19 మధ్య యురోప్‌లో డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిసింది. అంటే మరో రెండు మూడేళ్ల కాలంలో ఈ ఫ్లయింగ్ కార్లు ఇండియాను చేరనున్నాయి.

ఫ్లయింగ్ కార్లు

కేవలం ఐదు యూనిట్లను మాత్రమే ఇండియాలో అమ్మనున్నట్లు సంస్థ తెలిపింది. ఒక్కో యూనిట్ ధర సుమారుగా రూ. 4 కోట్ల రుపాయల వరకు ఉండనున్నట్లు అంచనా.

ఫ్లయింగ్ కార్లు

ఇది దేశీయంగా విడుదలవుతుందో ... ? లేదో ? అనే విశయం ఇంకా సందిగ్దంలో ఉనే ఉంది. ఏదేమయినా పిఏఎల్-వి ప్రతినిధులు వీటి విడుదల మీద కసరత్తులు మాత్రమే ఆపడం లేదు.

.

ఎస్‌యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా....? అయితే ఓ సారి ఈ వెహికల్‌ని గమనించండి

 
English summary
PAL-V Expected To Launch Its Flying Car In India By 2018 Files Patent
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark