TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హ్యాపీ బర్త్ డే బాషా! 1980 నుండి 2017 వరకు రజనీ కార్ కలెక్షన్
కోట్ల రూపాయల సిరి సంపదలు ఉన్నప్పటికీ అత్యంత సాదాసీదా వ్యక్తిగా జీవించడం మన సూపర్ స్టార్ రజనీకాంత్‌కే చెల్లుతుంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలోనే కాకుండా ప్రపంచ సినీ పరిశ్రమలో సైతం ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మన 'బాషా' నేటితో 67 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ సందేశాత్మక సినిమాల్లో నటించే మన 'శివాజి' ఓ సామాన్య బస్ కండక్టర్ నుండి తన కెరీర్‌ను ప్రారంభించి, నేడు యావత్ ప్రపంచం గుర్తించదగిన సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు.
రజనీకాంత్ తన హోదాతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ సామాన్య జీవితానికే ఇష్టపడే వాడు. అదే రజనీకాంత్ హోదాలో వేరే ఎవరైనా ఉండుంటే కోట్ల ఖరీదు చేసే కార్లలో సరదా సవారీలు చేస్తుండే వారు. సింప్లిసిటీకి అద్దం పట్టే మన రజనీకాంత్ తన జీవితంలో ఉపయోగించిన కార్లేంటో, వాటి కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
రజనీకాంత్ - ప్రీమియర్ పద్మిని
అప్పట్లో అత్యంత పాపులర్ అయిన ఫియట్ ప్రీమియర్ పద్మిని కారును రజనీకాంత్ 1980 నుంచి 1990 కాలంలో ఉపయోగించేవారు.
రజనీకాంత్ - అంబాసిడర్
అత్యంత సౌకర్యవంతమైన అంబాసిడర్ కారులో రజనీకాంత్ షూటింగ్‌లకు వెళ్లేవారు. ఈ కారును 1990-2000 కాలంలో ఉపయోగించారు.
రజనీకాంత్ - హోండా సివిక్
ఆ తర్వాతి కాలంలో రజనీకాంత్ ఓ హోండా సివిక్ కారును ఉపయోగించారు.
రజనీకాంత్ - ఇన్నోవా
ప్రస్తుతం రజనీకాంత్ ఓ టొయోటా ఇన్నోవా కారును ఉపయోగిస్తున్నారు.
రజనీకాంత్ - షారుఖ్ ఖాన్ - బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ షారుఖ్ ఖాన్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం రావన్‌లో గెస్ట్ రోల్ చేసినందకు గాను, రజనీకాంత్‌కు షారుఖ్ ఖాన్ ఓ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును కానుకగా ఆఫర్ చేశారు. అయితే, ఈ బహుమతి రజనీ స్వీకరించలేదని సమాచారం.
ఇప్పటి వరకు చూసిన కార్లలో అన్ని సర్వసాధారణమైనవే. వీటిలో ఒక్కటి కూడా లగ్జరీ కారు లేదు. ఇది ఆయన సింప్లిసిటీకి అద్దం పడుతుంది. అయితే, తమిళనాట రాజకీయల మీద ఆసక్తికనబరచిన రజనీకాంత్ ఈ ఏడాది ఓ సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు.
చెన్నైలో అభిమానులతో జరిగిన ఓ సదస్సుకు రతనీకాంత్ తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీలో వెళ్లాడు. సినీ, స్పోర్ట్స్ మరియు రాజకీయ రంగాలలో ఉన్న తారలు, ప్రముఖులు మరియు దిగ్గజ వ్యక్తులు అత్యధికంగా ఇష్టపడే లగ్జరీ ఎస్‌యూవీలలో ఎక్స్5 ఒకటి. భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్‌కు ఈ కారంటే ఎంతో ఇష్టం.
బవేరియన్ మోటార్ వర్క్స్(BMW) ఈ ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీని విభిన్న వేరియంట్లలో రూ. 67.90 లక్షల నుండి 79.90 లక్షల మధ్య శ్రేణిలో ఎక్స్-షోరూమ్ ధరతో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచింది.
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని ప్రత్యేకంగా ఎమ్ స్పోర్ట్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంచింది. దీని ధర రూ. 1.8 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇదే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5ఎమ్ సచిన్ వద్ద. అయితే రజనీ రెగ్యులర్ వెర్షన్ ఎక్స్5 ఎంచుకున్నారు.
సాకేతికంగా కూడా బిఎమ్‌డబ్ల్యూ శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉంది. ఇందులో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న 6-సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 258బిహెచ్‌పి పవర్ మరియు 580ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.
5 మరియు 7 మంది కూర్చునే సీటింగ్ లేఔట్ ఆప్షన్‌లలో లభించే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5లో పానరోమిక్ సన్ రూఫ్ కలదు. రజనీకాంత్ గారు ఈ సన్ రూఫ్ నుండే అభిమానులకు అభివాదం చేశారు.ఇంపీరియర్ బ్లూ కలర్‌లో ఎక్స్5 సూపర్ స్టార్ గారికి ఖచ్చితంగా సరిపోయిందని చెప్పవచ్చు. అయితే గతంలో రజనీ గారు తరచూ టయోటా ఇన్నోవా వాహనాన్ని మాత్రమే వినియోగించేవాడు.
రజనీకాంత్ నటించిన రోబో 2.0 అతి త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. అంతే కాకుండా సూపర్ స్టార్ తమిళ రాజకీయ ప్రవేశంపై కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఉత్తర మరియు దక్షిణాదిలో అశేషమైన అభిమానుల్ని సొంతం చేసుకున్న రజనీ గారికి డ్రైవ్‌స్పార్క్ బృందం హృయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.