YouTube

ఎందుకు సీజ్ చేశారో తెలియదు.. ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ.. కానీ ఇప్పుడు..

దుబాయ్ వంటి దేశాలలో ఖరీదైన వాహనాలను చెత్తలో పడేయటాన్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, మనదేశంలో మాత్రం చెత్తలో పడి ఉన్న వాహనాన్ని కూడా కొత్తగా మార్చేస్తుంటారు. కేరళలో గడచిన ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఓ అరుదైన డుకాటీ బైక్‌ను ఓ యువకుడు ఎన్నో కష్టాల తర్వాత తిరిగి దానిని కొత్త దానిలా మార్చగలిగాడు. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

ఇటాలియన్ సూపర్ బైక్ బ్రాండ్ డ్యుకాటి అందించిన అత్యుత్తమైన టూవీలర్లలో 1098 ఎస్ ట్రైకలర్ (Ducati 1098 S Tricolore) మోడల్ కూడా ఒకటి. అంతేకాదు, డ్యుకాటి తయారు చేసిన అత్యంత అరుదైన మోడళ్లలో కూడా ఇది ఒకటి. అలాంటి ఓ అరుదైన ద్విచక్ర వాహనాన్ని ఏడేళ్ల క్రితం కొచ్చి డిఆర్‌ఐ విభాగం సీజ్ చేసింది. అప్పటి నుండి ఇది గడచిన ఏడేళ్లుగా వారి కార్యాలయ ఆవరణలో బయట ఉంచబడింది.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

ఇంతటి ఖరీదైన బైక్ ఇలా ఏడేళ్లుగా ఎండకు ఎండుతూ, వానకు నానుతూ దాదాపుగా పాడైపోయింది. అయితే, ఓ నెటిజెన్ ఈ బైక్ ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను గమనించిన ఓ బైక్ ఔత్సాహికుడు, వేలంలో ఈ అరుదైన డుకాటీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నాడు. కాగా, అధికారులు ఈ బైక్‌ను ఏడేళ్ల క్రితం సీజ్ చేయడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. గడచిన ఏడేళ్లుగా ఈ బైక్‌కు సంబంధించిన వ్యక్తులు కూడా దానిని సొంతం చేసుకునేందుకు రాలేదు.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

డ్యుకాటి 1098 ఎస్ ట్రైకలర్ ఒక ఇంపోర్టెడ్ బైక్. ఇది భారతదేశంలో తయారు చేయబడలేదు మరియు విక్రయించబడలేదు. బహుశా, దీనిని విదేశాల నుండి అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే కారణంతో అధికారులు సీజ్ చేసి ఉండవచ్చు. ఇంటర్నెట్‌లో డ్యుకాటి బైక్ ఫొటోలను చూసిని ఓ యువకుడు, ఆర్టీఓ అధికారులను సంప్రదించి, అందుకు చెల్లించాల్సిన డబ్బును కూడా చెల్లించి ఈ ఇటాలియన్ బ్యూటీని తన సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంతో వ్యయప్రయాసలతో దీనిని తిరిగి కొత్త దానిలా రీస్టోర్ చేశాడు.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

డ్యుకాటి 1098 ఎస్ ట్రైకలర్ ఎందుకు అంత అరుదైన బైక్?

ఇటాలియన్ కంపెనీ డ్యుకాటి తమ 1098 ఎస్ ట్రైకలర్ బైక్ ను కేవలం 1013 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే, ప్రపంచవ్యాప్తంగా కేవలం 1013 యూనిట్ల మోటార్‌సైకిళ్లు మాత్రమే విక్రయించబడ్డాయన్నమాట. ఈ మోడల్ లిమిటెడ్ ప్రొక్షన్ కారణంగా ఇది అత్యంత అరుదైన బైక్‌గా నిలుస్తుంది. డ్యుకాటి తొలిసారిగా 2007లో ఈ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం, ఈ మోడల్ ఉత్పత్తిలో లేనప్పటికీ, ఈ బైక్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

డ్యుకాటి 1098 ఎస్ ట్రైకలర్ యొక్క ఆకర్షణీయమైన డిజైన్, పరిమిత ఎడిషన్ మరియు అత్యంత శక్తివంతమైన ఇంజన్ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ బైక్ పేరుకి తగినట్లుగానే (ట్రైకలర్) ఇది ఇటలీ జెండాను ప్రతిబింబించేలా ఉంటుంది. ఇటలీ జెండాలో కూడా మూడు రంగులు ఉంటాయి. డ్యుకాటి ఈ బైక్ ను ట్రాక్ మరియు సాధారణ రహదారి ఉపయోగం కోసం రూపొందించబడింది.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

ఈ బైక్ అరుదైన బైక్‌గా కనిపించడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ బైక్‌లో ఉపయోగించిన ముఖ్యమైన ఉపకరణాలు దీనిని మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. డ్యుకాటి 1098 ఎస్ ట్రైకలర్ బైక్‌లో ప్రత్యేకమైన టెర్మిగ్నోని రేస్-స్పెక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు ఈసియూ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌ పొ రూపొందించబడింది.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

డ్యుకాటి 1098 ఎస్ ట్రైకలర్ బైక్ రేసింగ్ గోల్డ్ కలర్‌తో అలంకరించబడింది. ఇందులో శక్తివంతమైన 1098 సీసీ ఎల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 160 బిహెచ్‌పి శక్తిని మరియు 123 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఇంకా ఇందులో సింగిల్‌ సైడెడ్ స్వింగార్మ్‌, సర్దుబాటు చేయగల ఓహ్లిన్స్ ఫోర్కులు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ధర సుమారు రూ.35 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుందని అంచనా.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

భారత్‌లో అప్‌డేటెడ్ 2023 సిరీస్ డ్యుకాటి పానిగేల్ వి4 మోడళ్లు విడుదల

డ్యుకాటి బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ ఇటాలియన్ బ్రాండ్ గడచిన నెలలో భారత మార్కెట్లో తమ పానిగేల్ వి4 సిరీస్‌లో కొత్త 2023 మోడల్ లైనప్‌ను విడుదల చేసింది. ఇటీవలే అంతర్జాతీ మార్కెట్లలో విడుదలైన కొత్త 2023 పానిగేల్ వి4 (2023 Ducati Panigale V4) సిరీస్‌ ఇప్పుడు భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. డ్యుకాటి పానిగేల్ వి4 సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మునుపటి మోడళ్లతో పోలిస్తే, ఇవి చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటాయి.

ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ..

కొత్త 2023 డ్యుకాటి పానిగేల్ వి4 సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు ఉన్నాయి. వీటిలో పానిగేల్ వి4, పానిగేల్ వి4 ఎస్ మరియు పానిగేల్ వి4 ఎస్‌పి2 మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 26.49 లక్షలు, రూ. 31.99 లక్షలు మరియు రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. కొత్త 2023 డ్యుకాటి పానిగేల్ వి4 సిరీస్ మోటార్‌సైకిళ్లలో బేస్ వేరియంట్ ఇప్పుడు కొత్త ఇంజన్ బ్రేక్ కంట్రోల్ (EBC) ఇవో 2 సాఫ్ట్‌వేర్‌తో అమర్చబడింది, ఇది మూడు ఎంచుకోదగిన స్థాయిలలో గేర్-బై-గేర్ కాలిబ్రేషన్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Seized for 7 years a rare ducati 1098s tricolore full restored and found a new home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X