మీరు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అయితే... ఆయన చెప్పిన మాటలు వినాల్సిందే!!

Posted By:

మనం అతిగా అభిమానించే వ్యక్తి తారసపడితే, మన పలుకరింపును ఆయన గమనించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. అచ్చం ఇలాంటి సంఘటననే సచిన్ ఆయన అభిమానుల నుండి ఎదుర్కొన్నాడు. అయితే వారు హెల్మెట్ ధరించకపోవడంతో హితభోద కూడా చేసారు. అతి తక్కువ కాలంలో చిత్రీకరించిన ఆ వీడియోలో సచిన ఏం మాట్లాడారో చూద్దాం రండి...

హెల్మెట్ ధరించమని ఫ్యాన్స్‌ను కోరుతున్న సచిన్

మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, ఆయన్ని ఎవరు చూసినా ఇట్టే గుర్తుపడతారు. సచిన్ కారులో ప్రయాణిస్తున్నపుడు ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగారు. దీనిని గమనించిన ఇద్దరు కుర్రాళ్లు అయనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు.

హెల్మెట్ ధరించమని ఫ్యాన్స్‌ను కోరుతున్న సచిన్

అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ అందుకు అంగీకరించి, ఈసారి ఎప్పుడైనా బైకు నడిపితే తప్పకుండా హెల్మెట్ ధరించమని కోరాడు. ఇందుకు వారి వద్ద నుండి మాట కూడా తీసుకున్నాడు. తప్పకుండా హెల్మెట్ ధరిస్తామని ప్రామిస్ చేసి మొత్తానికి సచిన్‌తో సెల్ఫీ దిగారు.

హెల్మెట్ ధరించమని ఫ్యాన్స్‌ను కోరుతున్న సచిన్

ఆ కుర్రాళ్ల తరువాత సచిన్‌ను పలుకరించే అందరికీ హెల్మెట్ ధరించమని, సురక్షితంగా డ్రైవ్ చేయమని కోరాడు. కారులో సచిన్ ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ మొత్తాన్ని వీడియో తీస్తే, సచిన్ గారు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

మన సురక్షితమైన ప్రయాణం గురించి ఇతరు మాట ఇప్పించుకోవాలా...?

మన సురక్షితమైన ప్రయాణం గురించి ఇతరు మాట ఇప్పించుకోవాలా...?

మన అభిమాన వ్యక్తి తారసపడితే ఆనందంగా మాట్లాడాల్సిన సమయంలో మన ప్రయాణం గురించి ఆయన సురక్షితమైన ప్రయాణానికి సంభందించిన సూచనలు చెప్పించుకోవాలా....? టూ వీలర్ నడిపేవారికి అతి సాధారణ సేప్టీ అంశం హెల్మెట్. పోలీసులు, ప్రభుత్వంతో పాటు సెలబ్రిటీలతో కూడా చెప్పించుకోవాల్సి వస్తోంది. ఎవరో చెప్పారని కాకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి.

హెల్మెట్ ధరించమని ఫ్యాన్స్‌ను కోరుతున్న సచిన్

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ద్వారా 40 శాతానికి పైగా టూ వీలర్ ప్రయాణికుల తలకు గాయాలవుతున్నాయి. ఒక్క 2015 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

హెల్మెట్ ధరించమని ఫ్యాన్స్‌ను కోరుతున్న సచిన్

హెల్మెట్ వినియోగం మరియు రహదారి భద్రత నియమాలను పాటించడం గురించి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించినా ఎలాంటి మార్పు చోటుచేసుకేలేదు. కనీసం సచిన్ చెప్పిన మాటలు కొందరయినా ఫోలో అవుతారని ఆశిద్దాం.

హెల్మెట్ ఖచ్చితంగా ధరించమని సచిన్ అభిమానులను కోరుతున్న వీడియోను వీక్షించగలరు...

 

English summary
Also Read In Telugu Sachin Tendulkar Stops And Urges His Fans To Wear Helmet

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark