బరాక్ ఒబామా విమానంలో ఏముందో చూసొద్దాం రండి..!

By Ravi

మనం నిన్నటి కథనంలో అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించే కారు (బీస్ట్) గురించి తెలుసుకున్నాం. కాగా.. ఈనాటి కథనంలో అమెరికా అధ్యక్షులు ఉపయోగించే అధ్యక్ష విమానం (ఎయిర్ ఫోర్స్ వన్) గురించి తెలుసుకుందాం రండి.

బరాక్ ఒబామా మరికొద్ది రోజుల్లో భారత్‌కు రానున్న సంగతి తెలిసినదే. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఒబామా భారత్‌కు రావటం ఇది రెండవ సారి. ఒబామా రాక నేపథ్యంలో, అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఆయన భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

సాధారణంగా అమెరికా అధ్యక్షులు ఏ దేశానికి వెళ్లినా, ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన విమానంలో వెళ్తుంటారు. నిజానికి ఎయిర్ ఫోర్స్ వన్ ఒక ఎగిరే వైట్ హౌస్ లాంటిదని చెప్పొచ్చు. ఈ విమానంలో ఉండే విలాసాలు, సౌకర్యాలు అన్నీ ఇన్నీ కావు.

అమెరికా అధ్యక్షుడిగా భాధ్యతలు స్వీకరించే వారికి మాత్రమే ఈ విమానం కేటాయిస్తారు. మరి అందులో విశేషాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

ఎయర్ ఫోర్స్ వన్

తర్వాతి స్లైడ్‌లలో అమెరికా అధ్యక్ష విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ఎయర్ ఫోర్స్ వన్

ఎయిర్ ఫోర్స్ వన్‌గా పిలిచే ఈ విమానం వాస్తవానికి ఓ 'బోయింగ్ 747-200బి' విమానం.

ఎయర్ ఫోర్స్ వన్

అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు ప్రయాణించే అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం యొక్క అధికారిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కాల్ సైన్‌ను (పిలిచే పేరును) ఎయిర్ ఫోర్స్ వన్ అంటారు. ఈ కాల్ సైన్‌ను 1953లో అప్పటి ప్రెసిడెంట్ ఎల్సెన్‌హోవర్ హయాంలో సృష్టించారు.

ఎయర్ ఫోర్స్ వన్

అధ్యక్షులు ఎక్కడి నుంచైనా సరే అమెరికాను పాలించే విధంగా, ఈ విమానంలో పూర్తిస్థాయి ఆఫీస్ సెటప్ ఉంటుంది. మొత్తం 87 టెలిఫోన్లు, 19 టెలివిజన్లతో కూడిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఇందులో జోడించారు.

ఎయర్ ఫోర్స్ వన్

ప్రెసిడెంట్ ఉపయోగిస్తున్న బీస్ట్ (కాడిలాక్) మాదిరిగానే ఈ ఎయిర్ ఫోర్స్ వన్ (బోయింగ్ 747-200బి) విమానాలు కూడా రెండు ఉంటాయి.

ఎయర్ ఫోర్స్ వన్

ఈ రెండు విమానాలలో, ఏ విమానంలో ప్రెసిడెంట్ వెళ్తున్నారనే విషయాన్ని కనుక్కోవటం కష్టం. ఆగంతకులను కన్ఫ్యూజ్ చేసేందుకు మార్గమధ్యంలో ఇవి అటూ ఇటూ మారుతూ వెళ్తాయట.

ఎయర్ ఫోర్స్ వన్

అమెరికా ప్రెసిడెంట్ ఎక్కిడికి వెళ్లినా ఆయనతో పాటుగా ఈ రెండు బోయింగ్ విమానాలు మరియు ఓ చార్టెడ్ జంబో జెట్ విమానం (ఆఫీస్ స్టాప్, సెక్యూరిటీ స్టాఫ్ కోసం) కూడా వెళ్తుంది.

ఎయర్ ఫోర్స్ వన్

ఎయిర్ ఫోర్స్ విమానంలో ఉండే కమ్యానికేషన్ సెంటర్ అత్యంత బలమైనది. దాదాపు 386 కిలోమీటర్ల మేర వైరింగ్ షీల్డ్‌తో రూపొందించబడిన ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ, న్యూక్లియర్ పేలుడు జరిగినా సరే సమర్థవంతంగా పనిచేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది.

ఎయర్ ఫోర్స్ వన్

ఈ విమానంలో ఓ ప్రత్యేక మెడికల్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఇందులో ఓ ఫోల్డవుట్ ఆపరేటింగ్ టేబుల్, ఎమర్జెన్సీ మెడికల్ సప్లయ్స్, తగినన్ని వైద్య పరికరాలు, ఔషదాలు అందుబాటులో ఉంటాయి. ప్రెసిడెంట్ ప్రైవేట్ ఆఫీస్ లేదా ఓవల్ ఆఫీస్ అబోర్డ్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఓ డాక్టర్, నర్స్ ఉంటారు.

ఎయర్ ఫోర్స్ వన్

విమానంలో కూర్చునే అమెరికా అధ్యక్షుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసే వెసలుబాటు కూడా ఈ విమానంలో ఉంటుంది.

ఎయర్ ఫోర్స్ వన్

ఈ విమానంలో ఓ కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది. ఇందులో ఓ పెద్ద ప్లాస్మా స్క్రీన్ టెలివిజన్ ఉంటుంది. టెలికాన్ఫరెన్సింగ్ కోసం ఈ స్క్రీన్‌ను ఉపయోగిస్తుంటారు.

ఎయర్ ఫోర్స్ వన్

ప్రెసిడెంట్ విశ్రాంతికి అవసరమైన సకల సదుపాయాలు ఇందులో ఉంటాయి. అలాగే, ఆయనకు ఆహారం సరఫరా చేసేందుకు ఇందులో తగిన ఏర్పాట్లు, వంటగదులు ఉంటాయి.

ఎయర్ ఫోర్స్ వన్

ఇక చివరగా.. ఇందులో డిఫెన్స్ సిస్టమ్ (భద్రతా వ్యవస్థ) కూడా ఉంటుంది. ఎదురుగా దూసుకువచ్చే మిస్సైళ్ల దారి మళ్లించేందుకు అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇందులో ఉంటుంది.

Most Read Articles

English summary
Barack Obama, the President of the United States will visit India during the Republic Day celebrations, as the Chief guest. He will travel to India in his Presidential flight, Air Force One. Let us look at a few facts about his flying fortress and what makes this aircraft unique.
Story first published: Wednesday, January 21, 2015, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X