లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా వచ్చిన సౌదీ బిలియనీర్

By Anil

సౌదీ ఈ పేరు వినగానే ఎంతో మందికి భూలోక స్వర్గం గుర్తోస్తుంది. అక్కడ డబ్బులు వరదలై పొంగుతుంటాయి. ఇక అక్కడి నివాసితులు అయితే ఏకంగా బంగారు కార్లలో ప్రయాణిస్తుంటారు. అచ్చం ఇలాగే ఒక సౌదీ బిలియనీర్ అత్యంత ఖరీదైన బంగారు కార్లలో లండన్‌కు పయనయ్యాడు

అత్యంత ఖరీదైన బంగారపు కార్లలో రోడ్ల మీద వెలుతుంటే అటుగా వెళులుతున్న లండన్ వాసులు చూసి అశ్చర్యపోవడం వారి వంతయ్యింది. అయితే దీని గురించి ఇంగ్లాడుకు చెందన వార్తా పత్రిక కథనం ప్రచురించింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బిలియనీర్ల కోరికలు

బిలియనీర్ల కోరికలు

మామూలుగా మనకు సాధారణ సమస్యలు తీరితే చాలు అనుకుంటాం. కాని సౌదీ బిలియనీర్లు ఇలా కాదు వారు ప్రతి ఏడాది కూడా లండన్ టూర్‌కు వెళ్లాలనుకుంటారు. అయితే సాధారాణ ట్యాక్సీలలో కాకుండా వారి సొంత కార్లలో వెలుతుంటారు.

యువ బిలియనీర్

యువ బిలియనీర్

అందరిలాగే సౌదీకి చెందిన ఒక బిలియనీరు తన మిత్రులతో లండన్ పర్యటనకు వచ్చాడు. అయితే ఇతను వయస్సు మళ్లిన వ్యక్తి కాదు కనీసం రెండు పదుల వయస్సు కూడా నిండని యువ బిలియనీర్ అని ఇంగ్లాడుకు చెందిన పత్రిక తెలిపింది. మరియు ఇతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు అని తెలిసింది.

స్వంతహాగా ఇంగ్లాండుకు

స్వంతహాగా ఇంగ్లాండుకు

ఈ యువ బిలియనీర్ మరియు ఇతని మిత్రులు కలిసి స్వతహాగా ఇంగ్లాండు పర్యాటనకు ఈ కార్లను తీసుకు వచ్చారు. మరియు అన్ని కార్లు కూడా ఒకే రంగుకు చెందిన వినైల్ పూత పూయబడి ఉన్నాయి.

ఊరేగింపుగా

ఊరేగింపుగా

యువ బిలియనీరు చుట్టూ తన మిత్రులు బంగారు రంగు కార్లలో వస్తుండగా ఇతను వీటి మధ్య ఊరేగింపుగా లండన్ వీధుల్లో తిరిగాడాడు.

బెండ్ ఎస్‌యువి మల్టీ యాక్సిల్స్‌తో

బెండ్ ఎస్‌యువి మల్టీ యాక్సిల్స్‌తో

ఇతను మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన జి 63 ఏఎమ్‌జి మల్టీ యాక్సిల్ ఎస్‌యువి వాహనాన్ని కలిగి ఉన్నాడు. బంగారపు రంగు గల వినైల్‌తో పూత పూయబడిన ఈ వాహనం సౌదీ ఎడారుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

బెంజ్ ఎస్‌యువి వివరాలు

బెంజ్ ఎస్‌యువి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ వారి జి 63 ఏఎమ్‌జి ఎస్‌యువిలో 5.5-లీటర్ కెపాసిటి గల వి-8 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 536 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని వి-8 ఇంజన్ 7 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది.

బెంజ్ ఎస్‌యువి ధర వివరాలు

బెంజ్ ఎస్‌యువి ధర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ వారి జి 63 ఏఎమ్‌జి ఎస్‌యువి యొక్క ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 2.17 కోట్లు భారతీయ రుపాయల్లో. దీనిని మెర్సిడెస్ బెంజ్ తమ ఆస్ట్రేలియా ప్లాంటు నుండి ఉత్పత్తి చేసింది.

రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కూపే

రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కూపే

యువ బిలియనీర్ వద్ద ఖరీదైన లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్‌కు చెందిన రెండు డోర్లు గల రోల్స్ రాయిస్ ఫాంటమ్ మోడల్ కారు కలదు. విలాసవంతమైన సౌకర్యాల కోసం దీనిని ఎన్నో ఆధునిక ఫీచర్ల మేళవింపుతో ప్రత్యేకంగా రూపొందించుకున్నాడు.

రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కూపే ప్రత్యేకతలు

రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కూపే ప్రత్యేకతలు

రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కారులో 6.75 లీటర్ కెపాసిటి గల వి-12 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 453 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసందానం చేశారు. ఇది అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఇండియన్ రుపాయల్లో దీని ఎక్స్ షోరూమ్ ధర 5 కోట్ల రుపాయలుగా ఉంది.

ల్యాంబోర్గిని అవెంతడోర్ ఎస్‌వి

ల్యాంబోర్గిని అవెంతడోర్ ఎస్‌వి

ల్యాంబోర్గిని అవెంతడోర్ మోడల్‌లో సూపర్ వెలాస్ అనే వేరియంట్ కలదు. యువతకు ఇదంటే ఎంతో ఇష్టం. అందకోసమే కాబోలు సౌదీకి చెందిన ఈ యువ బిలియనీర్ ఈ అవెంతడోర్ సూపర్ వెలాస్ కారుని లండన్ వీధుల్లో తిప్పుతూ తెగ సంతోషిస్తున్నాడు.

ల్యాంబోర్గిని అవెంతడోర్ సూపర్ వెలాస్ గురించి

ల్యాంబోర్గిని అవెంతడోర్ సూపర్ వెలాస్ గురించి

సాధారణం అవెంతడోర్ కారు కన్నా ఈ అవెంతడోర్ సూపర్ వెలాస్ కారు ఎంతో శక్తివంతమైనది. ఇందులో 6.5-లీటర్ కెపాసిటి గల వి-12 ఇంజన్ కలదు. ఈ ఇంజన్ దాదాపుగా 700 బిహెచ్‌పి పవర్ మరియు 690 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అనుసంధానించారు.

ల్యాంబోర్గిని అవెంతడోర్ సూపర్ వెలాస్ ధర వివరాలు

ల్యాంబోర్గిని అవెంతడోర్ సూపర్ వెలాస్ ధర వివరాలు

ల్యాంబోర్గిని అవెంతడోర్ సూపర్ వెలాస్ కారు యొక్క ధర మన ఇండియన్ రుపాయల్లో అయితే రూ. 6 కోట్లు ఎక్స్ షోరూమ్ గా ఉంది. ఈ కారు కేవలం 2.9-సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లుగా ఉంది.

 బెంట్లీ లగ్జరీ కారు

బెంట్లీ లగ్జరీ కారు

బంగారు రంగులో దగదగా మెరిసిపోతున్న బెంట్లీ కారుని చూసి చాలా మంది లండన్ వాసులు అవాక్కయ్యారు. దీనిని సంస్థ రూపొందించిన తరువాత ప్రత్యేకంగా అన్ని ఆధునిక హంగులతో కస్టమైజ్ చేయించుకున్నాడు ఈ సౌదీ యువ బిలియనీర్.

బెంట్లీ ఇంజన్ వివరాలు

బెంట్లీ ఇంజన్ వివరాలు

బెంట్లీ సంస్థ ఈ కారులో 6.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 616 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును. ఈ కారు లీటర్ 8 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు.

బెంట్లీ ధర వివరాలు

బెంట్లీ ధర వివరాలు

దీని ధర సుమారుగా 4.5 కోట్లు రుపాయలు ఎక్స్ షోరూమ్‌గా ఉంది. ఇది కేవలం 4.8 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అదే విధంగా దీని గరిష్ట వేగం గంటకు 322 కిలోమీటర్లుగా ఉంది.

పబ్లిక్ న్యూసెన్స్

పబ్లిక్ న్యూసెన్స్

ప్రతి ఏడాది కూడా సౌదీ నుండి చాలా మంది బిలియనీర్లు అత్యంత ఖరీదైన, అరుదైన మరియు లగ్జరీ కార్లలో లండన్ టూర్‌కు తీసుకు వస్తారు. అందు వలన లండన్‌లోని ప్రజానీకానికి వీరి చేష్టలు ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. అక్కడి ప్రజలు ఇటువంటి వారి మీద తమ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంధర్బాలు కూడా చాలా ఉన్నాయి.

జరిమానాలు

జరిమానాలు

ఇతర దేశాలు నుండి లండన్‌ పర్యటనకు తమ స్వంత కార్లలో వచ్చే విదేశీయులకు లండన్ ప్రభుత్వం భారీ స్థాయిలో జరిమానాలు విధించిన సంధర్బాలు కూడా ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ మరియు పబ్లిక్‌కు ఇబ్బంది కలిగించడం వంటి కారణాలు వలన గరిష్టంగా 1000 పౌండ్ల వరకు జరిమానాలు విధిస్తారు.

 లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా వచ్చిన సౌదీ బిలియనీర్
  • 7000 కార్లను కలిగి ఉన్న అత్యంత సంపన్నుడు సుల్తాన్ ఆఫ్ బ్రునెయి

Most Read Articles

English summary
Saudi Billionaire Arrives London With Four Gold Colour Cars
Story first published: Thursday, March 31, 2016, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X