జీవితంలో చూసిన తీరాల్సిన రోడ్లు మరియు బ్రిడ్జ్‌లు

Posted By: Staff
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

రోడ్లపై లాంగ్ రైడ్ చేస్తూ, చుట్టు పక్కల ఉన్న ప్రకృతిని తనివితీరా ఆస్వాదిస్తూ ముందు సాగిపోతుంటే, ఆ అనుభూతిని చెప్పడానికి మాటలు చాలవు. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఈ రకమైన అనుభూతికి లోనై ఉంటారు. ఈ రోడ్లు ప్రకృతి అందాలను మన కళ్ల ముందుంచుతాయి. ఈ రోడ్లలో సాధారణ రోడ్లు (మనం నిత్యం ప్రయాణించే సిటీ రోడ్ల వంటివి) ఉంటాయి, అలాగే అసాధారణ రోడ్లు కూడా ఉంటాయి.

ఇవి సాధారణ రోడ్ల కంటే భిన్నంగా ఉండి, మనకు ఓ మర్చిపోలేని ప్రయాణ అనుభూతిని కల్పిస్తాయి. అలాంటి అసాధారణ రోడ్ల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే అద్భుతమైన రోడ్లు, బ్రిడ్జ్‌ల యొక్క అందాలు మరియు వాటి విశేషాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మిల్లావ్ వయాడక్ట్ - ఫ్రాన్స్

మిల్లావ్ వయాడక్ట్ - ఫ్రాన్స్

ఇది ప్రపంచంలో కెల్లా అతి పొడవైన బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నేలపై నుంచి 343.0 మీటర్ల (సుమారు 1125 అడుగుల) ఎత్తులో ఉంటుంది. ఇది కేవలం ప్రపంచంలో కెల్లా పొడవైన బ్రిడ్జ్ మాత్రమే కాకుండా, ప్రపంచంలో కెల్లా 12వ అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ కూడా.

అట్లాంటింక్ రోడ్ బ్రిడ్జ్ - నార్వే

అట్లాంటింక్ రోడ్ బ్రిడ్జ్ - నార్వే

ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తుంటే అనుక్షణం ఓ కొత్త అనుభూతి, అలాగే కొద్ది గుండె అలజడి కూడా కలుగుతుంది. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న చిన్న చిన్న ద్వీప కల్పాలను కలుపుతూ నిర్మిణించి ఈ రోడ్ బ్రిడ్జ్ ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. హారికేన్ వంటి పెను తుఫానులు సంభివించినప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణం కాస్తంత భయాందోళనను కలిగిస్తుంది.

డాన్‌యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ - చైనా

డాన్‌యాంగ్-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ - చైనా

ఇది కూడా ప్రపంచంలో కెల్లా అతిపొడవైన బ్రిడ్జ్‌లలో ఒకటి. దీని మొత్తం పొడవు 164.8 కిలోమీటర్లు (వామ్మో అంత పొడవు బ్రిడ్జా..). ఇది చైనాలో ఉంది.

సిదు రివర్ బ్రిడ్జ్ - చైనా

సిదు రివర్ బ్రిడ్జ్ - చైనా

ప్రపంచంలో కెల్లా ఎత్తైన బ్రిడ్జ్‌లలో సిదు రివర్ బ్రిడ్జ్ కూడా ఒకటి. దాదాపు అర్థ కిలోమీటర్ (1600 అడుగుల) లోతున్న బ్రిడ్జ్ పైనుంచి రోడ్డు దాటుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ బ్రిడ్జ్‌పై ప్రయాణిస్తుంటే ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ బ్రిడ్జ్ పొడవు 1222 మీటర్లు.

భారతదేశంలో ఉండే కొన్ని ప్రముఖ బ్రిడ్జ్‌లు

భారతదేశంలో ఉండే కొన్ని ప్రముఖ బ్రిడ్జ్‌లు

Bandra-Worli Sea Link

బాంద్రా-వోర్లీ సీ లింక్ - ముంబై

ముంబైలో ఉండే బ్రిడ్జ్ సముద్రంపై నిర్మించబడినది. అయితే, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన లేదా ఎత్తైన బ్రిడ్జ్ కాకపోయినప్పటికీ, భారతదేశంలో మాత్రం ఇది అతిపొడవైన బ్రిడ్జ్. ఈ అందమైన బ్రిడ్జ్ మొత్తం పొడవు 5.6 కిలోమీటర్లు.

భారతదేశంలో ఉండే కొన్ని ప్రముఖ బ్రిడ్జ్‌లు

భారతదేశంలో ఉండే కొన్ని ప్రముఖ బ్రిడ్జ్‌లు

Kolia Bhomora Setu

కోలియా భోమోరా సేతు

అస్సామ్‌లోని తేజ్‌పూర్‌లో ఉన్న బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన ఈ కోలియా భోమోరా సేతు బ్రిడ్జ్ ఉత్తరాది, దక్షిణాధి ప్రాంతాలను కలపుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

హెవెన్ లింకింగ్ అవెన్యూ - హునాన్ ప్రావీన్స్, చైనా

హెవెన్ లింకింగ్ అవెన్యూ - హునాన్ ప్రావీన్స్, చైనా

పేరుకు తగినట్లుగానే ఈ రోడ్డుపై ప్రయాణం స్వర్గానుభూతిని కల్పిస్తుంది. ఈ రోడ్డు మొత్తంలో 99 మలుపులు ఉంటాయి. ఇందులో 9 అంకె స్వర్గంలో ఉండే 9 సెక్షన్లను సూచిస్తుంది, అందుకే చైనీయులు దీనిని తమ లక్కీ నెంబర్‌గా భావిస్తారు. వంపులు తిరిగిన ఈ రోడ్డు కొండ పై భాగంలో టియాన్‌మెన్ గుహకు చేరుతుంది.

యూ.ఎస్. హైవే 50 - అమెరికా

యూ.ఎస్. హైవే 50 - అమెరికా

అమెరికాలోని ఈ యూ.ఎస్. హైవే 50 రోడ్డు దేశంలో పశ్చిమ తూర్పు తీరాలను కలుపుతుంది. ఈ హైవే అట్లాంటిక్ తీరంలోని మేరీల్యాండ్ వద్ద ఉండే ఓషన్ సిటీ నుండి ప్రారంభమై పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా వద్ద ఉన్న సాక్రమెంటో వద్ద ముగుస్తుంది. ఈ హైవే మొత్తం పొడవు 4800 కిలోమీటర్లు.

ట్రోల్‌స్టిగెన్ - నార్వే

ట్రోల్‌స్టిగెన్ - నార్వే

నార్వేలో ఉండే ఈ టోల్‌స్టిగెన్ అత్యంత ప్రజాదరణ పొందిన టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. 850 మీటర్ల ఎత్తులో ఉండే ఈ రోడ్డు మధ్యలో స్టిగ్‌ఫోస్సెన్ జలపాతం అడ్డు వస్తుంది. ఈ రోడ్డుపై ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతి.

స్పగెట్టి బౌల్ - హౌస్టన్, టెక్సాస్

స్పగెట్టి బౌల్ - హౌస్టన్, టెక్సాస్

గజిబిజిగా ఉండే ఈ రోడ్డు టెక్సాస్‌లో ఉంది. ఈ రోడ్డుపై పొరపాటున రాంగ్ రూట్ తీసుకుంటే, కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరైన రూట్‌కు రావల్సి ఉంటుంది.

డాడెస్ జార్జ్ రోడ్ - మొరాకో

డాడెస్ జార్జ్ రోడ్ - మొరాకో

మొరాకోలోని అట్లాస్ మౌంటైన్స్‌లో ఉన్న డాడెస్ జార్జ్ అత్యంత ప్రాచుర్యమైన టూరిస్ట్ ప్రదేశం. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు అగ్నిపర్వతం నుండి బద్ధలై బయటకు వచ్చిన రాళ్ల అందాలను చూడొచ్చు.

జెబెల్ హఫీట్ మౌంటైన్ రోడ్ - యూఏఈ

జెబెల్ హఫీట్ మౌంటైన్ రోడ్ - యూఏఈ

మొత్తం 11.7 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రోడ్డు నేల మట్టం నుంచి 1219 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ రోడ్డు మొత్తంలో 22 మలుపులు ఉంటాయి. ఇది త్రీలైన్ రోడ్. ఇందులో రెండు లైన్లు పైకి వెళ్లడానికి, ఒక లైను క్రింది వెళ్లడానికి ఉంటాయి.

ట్రాన్స్‌ఫగరసన్ హైవే - రోమానియా

ట్రాన్స్‌ఫగరసన్ హైవే - రోమానియా

ఈ రోడ్డును 1970లో రోమానియా బలగాల కోసం నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్ బెస్ట్ డ్రైవింగ్ రోడ్లలో ఒకటిగా ఉంది. ఈ రోడ్ రేసింగ్ సర్క్యూట్‌ను తలపిస్తుంది.

చాకల్టయా లా పాజ్ - బోల్వియా

చాకల్టయా లా పాజ్ - బోల్వియా

చాకల్టయా మౌంటైన్ 5421 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ స్కై రిసార్టులు బాగా పాపులర్. మట్టిరోడ్డు ప్రయాణం ఓ కొత్త అనుభూతిని కల్పిస్తుంది.

స్టెల్వియో పాస్ - ఇటలీ

స్టెల్వియో పాస్ - ఇటలీ

మట్టి రోడ్డు నుంచి మంచు రోడ్డుకు వస్తే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రోడ్డు ఇటలీలో ఉంది. ఈ రోడ్డుపై దాదాపు 60 మలుపులు ఉన్నాయి. శీతకాల సమయంలో ఈ రోడ్లు మంచుతో కప్పబడి ఉంటాయి.

యుంగాస్ రోడ్ - బోల్వియా

యుంగాస్ రోడ్ - బోల్వియా

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో యుంగాస్ రోడ్ కూడా ఒకటి. ఈ రోడ్డుపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగాను అలాగే ఉత్సాహభరితంగాను ఉంటుంది.

హిందుస్థాన్ టిబెట్ హైవే

హిందుస్థాన్ టిబెట్ హైవే

480 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రోడ్డు షిమ్లాను దాటుకొని టిబెట్ చేరుకుంటుంది. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న షిమ్లా అందాలను ఆస్వాదించవచ్చు.

గౌలియాంగ్ టన్నెల్ - చైనా

గౌలియాంగ్ టన్నెల్ - చైనా

చైనాలో కొండను తొలచి రోడ్డుగా మలచారు. ఇది సొరంగాలతో కూడిన రోడ్డు. ఈ సొరంగం 1200 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఈ సొరంగాన్ని స్థానిక గ్రామస్తులే ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా, చేతుల్తో తవ్వారు. ఈ సొరంగం 5 మీటర్ల ఎత్తును, 4 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఈ టన్నల్‌లో గాలి వచ్చేందుకు గాను అక్కడక్కడా రంథ్రాలు ఏర్పాటు చేశారు.

హాక్స్ నెస్ట్ - న్యూయార్క్

హాక్స్ నెస్ట్ - న్యూయార్క్

ప్రకృతి అందాలను ఆస్వాధించాలంటే హాక్స్ నెస్ట్ రోడ్డుపై ప్రయాణించాల్సిందే. పేరుకు తగినట్లుగానే ఈ రోడ్డుకు చుట్టుపక్కల పక్షలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ రోడ్డుపై వేగపరిమితిని విధించారు. ఈ రోడ్డుపై గంటకు 55 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించకూడదు.

టరోకో గోర్జ్ - తైవాన్

టరోకో గోర్జ్ - తైవాన్

లాంబార్డ్ స్ట్రీట్ - శాన్ ఫ్రాన్సిస్కో

లాంబార్డ్ స్ట్రీట్ - శాన్ ఫ్రాన్సిస్కో

వోల్కానోస్ నేషనల్ పార్క్ రోడ్ - హవాయ్

వోల్కానోస్ నేషనల్ పార్క్ రోడ్ - హవాయ్

వ్రోంటాడోస్ ఛియోస్ ఐల్యాండ్ - గ్రీస్

వ్రోంటాడోస్ ఛియోస్ ఐల్యాండ్ - గ్రీస్

కేన్యోల్యాండ్స్ నేషనల్ పార్క్ - మోబ్, ఉతాహ్

కేన్యోల్యాండ్స్ నేషనల్ పార్క్ - మోబ్, ఉతాహ్

వయా క్రుప్ కాప్రి - ఇటలీ

వయా క్రుప్ కాప్రి - ఇటలీ

English summary
You could be a travel junkie or otherwise. You could be travelling for fun or on some business. But a ride or a drive is always made enjoyable if the road you are travelling in is exciting. Following is a list of some of the world's most craziest roads and bridges which we think everyone should experience before they die. Some of the roads are beautiful and others are outright scary. Sit back and start clicking through the slides.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark